Rishabh Pant: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కు సంబంధించిన మెగా వేలం జరుగుతోంది. ఈ మెగా వేలంలో అందరూ ఊహించినట్లుగానే రిషబ్ పంత్ ( Rishabh Pant ) భారీ ధర సంపాదించుకున్నాడు. రిషబ్ పంతును ఏకంగా 27 కోట్లకు లక్నో గెల్చుకుంది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే… హైయెస్ట్ రేటు పలికిన ఆటగాడిగా పంత్ రికార్డు సృష్టించాడు.
Also Read: GUJARAT TITANS: రబడా, బట్లర్ ను దక్కించుకున్న గుజరాత్… ఎవరికి ఎంతంటే?
Also Read: Shreyas Iyer: ఐపీఎల్ లో చరిత్రలో అత్యధికం… ఏకంగా 26.75 కోట్లు
రిషబ్ పంత్ కోసం సన్రైజర్స్ హైదరాబాద్, లక్నో చివరి వరకు పోటీపడ్డాయి. అంతలోనే ఢిల్లీ క్యాపిటల్స్ ఆర్టీఎం ప్రయోగించింది. కానీ లక్నో 27 కోట్లకు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించడంతో ఢిల్లీ వదులుకుంది. ఈ తరణంలోనే లక్నో… రిషబ్ పంత్ ను 27 కోట్లకు లక్నో గెల్చుకుంది. దీంతో ఐపీఎల్ చరిత్రలో రిషబ్ పంత్ రికార్డు సృష్టించాడు.
Also Read: Arshdeep Singh: అర్షదీప్ ను RTM కార్డుతో దక్కించుకున్న పంజాబ్.. ఏకంగా 18 కోట్లు!
లక్నోకు కెప్టెన్ లేకపోవడంతో… అందుకే అతన్ని… 27 కోట్లకు కొనుగోలు చేసేందుకు సంజయ్ ఆసక్తి చూపడం జరిగింది. ఈసారి లక్నోను కేఎల్ రాహుల్ వదిలేసిన సంగతి తెలిసిందే. ఇక లక్నో కెప్టెన్గా రిషబ్ పంత్ కాబోతున్నాడు అన్నమాట.
వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్ల పూర్తి జాబితా:
1. రిషబ్ పంత్ – రూ. 27 కోట్లు
2. ఐడెన్ మార్క్రామ్ – రూ. 2 కోట్లు
3. డేవిడ్ మిల్లర్ – రూ.7.5 కోట్లు
4. మిచెల్ మార్ష్ – రూ. 3.4 కోట్లు
5. అవేష్ ఖాన్ – రూ. 9.75 కోట్లు
6. అబ్దుల్ సమద్ – రూ. 4.2 కోట్లు
7. ఆర్యన్ జుయల్ – రూ. 30 లక్షలు
నిలుపుకున్న ఆటగాళ్ల పూర్తి జాబితా: నికోలస్ పూరన్, మయాంక్ యాదవ్, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్, ఆయుష్ బడోని
విడుదలైన ఆటగాళ్ల పూ ర్తి జాబితా: KL రాహుల్, దేవదత్ పడిక్కల్, క్వింటన్ డి కాక్, అష్టన్ టర్నర్, దీపక్ హుడా, కృష్ణప్ప గౌతం, కృనాల్ పాండ్యా, కైల్ మే యర్స్, మార్కస్ స్టోయినిస్, మొహమ్మద్. అర్షద్ ఖాన్, ప్రేరక్ మన్కడ్, యుధ్వీర్ సింగ్, అర్షిన్ కుల కర్ణి, డేవిడ్ విల్లీ, శివమ్ మావి, షమర్ జోసెఫ్, మాట్ హెన్రీ, యశ్ ఠాకూర్, అమిత్ మిశ్రా, నవీన్ ఉల్ హక్, ఎం సిద్ధార్థ్