E-Paper
Advertisement

క్యాప్.. ఆ స్టూడెంట్ ప్రాణాలు తీసింది.. హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం, ఎలా జరిగింది?

క్యాప్.. ఆ స్టూడెంట్ ప్రాణాలు తీసింది.. హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం, ఎలా జరిగింది?
Advertisement

Hyderabad Accident: మృత్యువు ఏదో రూపంలో తరుముకుంటూ వస్తుంది. చిన్న ఘటనలు పెను విషాదంగా మారుతుంటాయి. తాజాగా హెయిర్‌పై పెట్టిన క్యాప్ కోసం వెళ్లిన బీటెక్ స్టూడెంట్ అనుకోని జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది. హైదరాబాద్ సిటీ శివారులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటన ఎలా జరిగింది?

హైదరాబాద్‌ శివారులో ఘోర ప్రమాదం

పోలీసులు చెప్పిన వివరాల మేరకు నల్లొండ టౌన్‌కి చెందిన అభిలాష్‌రెడ్డి సీవీఆర్‌ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. తన ఫ్రెండ్‌ని హయత్‌నగర్ బస్టాండ్‌లో దించడానికి వెళ్లాడు. ఆ తర్వాత అక్కడి నుంచి తిరిగి బైక్‌పై వస్తున్నాడు. హెయిర్‌కు పెట్టుకున్న క్యాప్ గాలికి ఒక్కసారిగా ఎగిరి కింద పడింది. దాన్ని తీసుకునేందుకు వెళ్తుండగా వేగంగా వచ్చిన ఆయిల్ ట్యాంకర్ అభిలాష్‌రెడ్డి వాహనాన్ని ఢీ కొట్టింది.

బీటెక్ స్టూడెంట్ ప్రాణం తీసిన క్యాప్

Advertisement

ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయాలు పాలైన అభిలాష్, అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు వచ్చేసరికి ప్రాణాలు కోల్పోయాడు. వెనుక నుంచి వస్తున్న వాహనాన్ని గమనించకపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపారు. అభిలాష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి మెడలో ఉన్న ఐడీ కార్డు ఆధారంగా బీటెక్ చదువుతున్నాడని గుర్తించారు.  దాని ఆధారంగా వివరాలు సేకరించిన వారి తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఘటన గురించి పోలీసులు చెప్పారు.

ALSO READ: గ్రీన్‌ఫీల్డ్ హైవేపై గ్రానైట్ లారీ బీభత్సం.. క్యాబిన్‌పై పడిన భారీ గ్రానైట్ రాళ్లు, డ్రైవర్ మృతి!

Advertisement

లారీ ఢీ కొని కొడుకు మృతి చెందిన విషయం తెలియగానే తండ్రి విష్ణువర్ధన్‌ రెడ్డి షాక్‌కు గురయ్యాడు. మృతుడి బంధువులు పెద్ద అంబర్‌పేట్ ప్రాంతంలో ఉంటున్నారు. మృతుడు తండ్రి విష్ణువర్ధన్ రెడ్డి.. నల్గొండ పట్టణంలోని ఓ ప్రైవేటు స్కూల్‌ ప్రిన్సిపాల్‌గా కొనసాగుతున్నారు. చేతికి అంది వచ్చిన కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. తల్లిదండ్రులు, దగ్గర బంధువులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి కారణమైన లారీని సీజ్ చేశారు.

Related News

హైదరాబాద్‌లో విషాదం.. దుర్గం చెరువులో దూకి వైజాగ్ టెక్కీ ఆత్మహత్య

కాళేశ్వరాన్ని కూలేశ్వరం చేసింది హరీష్ రావే..! – ఎంపీ చామల

గ్రీన్‌ఫీల్డ్ హైవేపై గ్రానైట్ లారీ బీభత్సం.. క్యాబిన్‌పై పడిన భారీ గ్రానైట్ రాళ్లు, డ్రైవర్ మృతి!

ఉద్యోగం పేరుతో నమ్మించి రిసార్ట్ కు తీసుకెళ్లి… ఘట్కేసర్‌లో దారుణం!

బండ్లగూడలో విషాదం.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనుమానాస్పద మృతి!

వేగంగా దూసుకొస్తున్న అర్నబ్ తుఫాన్.. అర్ధరాత్రి నుంచి ఏపీలో భారీ వర్షాలు, తెలంగాణలో మారిన వాతావరణం

కేటీఆర్‌,హరీష్ రావు ఇద్దరివి దిమాక్ లేని మాటలు: ఎంపీ చామల ఫైర్!

Big Stories

Advertisement
×