Tips For Hair Fall Control: ప్రస్తుతం చాలా మంది జుట్టు రాలే సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా ఈ సమస్య నుండి బయటపడటానికి రకరకాల ఆయిల్స్, షాంపూలను వాడుతున్నారు. ఇదిలా ఉంటే..
మీ శరీర పోషకాహారం.. మీ మానసిక స్థితి, జుట్టు సంరక్షణ అలవాట్లు అన్నీ మీ జుట్టు ఆరోగ్యాన్ని ప్రతిబింబిస్తాయి. జుట్టు రాలడం ఒకే సారి జరగదు. సకాలంలో శ్రద్ధ వహిస్తే దానిని మీరు ఖచ్చితంగా ఆపవచ్చు. జుట్టు సమస్యలను తొలగించడంలో కొన్ని ఇంటి హోం రెమెడీస్ చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి.
జుట్టు రాలే సమస్యను ఎదుర్కునే వారు రసాయన ఉత్పత్తులపై ఆధారపడకుండా సహజంగా, ఇంట్లోనే తయారుచేసిన హోం రెమెడీస్‌ను ఉపయోగించినప్పుడు.. మీ జుట్టు బలంగా మారడమే కాకుండా, చాలా కాలం పాటు ఆరోగ్యంగా ఉంటుంది. మీ జుట్టు తిరిగి ఒత్తుగా పెరిగేందుకు అవసరం అయిన హోం రెమెడీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
జుట్టును బలోపేతం చేయడానికి హోం రెమెడీస్:
ఉసిరి, కొబ్బరి నూనె:
ఉసిరి జుట్టు మూలాలను బలపరుస్తుంది. అంతే కాకుండా కొబ్బరి నూనె వాటిని లోతుగా పోషిస్తుంది. ఉసిరికాయను తురుము, కొబ్బరి నూనెలో ఉడికించి ఈ మిశ్రమంతో తలకు మసాజ్ చేయండి. ఈ నివారణ జుట్టు రాలడాన్ని తగ్గించడమే కాకుండా.. జుట్టు తెల్లబడటాన్ని కూడా నివారిస్తుంది.
మెంతి గింజల పేస్ట్:
రాత్రంతా నానబెట్టిన మెంతి గింజలను రుబ్బి పేస్ట్ లా తయారు చేసుకోండి. ఈ పేస్ట్‌ను జుట్టు మూలాలపై 30 నిమిషాలు అప్లై చేయండి. మెంతుల్లో ఉండే ప్రోటీన్లు , లెసిథిన్ జుట్టు తెగిపోకుండా నిరోధించి.. వాటిని మందంగా చేస్తాయి. వారానికి రెండుసార్లు దీనిని ఉపయోగించండి.
అలోవెరా జెల్:
తాజా అలోవెరా జెల్ జుట్టుకు సహజ టానిక్ లాగా పనిచేస్తుంది. ఇది తలపై చర్మానికి ఉపశమనం అందిస్తుంది. అంతే కాకుండా దురద, మంటను తగ్గిస్తుంది. అంతే కాకుండా జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుంది. కలబందను నేరుగా తలకు పట్టించి 30 నిమిషాల తర్వాత కడిగేయండి. ఇలా చేయడం వల్ల అద్భుత ప్రయోజనాలు ఉంటాయి.
ఉల్లిపాయ రసం:
ఉల్లిపాయ రసంలో సల్ఫర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు రంధ్రాలలో రక్త ప్రసరణను పెంచుతుంది. అంతే కాకుండా ఇది కొత్త జుట్టు పెరుగుదల ప్రక్రియను వేగవంతం చేస్తుంది. ఆ రసాన్ని జుట్టు కుదుళ్లపై అప్లై చేసి 30 నిమిషాలు అలాగే ఉంచి, ఆపై తేలికపాటి షాంపూతో కడిగేయండి. దీని రెగ్యులర్‌గా వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
Also Read: ప్రతి రోజు ఉదయం బెల్లం నీళ్లు తాగితే.. మతిపోయే లాభాలు !
పెరుగు, నిమ్మకాయ మాస్క్:
పెరుగు జుట్టుకు లోతైన కండిషనింగ్ అందిస్తుంది. అంతే కాకుండా నిమ్మకాయ ఫంగల్ ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది. రెండింటినీ కలిపి తలకు పట్టించి 20-30 నిమిషాల తర్వాత కడిగేయండి. ఇది నివారణ చుండ్రును తగ్గిస్తుంది. అంతే కాకుండా జుట్టు రాలడాన్ని నివారిస్తుంది.
జుట్టు రాలడం ఒక సాధారణ సమస్య.. కానీ దానికి పరిష్కారం కూడా మన చుట్టే ఉంటుంది. ఈ హోం రెమెడీస్ క్రమం తప్పకుండా వాడటం ద్వారా.. మీరు జుట్టు రాలడాన్ని ఆపడమే కాకుండా.. జుట్టు కోల్పోయిన మెరుపు, బలాన్ని తిరిగి పొందవచ్చు.