BigTV English

Telangana Floods: రాజకీయాలకు ఇది సమయం కాదు.. కేంద్రమంత్రులు రావాలి : సీఎం రేవంత్

Telangana Floods: రాజకీయాలకు ఇది సమయం కాదు.. కేంద్రమంత్రులు రావాలి : సీఎం రేవంత్

CM Revanth Reedy Meeting in Suryapet : తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకు భారీగా పంటనష్టం వాటిల్లింది. జిల్లాల వారిగా జరిగిన పంట నష్టం, వరద మిగిల్చిన ఆస్తి, ప్రాణ నష్టాలపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమావేశమై వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో సూర్యాపేట జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. సాగర్ ఎడమ కాలువ తెగడం వల్ల జరిగిన పంటనష్టంపై ఆయన ఆరా తీశారు.


సూర్యాపేట జిల్లాలో 30 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైందని అధికారులు సీఎంకు తెలిపారు. జిల్లాలో వాటిల్లిన పంట, ఆస్తి నష్టం వివరాలపై ప్రాథమిక నివేదిక సమర్పించారు. భారీ వర్షాల సమయంలో జిల్లా యంత్రాంగం, మంత్రులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉన్నారని సీఎం తెలిపారు. వరదల నేపథ్యంలో ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లకుండా ప్రజా ప్రతినిధులు, అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారని, ఖమ్మం, నల్గొండ పరిస్థితిపై మోదీ, అమిత్ షా, రాహుల్ గాంధీలకు వివరించి సహాయం చేయాలని కోరామన్నారు.

సూర్యాపేట కలెక్టర్ కు తక్షణ సహాయం కింద రూ.5 కోట్లు మంజూరు చేశారు. జిల్లాలో వర్షాల కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే పంట నష్టం జరిగిన వారికి ఎకరానికి రూ.10 వేలు, ఇళ్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే వర్షాల నేపథ్యంలో స్కూళ్లకు సెలవులిచ్చే విషయంపై జిల్లా కలెక్టర్లే నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.


Also Read: తెలంగాణలో వరదలు.. మిస్సయిన తండ్రీ-కూతురు బాడీ లభ్యం..

వరద బాధితులకు సహాయం చేసేందుకు ముందుకొచ్చిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి ధన్యవాదాలు తెలిపారు. ఒకరు అమెరికాలో, మరొకరు ఫాంహౌస్ లో ఉండి వర్షాలపై ట్వీట్లు పెడుతున్నారని, ఇలాంటి సమయంలో బురద రాజకీయాలు తగదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బెయిల్ వస్తే 20 మంది ఎమ్మెల్యేలతో ఢిల్లీ వెళ్లిన నేతలకు వరద బాధితులను పరామర్శించే తీరక లేదా అని ఈ సందర్భంగా ప్రశ్నించారు. సీఎంగా తాను మూడురోజులుగా వర్షాలు, వరదలపై సమీక్ష చేస్తున్నానని, మంత్రులంతా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారని తెలిపారు.

భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో రూ.5 వేల కోట్ల నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా ఉందన్న సీఎం.. కేంద్రం తక్షణ సహాయం కింద రూ.2 వేల కోట్లు మంజూరు చేయాలని కోరారు. కేంద్రమంత్రులైన కిషన్ రెడ్డి, బండిసంజయ్ లు రాష్ట్రానికి నిధులు తెచ్చేందుకు కృషి చేయాలని విన్నవించారు సీఎం రేవంత్ రెడ్డి.

 

Related News

TGPSC Group-1: గ్రూపు-1 వివాదం కీలక మలుపు.. హైకోర్టులో మరో అప్పీలు

Medaram Maha Jatara: మేడారం మహాజాతర డిజిటల్ మాస్టర్ ప్లాన్ విడుదల

Sammakka-Saralamma: వనదేవతలు సమ్మక్క- సారలమ్మలు అన్ని గమనిస్తున్నారు.. కేంద్రంపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

CM Revanth Reddy: సమ్మక్క-సారక్కలకు నిలువెత్తు బంగారం సమర్పించిన సీఎం రేవంత్

Heavy Rains: మరో అల్పపీడనం.. నాలుగు రోజులు వర్షాలు దంచుడే దంచుడు..

Hyderabad News: పండగ సమీపిస్తున్న వేళ.. జోరుగా నాన్ డ్యూటీ లిక్కర్, అధికారులు ఉక్కుపాదం

Hyderabad News: హైదరాబాద్‌ వాసులకు సూచన.. ఆ ప్రాంతాల్లో 24 గంటలపాటు తాగునీటి సరఫరా బంద్

Medaram: నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం పర్యటన

Big Stories

×