BigTV English

White Hair: తెల్ల జుట్టును నల్లగా మార్చేందుకు రంగే వేయక్కర్లేదు.. ఓ సారి ఈ ఆయిల్ ట్రై చేయండి

White Hair: తెల్ల జుట్టును నల్లగా మార్చేందుకు రంగే వేయక్కర్లేదు.. ఓ సారి ఈ ఆయిల్ ట్రై చేయండి

 Hair Oil For White Hair : ప్రస్తుతం తెల్ల జుట్టు సమస్యను చాలా మంది ఎదుర్కొంటున్నారు. చిన్న వయస్సులోనే జుట్టు రంగు మారుతోంది. ఈ సమస్యతో చిన్నా పెద్దా తేడా లేకుండా ఇబ్బంది పడుతున్నారు. జుట్టు రంగు మారడానికి అనేక కారణాలు ఉన్నాయి. తీసుకునే ఆహారంలో సరైన పోషకాలు లేకపోవడం వల్ల కూడా ఈ సమస్య అధికమవుతుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తెల్ల జుట్టును నల్లగా ఎలా మార్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.


శీకాయ:

శీకాయ వల్ల ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు. తలలో దురద లాంటి సమస్యలను కూడా ఇది నివారిస్తుంది. చిన్న వయస్సులో తెల్ల జుట్టు సమస్యను ఇది తగ్గిస్తుంది. జుట్టు నలుపుదనాన్ని శీకాయ తిరిగి తీసుకువస్తుంది. వెంట్రుకలు రాలిపోయే సమస్యను కూడా నివారిస్తుంది. ఆరోగ్యకరమైన కాంతివంతమైన జుట్టును అందిస్తుంది.


బాదం నూనె, పెరుగు:

తెల్ల జుట్టు సమస్యను బాదం నూనె నివారిస్తుంది. బాదం నూనె వాడటం వల్ల తలలో చుండ్రు తగ్గిపోవడంతో పాటు కురులు దృఢంగా ఉంటాయి. ఇక మూడవ పదార్థం పెరుగు తరతరాలుగా జుట్టు పోషణకు పెరుగును వాడుతూ ఉన్నారు. ఇందులో విటమిన్ డి సమృద్ధిగా లభిస్తుంది. పెరుగు తెల్ల జుట్టు సమస్యకు చాలా బాగా ఉపయోగపడుతుంది. జుట్టుకు పెరుగు నుంచి ఫుడ్‌గా చెప్పుకోవచ్చు. ఇంట్లో ఉండే వాటిలో చాలా పోషకాలు ఉంటాయి. ఆరోగ్యకరమైన కేశాలు తిరిగివచ్చేలా ఇవి సహాయపడతాయి. శీకాయ, పెరుగు, బాదం ఆయిల్ ఈ మూడింటిని ఉపయోగించి తెల్ల జుట్టును ఇంట్లోనే  నల్లగాా మార్చు కోవచ్చు. అది ఎలానో ఇప్పుడు ఇప్పుడు తెలుసుకుందాం.

తయారీ విధానం:

ముందుగా ఒక ఖాళీ గిన్నెను తీసుకుని అందులో ఒక టీస్పూన్ శీకాయ పౌడర్ వేసుకోవాలి. ఆ తర్వాత ఒక స్పూన్ బాదం ఆయిల్, టీ స్పూన్ పెరుగును కూడా అందులో కలుపుకోవాలి. శీకాయ, బాదం నూనె,పెరుగు ఈ మూడింటిని బాగా మిక్స్ చేయండి. వీటిలో ఉండే గుణాలు తెల్ల జుట్టు సమస్యను పూర్తిగా తొలగించే అవకాశం ఉంది. ఈ మిశ్రమం రెడీ అయిన తర్వాత దాన్ని జుట్టుకు అప్లై చేసుకోవాలి. తలస్నానం చేసే కంటే అరగంట ముందు ఈ మిశ్రమాన్నిరాసుకోవాలి.

20 నుంచి 30 నిమిషాల పాటు జుట్టును అలాగే వదిలేయండి. తర్వాత ఏదైనా షాంపు లేదంటే కుంకుడు కాయలు వాడి చల్లని నీటితో తల స్నానం చేయండి. వారంలో ఒకసారి దీనిని జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు సమస్య నుంచి త్వరగా బయటపడతారు. దీంతో అందమైన పొడవైన జుట్టు మీ సొంతం చేసుకోవచ్చు. తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్న నేటి యువతీ, యువకులకు ఇది బాగా ఉపయోగపడుతుంది.

Also Read: క్యాబేజీ తింటే ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు..

పెరుగు, బాదం నూనె, శీకాయలో ఉండే గుణాలు తెల్ల జుట్టు సమస్య పూర్తిగా తొలగిస్తాయి. తరుచుగా జుట్టుకు ఈ మిశ్రమాన్ని అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దీంతో అందమైన, బలమైన జుట్టును మీ సొంతం చేసుకోవచ్చు. వీటి వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.

Related News

Pneumonia causes: న్యుమోనియా రావడానికి అసలు కారణాలివే !

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Late Sleep: రాత్రి 11 తర్వాత నిద్రపోతున్నారా ? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు !

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !

Momos side effects: మొమోస్ తింటున్నారా? అయితే ఈ నిజం తప్పక తెలుసుకోండి..

Big Stories

×