BigTV Effect: తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై బిగ్ టీవీ ప్రత్యేక కథనాలను ప్రచురించింది. దీనితో టీటీడీ స్పందించింది. ఎట్టకేలకు శ్రీవారి భక్తుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. దీనితో ఎందరో శ్రీవారి భక్తులకు మేలు చేకూరనుంది. మరెందుకు ఆలస్యం బిగ్ టీవీ కథనానికి టీటీడీ ప్రకటించిన ఆ శుభవార్త ఏమిటో తెలుసుకుందాం.
పెరిగిన భక్తుల రద్దీ..
తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తుల కోసం టీటీడీ ఎన్నో సౌకర్యాలు కనిపిస్తోంది. అయితే పలుమార్లు భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు టీటీడీ విశేష కృషి చేస్తున్నా, అప్పుడప్పుడు శ్రీవారి భక్తులకు ఇబ్బందులు కలిగిన పరిస్థితులు ఉన్నాయి. వాటిని టీటీడీ గుర్తించి పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటుంది. ప్రస్తుతం సమ్మర్ హాలిడేస్ సంధర్భంగా తిరుమల మాడ వీధులు కిటకిటలాడుతున్నాయి. ఎటుచూసినా శ్రీవారి భక్తులే దర్శనమిస్తున్నారు. ఆదివారం ఒక్కరోజే 80 వేల మందికి పైగా భక్తులు, శ్రీవారిని దర్శించుకున్నారు. దీనిని బట్టి ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఏవిధంగా ఉందో చెప్పవచ్చు.
భక్తుల ఇబ్బందులు..
శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు ప్రధానంగా రవాణా సౌకర్యం అనుకూలంగా లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతిరోజు తెల్లవారుజామున రైల్వేస్టేషన్, బస్టాండ్, అలిపిరి మీదుగా శ్రీవారి మెట్టుకు బస్సు సౌకర్యం లేకపోవడంతో వారి అవస్థలు అన్నీ ఇన్నీ కావు. చిన్నారులు,క వృద్ధులు ఎదుర్కునే సమస్యలు వర్ణనాతీతం.
బిగ్ టీవీ ప్రత్యేక కథనం..
శ్రీవారి భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలపై బిగ్ టీవీ ప్రత్యేక కథనం ప్రసారం చేసింది. దీనితో టీటీడీ దృష్టికి భక్తుల రవాణా సమస్య వెళ్ళింది. ప్రధానంగా తెల్లవారుజామున భక్తులకు బస్సులు అందుబాటులో లేకపోవడంతో శ్రీవారి దర్శనం కూడా ఆలస్యం అవుతుందని టీటీడీ గ్రహించింది.
Also Read: Tirumala News: శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇకపై ఉచిత నిర్ణయం!
బిగ్ టీవీ కథనం.. సమస్య పరిష్కారం
శ్రీవారి భక్తుల సమస్య గురించి బిగ్ టీవీ ప్రత్యేక కథానానిని టీటీడీ స్పందించి సత్వరం చర్యలు తీసుకుంది. శ్రీవారి మెట్టు వద్ద ఆటోల దందా పై బిగ్ టివి కథనానికి స్పందించిన టిటిడి, అర్టీసి వెంటనే సమస్య పరిష్కారానికి చొరవ చూపాయి. ప్రతిరోజు తెల్లవారుజామున రైల్వేస్టేషన్, బస్టాండ్, అలిపిరి మీదుగా శ్రీవారి మెట్టుకు ఎలక్ట్రిక్ బస్సులు నడపాలని నిర్ణయించారు. దీనితో తెల్లవారుజామున చిన్నారులతో ఇబ్బందులు పడే భక్తుల సమస్య తీరినట్లే. బిగ్ టీవీ కథనంతో టీటీడీ, ఆర్టీసీ స్పందించడంతో బిగ్ టీవీకి శ్రీవారి భక్తులు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే స్పందించిన అధికారులకు సైతం అభినందనలు తెలిపారు.