White Hair Tips: ప్రతి ఒక్కరికి జుట్టు నల్లగా నిగనిగలాడుతూ ఉంటే ఎంతో బాగుంటుందని అనిపిస్తూ ఉంటుంది. పూర్వం రోజుల్లో తెల్ల జుట్టును ముసలి వెంట్రుక అనేవాళ్లు.. ఎందుకంటే 60,70 ఏళ్ల వయసు ఉన్నవాళ్లకే తెల్లజుట్టు వచ్చేది. అయితే ప్రస్తుతం రోజుల్లో తెల్లజుట్టు రావడానికి ముసలవ్వక్కర్లేదు.
వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి తెల్ల జుట్టు వచ్చేస్తుంది. దీనికి అనేక కారణాలు కావచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇక తెల్ల జుట్టును కవర్ చేసేందుకు బయట మార్కెట్లో వివిధ రకాల హెయిర్ ఆయిల్స్, హెన్నా వంటివి ఉపయోగిస్తారు. వీటి వల్ల తెల్ల జుట్టు కొద్దిరోజులు మాత్రమే నల్లగా మారుతుంది. ఆ తర్వాత మళ్లీ యధావిధిగా వైట్ హెయిర్ అనేది వస్తుంటుంది. ఇలా ప్రతిసారి జుట్టుకు ఆర్టిఫిషియల్ హెన్నాను పెట్టడం వల్ల జుట్టు డామేజ్ అయ్యే ప్రమాదం ఉంది.
వీటి వల్ల విపరీతంగా తలనొప్పి రావడం, కళ్ళకు సైట్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి మన ఇంట్లోనే నాచురల్ పదార్ధాలతో హెయిర్ ఆయిల్స్ ట్రై చేశారంటే మంచి ఫలితం ఉంటుంది. జుట్టుకు ఎలాంటి హాని కలగదు. దీంతో పాటు జుట్టు పొడవుగా పెరిగేందుకు సహాయపడతాయి. ఇందుకోసం బృంగరాజ్ లో వీటిని కలిపి జుట్టుకు అప్లై చేస్తే తెల్ల జుట్టు నల్లగా మారడంతో పాటు.. పొడవుగా పెరిగేందుకు తోడ్పడుతుంది. ఇంకెందుకు ఆలస్యం ఈ హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
కావాల్సిన పదార్ధాలు..
కొబ్బరి నూనె
కరివేపాకులు
బృంగరాజ్ ఆకులు
తయారు చేసుకునే విధానం..
ముందుగా బృంగరాజ్ ఆకులను, కరివేపాకులను నీటితో శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి.. కావాల్సినంత కొబ్బరి నూనె వేసి వేడి చేయండి. అందులో బృంగరాజ్ ఆకులు, కరివేపాకులు వేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మరిగించండి. ఆ తర్వాత స్టవ్ కట్టేసి నూనెను చల్లార్చి గాజు సీసాలో వడకట్టుకోండి. నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. బృంగరాజ్ ఆకులు బయట మార్కెట్లో దొరుకుతాయి. అంతే సింపుల్ ఆయిల్ రెడీ అయినట్లే..
Also Read: ఉసిరి నూనె లేదా ఆముదం నూనె.. జుట్టును ఏది వేగంగా పెరిగేలా చేస్తుంది?
అప్లై చేసుకునే విధానం..
బృంగరాజ్ హెయిర్ ఆయిల్‌ను జుట్టుకు అప్లై చేసే ముందు తలస్నానం చేసి ఉండండి. ఆ తర్వాత జుట్టు కుదుళ్లకు ఈ ఆయిల్‌ను అప్లై చేసి.. గంట తర్వాత లేదా రాత్రి పడుకునే ముందు అప్లై చేసి మార్నింగ్ సాధారణ షాంపూతో తలస్నానం చెయ్యండి. తెల్ల జుట్టు క్రమంగా నల్లగా మారుతుంది. బృంగరాజ్ ఆకులు జుట్టు పొడవుగా పెరిగేందుకు చక్కగా పనిచేస్తుంది. ఈ హెయిర్ ఆయిల్ వల్ల చుండ్రు సమస్యలు కూడా తొలగిపోతాయి.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.