BigTV English

Bigg Boss 8 Telugu: నాలుగేళ్లుగా ఆ అమ్మాయితో టేస్టీ తేజ లవ్.. తృటిలో తప్పించుకున్న నిఖిల్

Bigg Boss 8 Telugu: నాలుగేళ్లుగా ఆ అమ్మాయితో టేస్టీ తేజ లవ్.. తృటిలో తప్పించుకున్న నిఖిల్

Bigg Boss 8 Telugu Latest Episode Highlights: బిగ్ బాస్ రియాలిటీ షోలో ప్రేమకథలు చాలా ఫేమస్. ఇప్పటికే ఎన్నో ఇండియన్ భాషల్లో ఈ రియాలిటీ షో ప్రసారం కాగా.. అందులో కొన్నింటిలో కంటెస్టెంట్స్ ప్రేమలో పడి దానివల్లే గెలుపు వరకు వెళ్లారు కూడా. అయితే బిగ్ బాస్ 8లో మాత్రం అలాంటి పూర్తిస్థాయి లవ్ స్టోరీ కనిపించడం లేదు. విష్ణుప్రియా మాత్రమే పృథ్వి వెంటపడుతూ, తనంటే ఇష్టమని చెప్తుంది. కానీ పృథ్వి నుండి సమానంగా ఆ ఇంట్రెస్ట్ ఎప్పుడూ లేదు. ఇక ఆ ఇంట్రెస్ట్ వల్లే ఎప్పటినుండో విష్ణుప్రియా చిక్కుల్లో పడుతోంది. ఇక తాజాగా టేస్టీ తేజ లవ్ స్టోరీ గురించి బయటపడింది. అందరి ముందు తన రిలేషన్‌షిప్ గురించి ఒప్పేసుకున్నాడు తేజ.


రోహిణి తప్పు లేదా?

బిగ్ బాస్ 8లో వీకెండ్ ఎపిసోడ్ మొదలవ్వగానే ముందుగా రోహిణి, విష్ణుప్రియా మధ్య జరిగిన గొడవ గురించి మాట్లాడారు నాగార్జున. మెగా చీఫ్ కంటెండర్ల టాస్కులో రోహిణి, విష్ణుప్రియా ఒకరి గురించి ఒకరు అనుకున్న మాటలు కరెక్ట్ కాదని వారిపై సీరియస్ అయ్యారు. ముందుగా నిఖిల్‌ను ట్రై చేస్తే పృథ్వితో వర్కవుట్ అయ్యింది, ఇదే నీ ప్లాన్ అంటూ విష్ణుప్రియాపై ఘోరమైన ఆరోపణలు చేసింది రోహిణి. కానీ నాగ్ నుండి తిట్లు మాత్రం విష్ణుకే పడ్డాయి. ముందుగా విష్ణుప్రియా.. క్యారెక్టర్ గురించి మాట్లాడడం వల్లే రోహిణి రియాక్ట్ అయ్యిందని నాగ్ అన్నారు. కానీ వీడియోలో మాత్రం ముందుగానే రోహిణినే ప్లాన్ అనే పదాన్ని ఉపయోగించింది. ఇక గౌతమ్, పృథ్వి గొడవ విషయంలో కూడా గౌతమ్‌నే తప్పుబట్టారు నాగార్జున.


Also Read: డేంజర్ జోన్‌లో కన్నడ బ్యాచ్.. ఫైనల్‌గా బిగ్ బాస్ 8 నుండి యష్మీ ఔట్

గౌతమ్‌కే తిట్లు

పాత కంటెస్టెంట్స్ అంతా తమను టార్గెట్ చేస్తున్నారంటూ గౌతమ్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. గౌతమ్ అలా అన్నాడని పృథ్వి అయితే తన మీద మీదకు వచ్చి బెదిరించినట్టుగా మాట్లాడాడు. ఈ విషయంలో గౌతమ్ కంటే ఎక్కువగా పృథ్విదే తప్పు ఉన్న నాగ్ మాత్రం గౌతమ్‌దే తప్పు అంటూ సీరియస్ అయ్యారు. అలా వీకెండ్ ఎపిసోడ్‌లో విష్ణుప్రియా, గౌతమ్‌లకు వార్నింగ్ ఇచ్చారు. ఆపై కంటెస్టెంట్స్ అందరితో స్నేక్స్ అండ్ లాడర్స్ గేమ్ ఆడించారు. ఆటపరంగా హౌస్‌లో తమకు లాడర్ ఎవరు, స్నేక్ ఎవరు అని అందరినీ అడిగారు. సీరియస్‌గా స్నేక్స్ అండ్ లాడర్స్ గేమ్ మొదలయిన తర్వాత టేస్టీ తేజ లవ్ స్టోరీ గురించి బయటికొచ్చింది.

తండ్రికి తెలియకుండా

తన ఇంటి ఎదురుగా అపార్ట్‌మెంట్‌లో ఉండే అమ్మాయిని నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నానని, ఆ విషయం తన తల్లిదండ్రులకు కూడా తెలియదని తన ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకున్నాడు తేజ. అదే విషయాన్ని నాగార్జున హైలెట్ చేశారు. తన తండ్రికి తెలియకుండా లవ్ ట్రాక్ నడిపించడం గ్రేట్ అని కౌంటర్ ఇచ్చారు. దీంతో తేజ అసలు ఇంట్లోవాళ్ల రియాక్షన్ ఎలా ఉంటుందా అని భయపడిపోయాడు. ఆ తర్వాత కంటెస్టెంట్స్ అంతా తమ ఆటలో స్నేక్ ఎవరు, లాడర్ ఎవరు అని చెప్పగా.. స్నేక్ కేటగిరిలో నిఖిల్, గౌతమ్‌లకు ఎక్కువ ఓట్లు పడ్డాయి. ఆ తర్వాత నామినేషన్స్‌లో ఉన్న నిఖిల్, నబీల్, పృథ్వి, యష్మీ, ప్రేరణ నుండి నిఖిల్ సేవ్ అయిపోయాడు.

Related News

Bigg Boss 9 Telugu: డబుల్ హౌస్.. డబుల్ డోస్..బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్

Monal Gajjar : బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ గుర్తుందా.? ఇప్పుడేం చేస్తుందో తెలుసా..?

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Big Stories

×