BigTV English
Advertisement

Face Pack: అందాన్ని రెట్టింపు చేసే ఫేస్ ప్యాక్ ఇదే.. ఓ సారి ట్రై చేసి చూడండి మరి

Face Pack: అందాన్ని రెట్టింపు చేసే ఫేస్ ప్యాక్ ఇదే.. ఓ సారి ట్రై చేసి చూడండి మరి

Face Pack For Skin Glow:  చర్మం మెరుస్తూ అందంగా ఉండాలని అందరూ కోరకుంటారు. అందుకోసం రకరకాల క్రీములను వాడతారు. అయితే ఇలా బయట దొరికే క్రీములను వాడే బదులు గా ఇంట్లోనే న్యాచురల్‌ ఫేస్ ప్యాక్స్ తయారు చేసుకొని వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అంతే కాకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటాయి. ఇంట్లో ఉండే టమోటా, క్యారెట్ , ముల్తానీ మట్టితో ఫేస్ తయారు చేసుకొని వాడవచ్చు. దీని ద్వారా ముఖం అందంగా మారుతుంది. అంతే కాకుండా ముఖంపై ఉన్న మచ్చలు కూడా తొలగిపోతాయి. మరి ఇన్ని ప్రయోజనాలున్న ఈ ఫేస్ ప్యాక్‌ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా..


టమోటా, క్యారెట్ ఉపయోగాలు: టమోటాలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. చర్మానికి అవసరమైన తేమను నిలుపుకోవడానికి, రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి టమోటా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇదిలా ఉంటే క్యారెట్ లో విటమిన్లు, ఖనిజాలు, పాలీఫెనాల్స్ అధికంగా ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్స్ గా పని చేయడమే కాకుండా చర్మానికి కొత్త జీవం పోస్తుంది. క్యారెట్‌లో విటమిన్ – సి కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది ఆక్సీకరణ ఒత్తిడి నుంచి చర్మాన్ని కాపాడుతుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు చర్మ స్థితి స్థాపకతను మెరుగుపరచడానకి , చర్మ పరితీరును బలోపేతం చేయడానికి సహయపడుతుంది.

ముల్తానీ మట్టికి ఆయుర్వేదంలో చాలా ప్రాధాన్యత ఉంటుంది. చాలా రకాల సౌందర్య సాధనాల్లో దీనిని ఉపయోగిస్తారు. ముల్తానీ మట్టి చర్మాన్ని మృదువుగా చేస్తుంది. అంతే కాకుండా మొటిమలు తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. చర్మంపై ఉన్న బ్లాక్ హెడ్స్ కూడా తొలగిపోతాయి. ముల్తానీ మట్టిని తరుచుగా ఫేస్ ప్యాక్ లాగా వాడటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.


టమోట, క్యారెట్, ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్ తయారీ..
కావలసిప పదార్థాలు:

  • ఒక టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి
  • ఒక టేబుల్ స్పూన్ క్యారెట్ రసం
  • ఒక టేబుల్ స్పూన్ టమోటా రసం

ముందుగా క్యారెట్ ను కడిగి, తురిమి దానిలో నుంచి రసాన్ని తీసుకోవాలి. ఆ తర్వాత ఒక టమోటాను తీసుకుని దానిని మెత్తగా చేసి రసాన్ని తీసుకోవాలి. ఈ రెండు రసాలను తీసుకుని అందులో ముల్తానీ మట్టిని కలిపి చక్కని మిశ్రమంలాగా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని ముఖం మెడ భాగానికి రాసి అరగంట పాటు అలాగే ఉంచాలి. తరువాత చల్లని లేదా గోరు వెచ్చని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి.

Also Read: ఫేషియల్స్ కోసం బ్యూటీపార్లర్‌కు వెళ్తున్నారా ? ఇంట్లోనే చేసుకోండిలా !

టమోటా, క్యారెట్, ముల్తానీ మట్టితో తయారు చేసిన ఈ ఫేస్ ప్యాక్ ను వారానికి ఒక సారి ముఖానికి అప్లై చేసుకోవచ్చు. ఇవి అన్ని సహజమైన పదార్థాలే అయినా కొందరికి ఎలర్జీ కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ మిశ్రమాన్ని మొదటగా మోచేయిపై ఉపయోగించిన తర్వాత ముఖానికి, మెడకు అప్లై చేయడం మంచిది. ఈ ఫేస్ ప్యాక్ వల్ల ముఖం అందంగా తయారవుతుంది. అంతే కాకుండా తాజాగా మారుతుంది.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Dark Tourism: చీకటి అధ్యాయాలపై ఉత్సుకత.. నాణేనికి మరో వైపే డార్క్ టూరిజం!

Zumba Dance: బోరింగ్ వర్కౌట్స్‌తో విసుగొస్తుందా.. అయితే మ్యూజిక్ వింటూ స్టెప్పులేయండి!

Karivepaku Rice: కరివేపాకు రైస్ పావు గంటలో చేసేయొచ్చు, రెసిపీ చాలా సులువు

Trial Separation: విడాకులు తీసుకునే ముందు.. ఒక్కసారి ‘ట్రయల్ సెపరేషన్’ ప్రయత్నించండి!

Wasting Money: విలాసవంతమైన కోరికలకు కళ్లెం వేయకుంటే.. మిమ్మల్ని చుట్టుముట్టే సమస్యలివే!

Food noise: నెక్ట్స్ ఏం తినాలో ముందే ప్లాన్ చేస్తున్నారా.. అయితే అది ఫుడ్ నాయిసే!

Crocs: క్రాక్స్ ఎందుకంత ఫేమస్?.. దీని వెనుకున్న ముగ్గురి స్నేహితుల కథేంటి?

Mumbai Style Vada Pav: ముంబై స్టైల్ వడా పావ్ రెసిపీ.. క్షణాల్లోనే రెడీ చేసుకోవచ్చు !

Big Stories

×