Pushpa 2 3D Version: ‘పుష్ప 2’ సినిమాకు ఇప్పటికే దేశవ్యాప్తంగా విపరీతమైన హైప్ ఉంది. ఈ హైప్‌ను మరింత పెంచడం కోసం, ఆడియన్స్‌కు అదిరిపోయే ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడం కోసం ఈ మూవీని 5 ఫార్మాట్స్‌లో విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. అయితే ‘పుష్ఫ 2’ మ్యానియాను 2డీతో పాటు 3డీలో కూడా చూడవచ్చని చాలామంది ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. అసలు 3డీలో ఇలాంటి కమర్షియల్ సినిమా ఎలా ఉంటుందా అని చర్చలు కూడా మొదలుపెట్టారు. కానీ ఇంతలోనే ప్రేక్షకులకు ఊహించని షాక్ తగిలింది. ‘పుష్ప 2’ 3డీ వర్షన్ క్యాన్సల్ అయ్యింది.
నిరాశ తప్పదు
ఏ సినిమాను అయినా 3డీ వర్షన్‌లో విడుదల చేయాలంటే దానికి చాలా టెక్నికల్ వర్క్ ఉంటుంది. కానీ ‘పుష్ప 2’ షూటింగే ఇటీవల పూర్తయ్యింది. దీంతో ఈ తక్కువ సమయంలో ఈ సినిమాకు కావాల్సిన 3డీ వర్షన్ పూర్తి కాలేదు. అంటే డిసెంబర్ 5లోపు 3డీ వర్షన్ ప్రింట్స్ సిద్ధం అవ్వడం అనేది అసాధ్యం. అందుకే ఏ టెన్షన్ లేకుండా ‘పుష్ప 2’ 3డీ వర్షన్‌ను రిలీజ్ చేయకపోతేనే బెటర్ అని మేకర్స్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అంటే 3డీ కాకుండా కేవలం 2డీ వర్షన్ మాత్రమే ఆడియన్స్‌కు అందుబాటులో ఉంటుంది. ఇప్పటికే పలు థియేటర్లలో 3డీ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. చాలామంది ఆడియన్స్ ఆ వర్షన్‌ను చూడాలని టికెట్లు బుక్ చేసుకున్నా వారికి నిరాశే మిగలనుంది.
Also Read: హైకోర్టులో ‘పుష్ప 2’ పై మరో కేసు.. దీనిపై హైకోర్టు ఏం చెప్పిందంటే.?
బుకింగ్స్ లేవు
‘పుష్ప 2’ (Pushpa 2) 2డీ వర్షన్‌కు సంబంధించిన ప్రింట్స్ ప్రస్తుతం రెడీగా ఉన్నాయి. దీంతో ఈ వర్షన్ థియేటర్లలో విడుదల కావడానికి సిద్దమయ్యింది. కానీ 3డీ వర్షన్ ఇంకా సిద్ధం కాలేదు కాబట్టి అది ఇక విడుదల చేయకూడదనే కఠిన నిర్ణయానికి వచ్చేశారు మేకర్స్. అందుకే 3డీ వర్షన్ షోలు కూడా క్యాన్సల్ కానున్నాయి. దానికి కావాల్సిన బుకింగ్స్ ఆగిపోనున్నాయి. ఇది అల్లు అర్జున్ అభిమానులకు బ్యాడ్ న్యూసే. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కూడా ‘పుష్ప 2’ను ప్రేక్షకులు 5 ఫార్మాట్స్‌లో ఎంజాయ్ చేయవచ్చని మాటిచ్చారు నిర్మాతలు. ఇంతలోనే 3డీ వర్షన్ క్యాన్సల్ అవ్వడం అనేది అందరినీ షాక్‌కు గురిచేస్తోంది.
చివరి నిమిషంలో హడావిడి
అల్లు అర్జున్ (Allu Arjun), సుకుమార్ (Sukumar) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘పుష్ప 2’ ఇప్పటికే మూడేళ్లు లేట్ అయ్యింది. డిసెంబర్ 5న విడుదల తేదీ అని ఫిక్స్ చేసినా తర్వాత కూడా ఈ మూవీ షూటింగ్ జరుగుతూనే ఉంది. కొన్ని రోజుల క్రితమే సినిమా షూటింగ్ పూర్తయ్యింది. దీంతో ఆలస్యం చేయకుండా వెంటనే దీని పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించారు మేకర్స్. పైగా దీనికి తగిన ప్రమోషన్స్ కూడా ప్రారంభించారు. ఈ ప్రమోషన్స్‌లో అల్లు అర్జున్ బిజీ అయిపోయాడు. మిగిలిన టీమ్ అంతా పోస్ట్ ప్రొడక్షన్‌లో బిజీ అయ్యింది. ఎంత కష్టపడినా కూడా ‘పుష్ప 2’ 3డీ వర్షన్ క్యాన్సల్ అవ్వడం అనేది చాలామంది ఆడియన్స్‌ను డిసప్పాయింట్ చేస్తుందని ఇండస్ట్రీ నిపుణులు భావిస్తున్నారు.