BigTV English

BB Telugu 8 Promo: నిఖిల్ వర్సెస్ గౌతమ్.. రంగుపడుద్ది..!

BB Telugu 8 Promo: నిఖిల్ వర్సెస్ గౌతమ్.. రంగుపడుద్ది..!

BB Telugu 8 Promo.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 చివరి దశకు చేరుకుంది. ఇక మరో వారం రోజుల్లో సీజన్ కూడా పూర్తి కాబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కంటెస్టెంట్స్ కూడా ఎవరికి వారు తమ కోసం స్టాండ్ తీసుకొని టైటిల్ విన్నర్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా ఈరోజుకు సంబంధించి ప్రోమోని విడుదల చేశారు. ఇక ఆ ప్రోమోలో “రంగు పడుద్ది” అనే ఛాలెంజ్ నిర్వహించగా అందులో టైటిల్ రేస్ లో నిలబడిన గౌతమ్ , నిఖిల్ భారీగా గొడవపడ్డారు. ఇక గొడవ ఏంటో ఇప్పుడు చూద్దాం.


లాస్ట్ వీకెండ్ లో గోల్డెన్ టికెట్ అందుకున్నారు గౌతమ్, నిఖిల్, రోహిణి. మీ ముగ్గురు లో నుంచి ఒకరికి మాత్రమే ఓటు అప్పీల్ చేసుకునే అవకాశం లభిస్తుంది. ఆ ఒక్క సభ్యులు ఎవరు అని తెలుసుకోవడానికి మీ ముందు ఉన్న టేబుల్ పైన మట్టి కేక్ రూపంలో చేయబడింది. దానిపైన 8 అనే నెంబర్ ఉంటుంది. కేక్ ని కట్ చేస్తూ ఎనిమిదిని కింద పడకుండా చూడడం మీ బాధ్యత అంటూ ముగ్గురికి టాస్క్ నిర్వహించారు బిగ్ బాస్. అయితే రోహిణి ఈ టాస్క్ లో ఓడిపోతుంది. ఇక తర్వాత నిఖిల్, గౌతమ్ మిగులుతారు. వీరిద్దరికి చివరి ఛాలెంజ్ నిర్వహిస్తారు బిగ్ బాస్.

బిగ్ బాస్ ఇస్తున్న చివరి ఛాలెంజ్ రంగు పడుద్ది. ఈ ఛాలెంజ్ లో గెలవడానికి మీరు చేయవలసిందల్లా మీ ప్రత్యర్థి టీ షర్టు పైన ఎక్కువ రంగు ఉండేలా చూసుకోవడం అంటూ టాస్క్ ప్రారంభించారు బిగ్ బాస్ . ఇక నిఖిల్ మరియు గౌతమ్ ఇద్దరూ కూడా తమకు ఇచ్చిన వైట్ కలర్ టీ షర్ట్ ధరించి తమ చేతులతో రంగు పులుముకొని ప్రత్యర్థి టీ షర్ట్ పై పూసే ప్రయత్నం చేశారు. అయితే ఈ టాస్క్ లో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ముందుగా నిఖిల్ గౌతమ్ ను కావాలని కొట్టి ఆయన కాలు పట్టుకొని ఈడ్చుకుంటూ వెళ్ళాడు. కానీ చివర్లో మాత్రం తాను తప్పు చేయలేదన్నట్టు బిహేవ్ చేశాడు. నిఖిల్ ఎందుకు నన్ను కొట్టావు అంటూ గౌతమ్ ను బ్లేమ్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ గౌతమ్ నేను రంగు రాయబోతుంటే నీకు అలా అనిపించింది అని అడగ్గా.. నువ్వు ప్రతిదీ అలాగే చెబుతావు అంటూ ఇక్కడ గౌతమ్ పై నెగెటివిటీ క్రియేట్ చేసేలా చేశాడు. మచ్చా నువ్వు కింద పడేసి ఈడ్చుకుంటూ వెళ్లావు కదా అది గుర్తులేదా అంటే.. నిఖిల్ మాత్రం పక్కకెళ్ళి కూర్చో బే అంటూ కొంచెం ఇబ్బందికరంగా మాట్లాడాడు. దీంతో కోపం తెచ్చుకున్న గౌతం నిఖిల్ పై ఫైర్ అయ్యాడు. గేమ్లో కావాలని కొట్టావని నిఖిల్ అన్నాడు. అప్పుడు గౌతమ్ ఎవరైనా కావాలని కొడతారా అంటే.. ఎవరికి తెలుసు నువ్వు కొట్టినా కొడతావ్ అంటూ నిఖిల్ మళ్లీ గౌతమ్ పై విరుచుకుపడ్డాడు. మధ్యలో ప్రేరణ కలగజేసుకుంది. గౌతమ్ ను ఆపే ప్రయత్నం చేసింది. కానీ ఇది నా పర్సనల్ విషయం అంటూ ప్రేరణపై ఫైర్ అయ్యాడు గౌతమ్. నెటిజన్స్ కూడా మధ్యలో నీ పెత్తనం ఏంటి అంటూ ప్రేరణపై కూడా ఫైర్ అవుతున్నారు.


Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×