Hair Growth Tips: ప్రస్తుతం జుట్టు రాలే సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా జుట్టు రంగు మారడం, చుండ్రు వంటి సమస్యలను ఎదుర్కుంటున్నారు. నిజానికి తలపై ఉండే ఒత్తైన జుట్టు మరింత అందంగా కనిపించేలా చేస్తుంది. అంతే కాకుండా ఇది మన ఆరోగ్యాన్ని కూడా సూచిస్తుంది. పూర్వకాలంలో స్త్రీల జుట్టు 45 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వచ్చినా కూడా పొడవుగా, మందంగా, నల్లగా ఉండేవి. కానీ ఇటీవలి కాలంలో జుట్టు రాలడం, తెల్ల వెంట్రుకలు వంటి సమస్యలు పెరుగుతున్నాయి.
పురుషులు కూడా ఈ సమస్యతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలో జుట్టు రాలడం తగ్గి బాగా పెరగాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
తలస్నానం చేసే ముందు తలకు నూనె రాసుకోవాలి. తలస్నానానికి ఒకటి లేదా రెండు గంటల ముందు జుట్టు మూలాలకు నూనె రాసి ఆ తర్వాత తలస్నానం చేయడం మంచిది. ఎప్పుడైనా తలకు నూనె రాసినప్పుడు తలను బాగా మసాజ్ చేయండి. ఆ తర్వాత తలస్నానం చేయడం మంచిది.
వారానికి మూడు సార్లు తలస్నానం:
కొందరు వ్యక్తులు ప్రతి రోజు తల స్నానం చేస్తూ ఉంటారు. దీనివల్ల జుట్టు సరిగా పెరగక పోవడమే కాదు. పొడిగా ఉన్న జుట్టు కూడా చిట్లి రాలిపోయే ప్రమాదం ఉంటుంది. తరుచూ తల స్నానం చేయడం అవసరం లేదు. వారానికి మూడు సార్లు తలస్నానం చేస్తే సరిపోతుంది.
బాగా వేడి నీటిని ఉపయోగించవద్దు:
జుట్టులోని జిడ్డును పోగొట్టుకోవడానికి కొందరు వేడినీళ్లతో తలస్నానం చేస్తూ ఉంటారు. ఇలా చేస్తే వెంట్రుకలు పొడిబారడంతో పాటు ఎక్కువగా రాలిపోయే ప్రమాదం ఉంటుంది.
తలపై ఉన్న చర్మంపై శ్రద్ద:
తలపై ఉన్న చర్మం గురించి కూడా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. లేకుంటే చర్మం పొడిగా మారడం జరుగుతుంది. ఫలితంగా జుండ్రు కూడా పెరుగుతుంది. తరుచూ తలస్నానం చేసే ముందు మూడుకు ఆయిల్ పట్టించి బాగా మసాజ్ చేయండి.
మనం తినే ఆహారం:
జుట్టు ఆరోగ్యంగా ఉండటంలో మనం తినే ఆహారం ముఖ్య పాత్రను పోషిస్తుంది. ఆహారం శరీర ఆరోగ్యంతో కూడా జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. విటమిన్లు, పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల జుట్టు బాగా పెరుగుతుంది. అంతే కాకుండా జుట్టు రాలడం కూడా తగ్గుతుంది.
Also Read: గుండె ఆరోగ్యానికి సోయాబీన్స్‌తో అనేక ప్రయోజనాలు..
షాంపూ, కండీషనర్ వాడటం:
కంటికి నచ్చిన షాంపూ, కండీషనర్ వాడకూడదు. జుట్టుకు ఏ రకమైన షాంపూ సరిపోతుందో వైద్యులను సంప్రదించాలి. వైద్యులు సూచించిన షాంపూ వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. జుట్టుకు కొంతమంది షాంపూ మాత్రమే ఉపయోగిస్తారు.అలా కాకుండా కండీషనర్ కూడా ఉపయోగిస్తే జుట్టు పెరుగుదల బాగుంటుంది.