Hair Growth Tips: జుట్టు పొడవుగా, అందంగా, సిల్కీగా ఉండాలని ఏ అమ్మాయికి ఉండదు చెప్పండి. ఇందుకోసం రకరకాల హెయిర్ ఆయిల్స్, బ్యూటీ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తుంటారు. వీటి వల్ల జుట్టు పెరగడం ఏమో కానీ.. హెయిర్ ఫాల్ అయ్యే ప్రమాదం ఉంది. జుట్టు రాలడానికి ప్రధాన సమస్య దుమ్మూ, ధుళి, పోషకాహారం తినకపోవడం, స్ట్రెస్ ఇతర కారణాలు కావచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. బయట కొనే ప్రొడక్ట్‌లలో కెమికల్స్ కలిసి ఉంటాయి కాబట్టి జుట్టు సమస్యలతో పాటు ఇతర సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది.
కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన ఇంట్లోనే హెయిర్ సీరమ్ తయారు చేసుకుని జుట్టుకు అప్లై చేశారంటే మంచి ఫలితం ఉంటుంది. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది కూడా. మరి ఆలస్యం చేయకుండా హెయిర్ సీరమ్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్ధాలు..
కొబ్బరి నూనె
ఉసిరికాయలు
కరివేపాకు
మెంతులు
అవిసెగింజలు
బ్లాక్ సీడ్స్
మందారం పువ్వులు
తయారు చేసుకునే విధానం..
స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఒక కప్పు కొబ్బరి నూనె వేసి వేడి చేయాలి. అందులో ఫ్లాక్ సీడ్స్, ఉసిరి ముక్కలు, మెంతులు, కరివేపాకు, అవిసెగింజలు, బ్లాక్ సీడ్స్, మందారం పువ్వులు వేసి బాగా మరిగించండి. కొంచెం బ్రైన్ కలర్ వచ్చేంత వరకు ఉంచి స్టవ్ కట్టేయండి. ఈ మిశ్రమాన్ని చల్లార్చి వడకట్టి గాజు సీసాలో స్టోర్ చేసుకోండి. నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. అంతే సింపుల్ హెయిర్ సీరమ్ రెడీ అయినట్లే..
ఈ నూనెను ప్రతిరోజు జుట్టు చివర్ల వరకు అప్లై చేయండి. దీన్ని గంట ముందు జుట్టుకు పెట్టుకుని ఆ తర్వాత తలస్నానం చేయొచ్చు. మంచి ఫలితం ఉంటుంది. జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరుగుతుంది. చుండ్రు సమస్యలు కూడా తొలగిపోతాయి. ఇందులో వాడే పదార్ధాలు జుట్టు పెరుగుదలకు చక్కగా పనిచేస్తాయి. వీటిలో పోషకాలు జుట్టుకు పోషణను అందిస్తాయి. కాబట్టి మీరు ఎలాంటి డౌట్ లేకుండా ఈ హెయిర్ ఆయిల్ తయారు చేసుకోవచ్చు. జుట్టు పెరుగుదలకు మరొక చిట్కా ఉంది అదేంటో ఇప్పుడు తెలుసుకోండి.
కావాల్సిన పదార్ధాలు
కరివేపాకు
బ్లాక్ సీడ్స్
మెంతులు
కలబంద
ఉల్లిపాయ
ఆవనూనె(Mustard Oil)
తయారు చేసుకునే విధానం..
ఒక పాత్ర తీసుకుని అందులో కరివేపాకు, బ్లాక్ సీడ్, కలబంద, మెంతులు, ఉల్లిపాయ ముక్కలు, ఒక కప్పు ఆవ నునె వేసి.. స్టవ్ మీద పెట్టాలి. కొంచెం లో ఫ్లేమ్‌లో పెట్టి అరగంట పాటు మరిగించండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గాజు సీసాలో వడకట్టుకోండి. అంతే సింపుల్ ఆయిల్ రెడీ అయినట్లే..
అప్లై చేసుకునే విధానం..
ఈ హెయిర్ ఆయిల్‌ను జుట్టు కుదుళ్లకు అప్లై చేసి.. గంట తర్వాత సాధారణ షాంపూతో తలస్నానం చెయ్యండి. ఇలా ప్రతిరోజు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. జుట్టు పొడవుగా పెరిగేందుకు ఈ ఆయల్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఉపయోగించే పదార్ధాలన్ని జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. వీటిలో ఉండే పోషకాలు జుట్టుతో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.