BigTV English

Homemade Hair Mask: జుట్టు రాలడాన్ని తగ్గించే హెయిర్ మాస్క్ ఇదే !

Homemade Hair Mask: జుట్టు రాలడాన్ని తగ్గించే హెయిర్ మాస్క్ ఇదే !

Homemade Hair Mask: ప్రస్తుతం చాలా మంది ఎదుర్కుంటున్న సమస్యల్లో జుట్టు రాలడం కూడా ఒకటి. మారిన జీవన శైలితో పాటు అనారోగ్య సమస్యల వల్ల జుట్టు రాలుతుంది. సాధారణంగా తల దువ్వుకునేటప్పుడు, తల స్నానం చేసేటప్పుడు లేదా తలకు నూనె రాసుకునేటప్పుడు సుమారు 50 వెంట్రుకలు రాలే అవకాశం ఉంటుంది. ఇది సహజమైంది. కానీ అంతకుమించి వెంట్రుకలు రాలితే మాత్రం జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే రాలుతున్న జుట్టును ఎలాగైనా కాపాడుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తుంటారు.


అందుకు మనం తీసుకునే ఆహారం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. తీవ్రమైన ఒక్తుడి, ఆందోళన, కాలుష్యం కూడా జుట్టు రాలడానికి కారణం అవుతాయి. అలాంటప్పుడు కారణాలు తెలుసుకుని చికిత్స తీసుకుంటే జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టు రాలడాన్ని అరికట్టే చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

జుట్టు రాలకుండా  ఉండేందుకు తీసుకోవాల్సిన ఆహారాలు..


చేపలు, గుడ్లు
కొల్లాజిన్ అధికంగా ఉండే ఆహార పదార్థాలు
ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్
బ్రోకలీ లాంటి తాజా పండ్లు
విటమిన్ 3 ఎక్కువగా ఉండే ఆహారం
చిలగడ దుంపలు
త్రిఫల చూర్ణం
బృంగరాజ్, అశ్వగంధ చూర్ణం

చాలా మంది డైటింగ్ చేసేటప్పుడు పూర్తిగా అన్నం తినడం మానేస్తారు. ఇలాంటి సమయంలో కూడా జుట్టు రాలే సమస్య ప్రారంభం అవుతుంది. మనం తీసుకునే ఆహారం వల్ల కూడా జుట్టు రాలడం రాలిపోయే అవకాశం ఉంటుంది. జుట్టు రాలే సమస్య ఉన్న వారు కొన్ని రకాల పదార్థాలతో తయారు చేసిన హెయిర్ మాస్క్ తలకు పట్టిస్తే మంచి ఫలితం ఉంటుంది.

కావలసినవి:

కోడిగుడ్డు
పెరుగు
అరటిపండు
ఆలివ్ నూనె
నిమ్మరసం
విటమిన్ ఇ క్యాప్సిల్స్

తయారీ విధానం:
మొదటగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల పెరుగు, ఒక గుడ్డు పగల కొట్టి వేయాలి. దీనికి సగం అరటిపండు, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, కాస్త ఆలివ్ ఆయల్‌ను కలుపుకోవాలి. ఆ తర్వాత దీనిలో ఒక విటమిన్ ఇ క్యాప్సిల్ వేసి మిశ్రమం తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసిన మిశ్రమాన్ని కుదుళ్లకు పట్టించాలి. ఆ తర్వాత 15 నుంచి 20 నిమిషాల పాటు అలాగే ఉంచి నీటితో శుభ్రం చేసుకోవాలి.

Also Read: జుట్టు రాలుతోందా ? ఈ హెయిర్ ప్యాక్ ఒక్క సారి ట్రై చేసి చూడండి

పీసీఓడీ, థైరాయిడ్ ఉన్నవారిలో కూడా జుట్టు ఊడిపోతుంది. మొదటి దశలోనే కారణాన్ని గుర్తించడం వల్ల ఈ సమస్య నుంచి బయట పడొచ్చు. అంతే కాకుండా ఆరోగ్యంగా, ఒత్తుగా జుట్టు పెరగడానికి తల స్నానం చేసిన తర్వాత జుట్టును దువ్వుకునే వరకు జాగ్రత్తలు తీసుకోవాలి.

జుట్టు తత్వాన్ని బట్టి షాంపూను ఎంపిక చేసుకోవాలి. వారానికి రెండుసార్లు తలస్నానం చేయాలి. పొడి జుట్టు ఉన్నవారు తల స్నానానికి ముందు నూనె పెట్టుకోవాలి. జింక్, బయోటిన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. పదే పదే తలను దువ్వడం చేయకూడదు. ఒత్తిడి, ఆందోళనలను సాధ్యమైనంతవరకు తగ్గించుకోవాలి. చుండ్రు, పెనుకొరకడం వంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ఉండాలి.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Non-vegetarian food: ముక్క లేనిదే ముద్ద దిగడం లేదా ? అయితే జాగ్రత్త !

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Big Stories

×