E-Paper
Advertisement

OTT Movie : 4 కోట్లు పెడితే 40 కోట్లు ఇచ్చిన హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్… ఏ ఓటిటిలో ఉందంటే?

OTT Movie : 4 కోట్లు పెడితే 40 కోట్లు ఇచ్చిన హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్… ఏ ఓటిటిలో ఉందంటే?
Advertisement

OTT Movie : ఇటీవల కాలంలో చిన్న సినిమాలు గా రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్న మలయాళ సినిమాల సంఖ్య బాగా పెరిగింది. అలాంటి సినిమాలే ఎక్కువగా ఓటీటీల్లో ట్రెండ్ అవుతున్నాయి. ఈరోజు మన మూవీ సజెషన్ కూడా అలాంటి ఒక మలయాళ మూవీనే. పైగా థియేటర్లలో అదిరిపోయే రెస్పాన్స్ సంపాదించుకున్న ఈ మలయాళ కామెడీ డ్రామా తెలుగుతో పాటు మరో మూడు భాషల్లో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో అందుబాటులో ఉంది ? స్టోరీ ఏంటి ? అనే విషయాలపై లుక్కేద్దాం పదండి.

హాట్ స్టార్ లో స్ట్రీమింగ్…

Advertisement

ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మలయాళ మూవీ రీసెంట్ గా రిలీజై బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. కేవలం నాలుగు కోట్ల బడ్జెట్ తో రూపొంది ఏకంగా 40 కోట్లు కొల్లగొట్టింది. ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే సందర్భంగా రిలీజ్ అయిన ఈ మూవీ సెప్టెంబర్ 23 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులోకి వచ్చింది. ఈ మూవీ హాట్ స్టార్ లో తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ భాషల్లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఇప్పుడు మనం చెప్పుకుంటున్న సినిమాకు ఆనంద్ మీనన్ దర్శకత్వం వహించగా, విపిన్ దాస్ కథను అందించారు. సిజు సన్నీ, నోబి మార్కోస్, సాఫ్ బ్రోస్, జోమోన్ జ్యోతిర్, జగదీష్, అజిస్ నెడుమంగడ్, కొట్టాయం నజీర్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఇక కొత్త సినిమాలు ఓటీటీలోకి వస్తున్నాయంటే కచ్చితంగా వీకెండ్ నే టార్గెట్ చేస్తాయి. కానీ ఈ సినిమా మాత్రం వీక్ మొదట్లోనే ఓటీటీలోకి వచ్చేసింది.

Vaazha Streaming On Disney+ Hotstar

Advertisement

స్టోరీ లోకి వెళ్తే….

ఈ సినిమా పేరు వాజా. మలయాళం లో వాజా అనే పదానికి అరటి మొక్క అని అర్థం వస్తుంది. అయితే ఈ సినిమాకు అరటి మొక్కకు సంబంధం అయితే లేదు గానీ మలయాళంలో పని పాటా లేకుండా సోమరిపోతుల్లా తిరిగే మనుషుల్ని కూడా ఇదే పదంతో పిలుస్తారు. సినిమా స్టోరీ అలాంటిదే కాబట్టి మేకర్స్ ఈ మూవీకి ఇలాంటి పేరు పెట్టారు. సినిమాలో ఐదుగురు స్నేహితులు అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉంటారు. వీళ్లను జీవితంలో ఏమీ సాధించలేని లూజర్స్ అంటూ కనిపించే ప్రతి ఒక్కరూ ఎగతాళి చేస్తూ ఉంటారు. ఇక రోజులు గడుస్తున్న కొద్ది ఓవైపు సమాజం, మరోవైపు పేరెంట్స్ వల్ల ఈ ఐదుగురు ఫ్రెండ్స్ పై ఒత్తిడి మరింత పెరుగుతుంది. దీంతో తాము ఎంత సమర్థులో నిరూపించుకోవాలని నిర్ణయించుకుంటారు. చివరికి ఎలా అందరిని నోర్లు మూతపడేలా చేశారు అన్నది తెరపై చూడాల్సిందే. ఈ సినిమాకు వాజా బయోపిక్ ఆఫ్ ఏ బిలియన్ బాయ్స్ అనే పేరు పెట్టారు. దానికి తగ్గట్టుగానే సినిమాను చూసిన యూత్ అంతా ఆ ఐదుగురు ఫ్రెండ్స్ లో తమను తాము చూసుకుంటూ బాగా కనెక్ట్ అయ్యారు. అంతేకాకుండా సినిమాలో దర్శకత్వం, మ్యూజిక్ తో పాటు కామెడీ, గ్రిప్పింగ్ స్టోరీ ఉండడం విశేషం.

Related News

దేశ స్వాతంత్ర్యం కోసం ఊపిరి వదిలిన వీరుల గాథ… నరనరాల్లో దేశభక్తిని రగిలించే పవర్ ఫుల్ ఎపిక్ సిరీస్

ఐఏఎస్ ఆఫీసర్ తీర్చుకున్న షాకింగ్ ప్రతికారం… ఊహకందని పొలిటికల్ రివేంజ్ థ్రిల్లర్

ఖాకీ డ్రెస్‌కి, క్రైమ్ సామ్రాజ్యానికి మధ్య సాగే రక్తపాతం… ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్ అండ్ మైండ్ గేమ్ థ్రిల్లర్

వింత వైరస్ దాడితో సర్వనాశనమైన ప్రపంచం… తెలుగులోనే ఈ స్పైన్ చిల్లింగ్ సర్వైవల్ థ్రిల్లర్

విలన్‌తో అమాయకపు అమ్మాయి బాడీ స్వ్యాప్… భయపెట్టే కామెడీ రోలర్‌కోస్టర్ రైడ్

సినిమా ప్రపంచం వెనుక ఉన్న అసలు రంగులు… నవ్వులతో పాటు కన్నీళ్లు పెట్టించే వినోదాత్మక ప్రయాణం

జోజు జార్జ్ ఊచకోత తెలుగులోనే… నిమిషానికో మలుపు ఉన్న మలయాళం హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్

ప్రేయసిని మర్చిపోవడానికి వెళ్లిన హీరోకు షాకింగ్ ట్విస్ట్… ట్రెక్కింగ్‌లో ఎక్స్ ఎంట్రీతో ఊహించని మలుపు

Big Stories

Advertisement
×