Hair Oils: ప్రస్తుతం చాలా మంది జుట్టు రాలే సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారు రకరకాల హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. అయినప్పటికీ ఫలితం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఇలాంటి సమయంలో హోం రెమెడీస్ వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా హెయిర్ ఆయిల్స్ జుట్టుకు తగిన పోషణను అందిస్తాయి. ఇంట్లో తయారు చేసుకున్న వివిధ రకాల హెయిర్ ఆయిల్స్ కూడా అద్భుతాలు చేస్తాయి. ఇంతకీ జుట్టు రాలకుండా ఉండటంతో పాటు.. బాగా పెరగడానికి ఎలాంటి ఆయిల్స్ వాడాలనే విషయాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
భ్రింగ్రాజ్ ఆయిల్:
భ్రింగరాజ్ ను ‘జుట్టుకు రాజు’ అని పిలుస్తారు. దీనిలో ఉండే పోషకాలు లోతుగా వెళ్లి జుట్టు మూలాలను పోషిస్తాయి. ఈ నూనె జుట్టు రాలడాన్ని నిరోధించడమే కాకుండా కొత్త జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. భ్రింగరాజ్ నూనెతో క్రమం తప్పకుండా మసాజ్ చేయడం వల్ల జుట్టు నల్లగా, మందంగా, బలంగా ఉంటుంది. అంతే కాకుండా జుట్టు రాలడం కూడా చాలా వరకు తగ్గుతుంది. తరచుగా ఈ ఆయిల్ వాడటం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి.
టీ ట్రీ ఆయిల్:
టీ ట్రీ ఆయిల్‌లో యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి తలని శుభ్రంగా ఉంచుతాయి. అంతే కాకుండా చుండ్రు వంటి సమస్యలను కూడా తొలగిస్తాయి. ఈ నూనె జుట్టు మూలాల్లో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా ఇది జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. కొబ్బరి నూనె వంటి వాటితో కలిపి దీనిని వాడటం మంచిది. ఇలా వాడటం వల్ల మాత్రమే మంచి ఫలితం ఉంటుంది. తరచుగా జుట్టుకు ఈ ఆయిల్ వాడటం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. అంతే కాకుండా జుట్టు సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి.
రోజ్మేరీ ఆయిల్:
రోజ్మేరీ ఆయిల్ జుట్టు పెరుగుదలకు చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. అంతే కాకుండా ఇది తలలో రక్త ప్రసరణను పెంచుతుంది. జుట్టు మూలాలను బలపరుస్తుంది. రోజ్మేరీ ఆయిల్ అలోపేసియా (జుట్టు రాలడం) సమస్యలో కూడా సహాయపడుతుందని పరిశోధనలో తేలింది. అందుకే జుట్టు రాలే సమస్యతో ఇబ్బంది పడే వారు తరచుగా దీనిని వాడటం అలవాటు చేసుకోవాలి.
Also Read: బియ్యం పిండితో.. మెరిసే చర్మం, ఎలా వాడాలంటే ?
కొబ్బరి నూనె:
కొబ్బరి నూనెను శతాబ్దాలుగా జుట్టు పెరుగుదలకు ఉపయోగిస్తున్నారు. ఇందులో కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు ఉంటాయి. ఇవి జుట్టును లోతుగా పోషిస్తాయి. అంతే కాకుండా ఈ నూనె జుట్టు యొక్క తేమను కాపాడుతుంది. చివర్లు చిట్లడం సమస్యను కూడా తగ్గిస్తుంది. తరచుగా ఈ ఆయిల్ వాడటం వల్ల కూడా అనేక లాభాలు ఉంటాయి. ఈ ఆయిల్ లో ఆముదం వంటివి కలిపి వాడినా కూడా జుట్టు సంబంధిత సమస్యల నుంచి పూర్తిగా ఉపశమనం లభిస్తుంది.
బాదం నూనె:
బాదం నూనెలో విటమిన్ ఇ, మెగ్నీషియం, కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇది తల చర్మాన్ని మృదువుగా చేస్తుంది. అంతే కాకుండా జుట్టు రాలడాన్ని కూడా నివారిస్తుంది. క్రమం తప్పకుండా బాదం నూనెతో మసాజ్ చేయడం వల్ల జుట్టుకు మెరుపు వస్తుంది. అంతే కాకుండా జుట్టు కూడా బలంగా మారుతుంది.