BigTV English

Adivi Sesh: గూఢచారికి ఆరేళ్లు.. G2 నుంచి ఆరు యాక్షన్ మూమెంట్స్ రిలీజ్

Adivi Sesh: గూఢచారికి ఆరేళ్లు.. G2 నుంచి ఆరు యాక్షన్ మూమెంట్స్ రిలీజ్

G2: ఆరేళ్ల క్రితం వచ్చిన స్పై థ్రిల్లర్ గూఢచారి సినిమా విశేషాదరణ పొందింది. అడవి శేష్ నటన పీక్స్. ఇప్పటికీ ఈ సినిమా గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ యాక్షన్ ప్యాక్డ్ మూవీ గూఢచారికి సీక్వెల్‌ తీస్తున్నారు. 40 శాతం షూటింగ్ కంప్లీట్ కూడా చేసుకుంది. గూఢచారిని మరిపించేలా, అంతకు మించి అన్నట్టుగా ఈ G2 ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతున్నది. సినిమా ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుందని మేకర్స్ చెబుతున్నారు.


గూఢచారి 6వ యానివర్సరీ సందర్భంగా అడవి శేష్ G2 నుంచి ఆరు స్టన్నింగ్ మూమెంట్స్‌ను విడుదల చేశారు. ఒక్కో మూమెంట్‌కు ఒక్కో క్యాప్షన్ పెడుతూ వీటిని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ యాక్షన్ మూమెంట్స్ ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. ఇంటర్నేషనల్ స్కేల్‌లో ఈ పిక్స్ అదరగొడుతున్నాయి. ఇంటెన్స్‌గా ఉండి స్పై థ్రిల్లర్, యాక్షన్ డ్రామాకు మచ్చుతునకలుగా ఉన్నాయి.


వచ్చే ఏడాది ద్వితీయార్థంలో G2 సినిమా విడుదల కానుంది. వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహిస్తున్నారు. అడవి శేష్‌తో కలిసి రైటర్‌గానూ ఉన్నారు.

గూఢచారి సినిమా చాలా స్పెషల్ అని, ఆరేళ్లుగా ఆ సినిమా పై ప్రశంసలు వింటూనే ఉన్నానని అడవి శేష్ ఈ సందర్భంగా చెప్పారు. గూఢచారి కంటే కూడా G2 బిగ్గర్ అండ్ ఇంటర్నేషనల్ స్కేల్‌లో ఉంటుందని తెలిపారు. గూఢచారిని ఎంజాయ్ చేసినవారందరికీ G2 మరింత మాసివ్‌గా, విజువల్ ట్రీట్‌గా ఉంటుందని నమ్మకంగా చెప్పారు.

40 శాతం షూటింగ్ కంప్లీట్ అయిందని, సినిమా చాలా క్వాలిటీగా వస్తున్నదని దర్శకుడు వినయ్ తెలిపారు. ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ అవుతుందనే నమ్మకం వచ్చిందని, ఓ విజువల్ వండర్‌ను మీరు చూస్తారని చెప్పారు. డైనిమిక్ యాక్షన్ సీక్వెన్స్, థ్రిల్లింగ్ సెట్‌లు, సినిమా స్టోరీ అన్నీ కూడా ప్రేక్షకులకు ఒక సూపర్ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇస్తుందని వివరించారు. ముఖ్యంగా యాక్షన్ డ్రామా జానర్ అభిమానులకు G2 ఒక ట్రీట్ అవుతుందని పేర్కొన్నారు.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి గూఢచారి ఒక మైలురాయిగా నిలిచిన చిత్రమని, G2 40 శాతం షూటింగ్ కూడా అద్భుతంగా చేశామని చెప్పడానికి చాలా హ్యాపీగా ఉన్నదని నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ చెప్పారు. ఇటీవలే ఒక యాక్షన్ సీక్వెన్స్ పూర్తి చేశామని.. గూఢచారి సినిమాకు పెట్టిన మొత్తం డబ్బుల కంటే కూడా ఎక్కువగా ఖర్చు చేసి అద్భుతంగా తీశామని వివరించారు.

తమకు G2 అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ అని మరో నిర్మాత అభిషేక్ అగర్వాల్ తెలిపారు. ఇంటర్నేషనల్ స్కేల్‌లో G2ను తీసుకురావడానికి శేష్, వినయ్, టీం చాలా కష్టపడుతున్నారని పేర్కొన్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×