E-Paper
Advertisement

Homemade Hair Oil: తెల్లజుట్టును నల్లగా మార్చే ఆయిల్ ఇదే !

Homemade Hair Oil: తెల్లజుట్టును నల్లగా మార్చే ఆయిల్ ఇదే !
Advertisement

Homemade Hair oil: ప్రస్తుతం జుట్టు రాలడం అనేది ప్రధాన సమస్యగా మారింది. చాలా మంది జుట్టు సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారు బయట మార్కెట్లో దొరికే రకరకాల ఆయిల్స్ తో పాటు షాంపూలను వాడుతున్నారు. కానీ వీటిని వాడటం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు.

ఇదిలా ఉంటే వీటికి అయ్యే ఖర్చు కూడా ఎక్కువే. అందుకే ఇలాంటి ఖరీదైన ఆయిల్స్ వాడకుండా ఇంట్లోనే హెయిర్ ఆయిల్ తయారు చేసుకుని వాడటం అలవాటు చేసుకోండి. వీటి వల్ల జుట్టు సంబంధిత సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. అంతే కాకుండా జుట్టు బాగా పెరుగుతుంది. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

హెయిర్ ఆయిల్ తయారీకి కావాల్సినవి:
కొబ్బరి నూనె – 500 గ్రాములు
కరివేపాకు – 5 నుండి 6 రెమ్మలు
తరిగిన ఉల్లిపాయలు – 2
కలోంజి విత్తనాలు – 50 గ్రాములు
కలబంద – 50 గ్రాములు
మెంతి గింజలు – 100 గ్రాములు

తయారీ విధానం: ముందుగా ఒక మందపాటి గిన్నెను తీసుకుని అందులో 500 గ్రాముల కొబ్బరి నూనె వేసి సన్నని మంటపై ఉంచండి. ఆ తర్వాత పైన చెప్పిన మోతాదుల్లో కరివేపాకు, తరిగిన ఉల్లిపాయలు కలోంజి , మెంతులు, కలబందను వేసి10 -15 నిమిషాల పాటు మరిగించండి. ఆ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి ఆయిల్ ని చల్లారనివ్వాలి. అనంతరం ఒక సీసాలో స్టోర్ చేసుకోవాలి.

Advertisement

వారానికి రెండుసార్లు ఈ నూనెను మీ జుట్టు, కుదుళ్లకు సున్నితంగా మసాజ్ చేయండి. ఆ తర్వాత మరుసటి రోజు మీరు వాడే షాంపూతో తలస్నానం చేయండి. ఈ ఆయిల్ మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది. అంతే కాకుండా ఇది జుట్టు మూలాలను బలపరుస్తుంది. ఈ ఆయిల్ తరుచుగా వాడితే 15 రోజుల్లో అద్భుతమైన ఫలితాలను చూస్తారు. జుట్టు బలంగా, మందంగా, పొడవుగా మారుతుంది. జుట్టు రాలడం కూడా క్రమంగా తగ్గిపోయి తెల్లజుట్టు సమస్య దూరమవుతుంది.

ఇదే కాకుండా జుట్టు రాలడాన్ని తగ్గించడానికి, జుట్టు పెరుగుదలకు సరైన ఆహారం తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. శరీరంలో అవసరమైన పోషకాలు లేకపోవడం జుట్టుపై చాలా ప్రభావం చూపుతుంది. అలాంటి వారు జుట్టు రాలడం సమస్యతో ఇబ్బంది పడుతుంటే కనక తప్పకుండా ఈ హోం మేడ్ హెయిర్ ఆయిల్ ట్రై చేయండి.

Also Read: ఈ ఆయిల్స్‌తో జుట్టు పెరగడం పక్కా !

జుట్టు రాలడాన్ని నివారించడానికి అనేక ఆయిల్స్ వాడుతుంటారు. కానీ అసలు పరిష్కారం ఆహారంలోనే ఉంది. పోషకాహార లోపం కారణంగా కూడా జుట్టు రంగు మారుతుంది. అంతే కాకుండా త్వరగా రాలిపోతుంది. ప్రతి ఒక్కరి జుట్టు రోజు కొంత వరకు రాలుతుంది, కానీ మీ జుట్టు విపరీతంగా రాలుతుంటే మాత్రం అది హార్మోన్ల సమస్య కావచ్చు. అందుకే వీటిని నిరించడానికి పోషకాహారం తీసుకోవడం కూడా చాలా అవసరం అని గుర్తుంచుకోండి.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

ఈ డ్రింక్స్ వేడి వేడిగా తాగడం వల్ల క్యాన్సర్ ప్రమాదం మూడు రెట్లు..

మాత్రను నోట్లో వేసుకుని నీళ్లు తాగాలా? లేదా నీళ్లతోపాటు మాత్ర వేసుకోవాలా? ఏది డేంజర్?

ప్లాస్టిక్ స్టూళ్ల మధ్య రంధ్రం.. డిజైన్ కోసం కాదా? కారణం తెలిస్తే పక్కా షాకవుతారు!

అమెజాన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. రూ.46 లక్షల సాలరీ.. అన్నీ వదిలి ఇండియన్ ఆర్మీలోకి

బిడ్డకు ఆకలి వేసిందో లేదో ఎలా తెలుసుకోవాలి? తల్లిదండ్రులకు రెస్పాన్సివ్ ఫీడింగ్ గైడ్

మనసంతా ప్రేమ.. ఈ తేదీల్లో పుట్టినవారిని పెళ్లి చేసుకుంటే మీరు చాలా లక్కీ

పండుగ వేళ అందరిలో స్పెషల్‌గా కనిపించాలా? ఈ 5 మేకప్ లుక్స్ ట్రై చేయండి

డేటింగ్‌కు వెళ్లినప్పుడు బిల్లు ఎవరు చెల్లించాలి? 2026లో కొత్త ట్రెండ్ గురూ

Big Stories

Advertisement
×