Hyderabad City Buildings: హైదరాబాద్ నగర వాసులకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నూతన భవనాలు, లే అవుట్ల నిర్మాణాలకు సంబంధించి నిన్నటి వరకు ఒక లెక్క.. నేటి నుండి మరో లెక్కగా, ఇక అనుమతుల ప్రక్రియ చకచకా సాగించేందుకు బృహత్తర కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ అంశానికి సంబంధించి మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. నూతన భవనాలు, లేఔట్ ల కోసం బిల్డ్ నౌ వ్యవస్థను తాము ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. అలాగే కొత్త 3d టెక్నాలజీ సహాయంతో బిల్డింగ్ శాంక్షన్ ప్రక్రియ సాగుతుందని, రోజుల తరబడి జరిగే అప్రూవల్ ప్రాసెస్ బిల్డింగ్ టెక్నాలజీతో ఐదు నిమిషాల్లో తాము పూర్తిచేసేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు.
హైదరాబాద్ వాసులకు ఇదొక గొప్ప అవకాశమని, పదేపదే ప్రభుత్వ అనుమతుల కోసం అన్ని కార్యాలయాలు చుట్టూ ప్రదక్షిణలు చేయకుండా, మంచి వ్యవస్థను తాము ప్రవేశపెట్టినట్లు తెలిపారు. రియల్ ఎస్టేట్ రంగంలో నేటికీ హైదరాబాద్ ముందంజలో ఉందని, బెంగళూరు కన్నా హైదరాబాద్ లోనే ఎక్కువగా గృహాల కొనుగోళ్ళు సాగుతున్నాయన్నారు. దాదాపు పది లక్షల మంది నగరవాసులు ఐటీ రంగంలో పనిచేస్తున్నారని, గ్రోహబ్ రిపోర్ట్ ప్రకారం హైదరాబాద్ నగరం ప్రపంచంలోనే అభివృద్ధిలో టాప్ – 5లో ఉందన్నారు.
ఆన్లైన్ నూతన భవన, లేఅవుట్ కు సంబంధించిన వ్యవస్థను ప్రవేశపెట్టి చకచకా అనుమతులను అందించడమే తమ ముఖ్య ఉద్దేశమన్నారు. అంతేకాదు భవన నిర్మాణానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వివరాలను వేగంగా పొందే అవకాశం బిల్డ్ నౌ వ్యవస్థ ద్వారా ప్రజలకు మరింత చేరువవుతుందని తెలిపారు. హైదరాబాద్ నగర సుందరీకరణ పచ్చదనం కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని, సమగ్ర మురుగు నీటిపారుదల వ్యవస్థను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేస్తామని పునరుద్ఘాటించారు. సోషల్ మీడియాలో సాగే గ్లోబల్ ప్రచారాన్ని ప్రజలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని, మూసీ నది ప్రక్షాళన పేరిట పేద, చిన్న, మధ్యతరగతి కుటుంబాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు.
Also Read: Pushpa 2 In AP: పుష్ప-2 హిట్.. అంబటి ప్లాప్.. అరెరె టార్గెట్ మిస్ అయిందే!
చెరువులు, కుంటలు సుందరీకరణ భాగంగా 214 కిలోమీటర్ల పొడవు ఈవెన్యూ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు, జీహెచ్ఎంసీకి సంబంధించి రూ. 2400కోట్లను బడ్జెట్ కేటాయించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వంకే దక్కుతుందన్నారు. కృష్ణా, గోదావరి జలాలను హైదరాబాద్ ప్రజలకు తాగునీరు అందించటంలో భాగంగా రోడ్డు పై మురుగు నీరు పారకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అన్నీ చర్యలు తీసుకుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు ఇంటిని నిర్మిస్తుంటే, అనుమతులు మీకు కేవలం 5 నిమిషాల్లో మీ ముందుంటాయి.
నూతన భవనాలు, లేఔట్ల కోసం "బిల్డ్ నౌ" వ్యవస్థను ప్రవేశపెడుతున్నాం: మంత్రి శ్రీధర్ బాబు
షార్ట్ ఫిల్మ్ ద్వారా బిల్డ్ నౌ గురుంచి వివరించిన MAUD అధికారులు
కొత్త 3d టెక్నాలజీ సహాయంతో బిల్డ్ నౌ పేరుతో బిల్డింగ్ శాంక్షన్ ప్రక్రియ
రోజులు తరబడి జరిగే అప్రూవల్ ప్రాసెస్ బిల్డింగ్… pic.twitter.com/idkJvwTqSG
— BIG TV Breaking News (@bigtvtelugu) December 3, 2024