BigTV English
Advertisement

Shilparao Song Promo: దేవర నుంచి రొమాంటిక్ సాంగ్ ప్రోమో రిలీజ్

Shilparao Song Promo: దేవర నుంచి రొమాంటిక్ సాంగ్ ప్రోమో రిలీజ్

Shilparao Song Promo: ‘ఆర్ఆర్ఆర్’ వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న కొత్త సినిమా ‘దేవర’. ఈ సినిమాపై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ‘జనతా గ్యారేజ్’ వంటి సినిమాతో ఎన్టీఆర్ సూపర్ హిట్ అందించిన దర్శకుడు కొరటాల శివ ఇప్పుడు దేవరతో కూడా అంతకంటే పెద్ద హిట్‌ను అందిస్తాడని భావిస్తున్నారు. దర్శకుడు కొరటాల శివ ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నాడు. అందులో మొదటి భాగాన్ని ఈ ఏడాది సెప్టెంబర్‌లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.


అయితే ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తర్వాత నటిస్తున్న సినిమా ఇదే కావడంతో అందరి చూపు దీనిపైనే ఉంది. దర్శకుడు కూడా ఈ చిత్రాన్ని చాలా జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నాడు. క్వాలిటీ, విజువల్స్ వంటి ఏ విషయంలోనూ తగ్గకుండా రూపొందిస్తున్నాడు. నందమూరి ఫ్యాన్స్ అండ్ సినీ ప్రియులు ఎన్టీఆర్‌ను ఏ రేంజ్‌లో చూడాలనుకుంటున్నారో అలాంటి ఒక మాస్ లుక్‌లో చూపించేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. కాగా ఇందులో ఎన్టీఆర్ రెండు డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

Also Read: దేవర సెకండ్ సింగిల్ పోస్టర్.. రొమాంటిక్ యాంగిల్ లో ఎన్టీఆర్, జాన్వీ


అందులో ఒకటి ఫాదర్‌గా మరొకటి కొడుకుగా అని తెలుస్తోంది. ఇదంతా ఒకెత్తయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఇక ఇటీవలే ఈ సినిమా నుంచి విడుదలైన ఫియర్ సాంగ్ అయితే ఇక చెప్పాల్సిన పనే లేదు. ఏకంగా యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఈ సాంగ్‌లో ఎన్టీఆర్ మాస్ అండ్ యాక్షన్ సన్నివేశాలు సినీ ప్రియుల్లో ఉర్రూతలూగించాయి. అలాగే గ్లింప్స్‌లో ఎన్టీఆర్ యాక్షన్ సన్నివేశాలు ఓ రేంజ్‌లో సినిమాపై అంచనాలు పెంచేశాయి.

దీంతో ఈ సినిమా చూసేందుకు చాలా మంది సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి మరో సాంగ్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇటీవల ఓ అప్డేట్ అందించి సర్‌ప్రైజ్ చేశారు. ఆగస్టు 5వ తేదీన ‘శిల్పారావు’ అంటూ సాగే సెకండ్ సాంగ్‌ను రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ తరుణంలో ఇవాళ అంటే శనివారం ఈ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ప్రోమో కేవలం మ్యూజిక్‌లోనే సాగుతుంది. ఈ మ్యూజిక్ కూడా వినడానికి చాలా వినసంపుగా ఉంది. చూడాలి మరి ఆగస్టు 5న రిలీజ్ కానున్న ఫుల్ సాంగ్ ఎలా ఉంటుందో.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×