BigTV English

Weight Gain Food: మీ పిల్లలు సన్నగా ఉన్నారా? ఈ ఫుడ్ తినిపిస్తే చాలు.. ఈజీగా బరువు పెరుగుతారు

Weight Gain Food: మీ పిల్లలు సన్నగా ఉన్నారా? ఈ ఫుడ్ తినిపిస్తే చాలు.. ఈజీగా బరువు పెరుగుతారు

Weight Gain Food: పిల్లల శారీరక, మానసిక ఎదుగుదల చాలా మఖ్యం. ఈ రెండింటిపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చిన్నపిల్లయినా వారికి ఫుడ్ తినిపించడం తల్లులకు సవాన్ అనే చెప్పాలి. కొన్ని సార్లు ఇంట్లో చేసే చాలా పదార్థాలను చూసి పారిపోతారు పిల్లలు. ఇదిలా ఉంటే బయట మార్కెట్‌లో దొరికే చాక్లెట్లు, ఐస్ క్రీములు, జంక్ ఫుడ్ బర్గర్, పిజ్జా, మోమో వంటి వాటిని తినడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. కానీ ఇవి వారి ఆరోగ్యానికి ఎంత హాని కలిగిస్తాయో అందరికీ తెలిసిన విషయమే.


చాలా మంది పిల్లలుసన్నబడిపోతారు. అయితే ఇలాంటి పిల్లలు తినే ఆహారం గురించి వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతారు. మీరు కూడా మీ పిల్లల ఎదుగుదల గురించి ఆందోళన చెందుతుంటే.. ఎలాంటి పదార్థాలు పెడితే వారి శారీరక మానసిక ఆరోగ్యం బాగుంటుందనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కిడ్స్ డైట్‌లో శారీరక, మానసిక ఎదుగుదల వీటిని తప్పకుండా తినిపించాలి:
సన్నగా ఉన్న పిల్లల ఆహారంలో ఈ 5 పదార్థాలను తప్పకుండా చేర్చాలి. పోషకాహారం సరిగ్గా అందితేనే వారి కండరాలు పెరుగుతాయి. అంతే కాకుండా, మెదడు కూడా షార్ప్ అవుతుంది.


ప్రతిరోజు గుడ్లు:
గుడ్లలో ప్రొటీన్లు, విటమిన్ డి, విటమిన్ బి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫోలిక్ యాసిడ్ తో పాటు అనేక ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు ప్రతిరోజు ఒకటి లేదా రెండు గుడ్లు తినిపించడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. గుడ్డు పిల్లలను ఆరోగ్యంగా, ఫిట్‌గా మార్చడమే కాకుండా, ఇందులో ఉండే ఫోలిక్ యాసిడ్ పిల్లలను మానసికంగా దృఢంగా మార్చడంలో సహాయపడుతుంది.

పాలు :
పిల్లల మొత్తం అభివృద్ధి కోసం వారి ఆహారంలో పాలు చేర్చడం చాలా ముఖ్యం. క్యాల్షియం, విటమిన్ డి, ఫాస్పరస్ వంటి అనేక పోషకాలు పాలలో పుష్కలంగా లభిస్తాయి. ఇవి ఎముకలను బలోపేతం చేస్తాయి. ఈ కారణంగా, పిల్లల శారీరక , మానసిక అభివృద్ధి రెండూ వేగంగా జరుగుతాయి. పిల్లలు తరచుగా పాలు తాగేటప్పుడు చుక్కలు చూపిస్తారు, కానీ మీరు వివిధ రకాల రుచులను కలపడం ద్వారా ఈజీగా పాలు తాగుతారు.

రోజు కొన్ని డ్రై ఫ్రూట్స్ ఇవ్వండి:
డ్రై ఫ్రూట్స్‌లో వివిధ రకాల పోషకాలు ఉంటాయి. ఇవి పిల్లల శారీరక , మానసిక అభివృద్ధికి చాలా ముఖ్యమైనవి. అందువల్ల పిల్లలకు డ్రై ఫ్రూట్స్‌ను తక్కువ మొత్తంలో తినిపించడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా బాదం, వాల్‌నట్స్‌, ఎండుద్రాక్ష, జీడిపప్పు, మఖానా వంటి డ్రై ఫ్రూట్స్‌ను పిల్లల డైట్‌లో చేర్చాలి.

తక్షణ శక్తి కోసం అరటిపండు ఇవ్వండి:
ఎదిగే పిల్లలకు రోజు అరటిపండు తినిపిస్తే ఎంతో మేలు జరుగుతుంది. అరటిపండులో విటమిన్ బి6, విటమిన్ సి, విటమిన్ ఎ, మెగ్నీషియం, పొటాషియం , ఫైబర్ పుష్కలంగా లభిస్తాయి. దీన్ని తినడం వల్ల పిల్లలకు తక్షణ శక్తి వస్తుంది. దీంతో పాటు అరటిపండు తినడం వల్ల పిల్లల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. రోజు అరటిపండు తింటే పిల్లల మానసిక ఎదుగుదల కూడా వేగంగా ఉంటుంది.

Also Read: చలికాలంలో రాత్రి పూట బెల్లం పాలు త్రాగితే.. మతిపోయే లాభాలు

దేశీ నెయ్యి :
పిల్లలు శారీరకంగా ఆరోగ్యంగా, దృఢంగా ఉండాలంటే వారి ఆహారంలో దేశీ నెయ్యిని కూడా చేర్చాలి. నెయ్యి వల్ల పిల్లలకు మంచి కొవ్వు, DHA లభిస్తాయి. నిత్యం నెయ్యి తినడం వల్ల పిల్లల మెదడు కూడా షార్ప్ అవుతుంది. ఇదే కాకుండా, నెయ్యిలో ఉండే యాంటీ ఫంగల్, యాంటీఆక్సిడెంట్లు , యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కూడా పిల్లల రోగనిరోధక శక్తిని పెంచడంలో చాలా సహాయకారిగా నిరూపిస్తాయి.

Related News

Non-vegetarian food: ముక్క లేనిదే ముద్ద దిగడం లేదా ? అయితే జాగ్రత్త !

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Big Stories

×