Winter skin care: చలికాలం రాగానే చర్మం పొడిబారడంతో పాటు నిర్జీవంగా, సాగినట్లుగా అనిపిస్తుంది. ఈ సీజన్‌లో సబ్బును ఉపయోగించడం వల్ల చర్మం మరింత పొడిబారుతుంది. చలికాలంలో చర్మంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. ఇంట్లోని కొన్ని రకాల పదార్థాలు మీ ముఖాన్ని మెరిసేలా చేస్తాయి. మరి ఎలాంటి పదార్థాలు మీ ముఖాన్ని అందంగా మారుస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
పచ్చి పాలు:
పచ్చి పాలు ఒక అద్భుతమైన కండిషనర్. ఇందులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తుంది. అంతే కాకుండా చనిపోయిన చర్మాన్ని తొలగిస్తుంది.
అప్లై చేయు విధానం:
ముందుగా కాస్త పాలలో కాటన్ తీసుకుని పచ్చి పాలలో ముంచండి.
దీన్ని మీ ముఖంపై సున్నితంగా అప్లై చేయండి.
10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి.
ఇది మీ చర్మాన్ని శుభ్రపరచడమే కాకుండా మాయిశ్చరైజ్ చేస్తుంది.
తేనె:
తేనె అనేది సహజమైన మాయిశ్చరైజర్. ఇది చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తుంది. అంతే కాకుండా మెరుస్తూ ఉంటుంది.
కొద్ది మొత్తంలో తేనెను తీసుకుని నేరుగా మీ ముఖానికి అప్లై చేయండి.
మృదువుగా మసాజ్ చేసి 5-10 నిమిషాల తర్వాత కడగాలి.
శనగపిండి, పెరుగు:
చలికాలంలో చర్మాన్ని శుభ్రపరచడానికి శనగపిండి ,పెరుగు ఉత్తమ ఎంపిక.
ఒక చెంచా పెరుగును ఒక చెంచా శనగ పిండిలో కలపండి.
దీన్ని మీ ముఖానికి అప్లై చేసి 10 నిమిషాలు అలాగే ఉంచండి.
తర్వాత సున్నితంగా రుద్ది కడిగేయండి.
Also Read: వీటిని వాడితే.. ఎంతటి తెల్ల జుట్టు అయినా క్షణాల్లోని నల్లగా మారడం ఖాయం
అలోవెరా జెల్:
అలోవెరా జెల్ శీతాకాలంలో పొడి చర్మాన్ని నయం చేస్తుంది. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేసి మెరిసేలా చేస్తుంది.
తాజా కలబం జెల్‌ను తీయండి.
దీన్ని మీ ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత కడిగేయండి.