BigTV English

Instant Vadas: మరమరాలతో అప్పటికప్పుడు క్రిస్పీ గారెలు ఇలా చేసేయండి, రెసిపీ ఇదిగో

Instant Vadas: మరమరాలతో అప్పటికప్పుడు క్రిస్పీ గారెలు ఇలా చేసేయండి, రెసిపీ ఇదిగో

గారెలు అంటే ఇష్టం లేనివారు ఎవరుంటారు? అయితే గారెలు చేయాలంటే పెద్ద తతంగం అనుకుంటారు. ముందే మినప్పప్పును నానబెట్టి, దాన్ని రుబ్బి రెడీ చేసుకోవాలనుకుంటారు. అందుకే గారెలు చేయాలంటే టైం ఎక్కువ పడుతుందని వదిలేస్తారు. నిజానికి ఎలాంటి పప్పు నానబెట్టాల్సిన అవసరం లేకుండా… ఇన్సెంట్‌గా అప్పటికప్పుడు గారెలు చేసుకోవచ్చు. ఇందుకోసం మరమరాలను ఉపయోగించండి. మరమరాలు చాలా సులువుగా నానిపోతాయి. వీటితో చేసే గారెలు కూడా క్రిస్పీగా ఉంటాయి. కేవలం అరగంటలో మీరు టేస్టీ క్రిస్పీ గారెలు తినేయవచ్చు. ఈ గారెలతో కొబ్బరి చట్నీని పక్కన పెట్టుకుంటే ఎంతో రుచి. మరమరాలతో క్రిస్పీ గారెలు ఎలా చేయాలో తెలుసుకోండి


మరమరాలతో క్రిస్పీ గారెలు రెసిపీకి కావలసిన పదార్థాలు
మరమరాలు – మూడు కప్పులు
మిరియాల పొడి – ఒక స్పూను
కొత్తిమీర తరుగు – నాలుగు స్పూన్లు
బియ్యప్పిండి – అరకప్పు
నీళ్లు – సరిపడినన్ని
అల్లం తరుగు – ఒక స్పూను
కరివేపాకుల తరుగు – ఒక స్పూను
పచ్చిమిర్చి తరుగు – రెండు స్పూన్లు
ఉప్పు – రుచికి సరిపడా
పెరుగు – అరకప్పు

మరమరాల గారెలు రెసిపీ
⦿ మరమరాలు అన్ని సూపర్ మార్కెట్లలో సులువుగా దొరుకుతాయి. బయట కూడా వీటిని అమ్ముతూనే ఉంటారు.
⦿ వాటిని తీసుకొని ఒక గిన్నెలో వేయండి. అవి నానడానికి వీలుగా అందులో నీళ్లు వేయండి.
⦿ పది నిమిషాలు పక్కన పెట్టేయండి. పది నిమిషాల్లోనే ఈ మరమరాలు మెత్తగా నానిపోతాయి.
⦿ ఇప్పుడు చేత్తోనే వాటిని తీసి గట్టిగా పిండి మిక్సీలో వేయండి.
⦿ రెండు స్పూన్ల నీళ్లు వేసి దాన్ని మెత్తగా రుబ్బండి.
⦿ గారెలకు పిండి గట్టిగా ఉండాలి. కాబట్టి ఎక్కువ నీరు వేయకండి.
⦿ ఈ మొత్తం మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేయండి.
⦿ ఆ గిన్నెలోనే పచ్చిమిర్చి తరుగును, మిరియాల పొడిని, జీలకర్రను, అల్లం తురుమును, కొత్తిమీర తరుగును, కరివేపాకు తరుగును వేసి బాగా కలపండి.
⦿ అలాగే పెరుగు, బియ్యప్పిండి కూడా వేసి బాగా కలపండి.
⦿ ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనెను వేయండి.
⦿ నూనె వేడెక్కాక ఈ పిండిలో నుంచి చిన్న ముద్దను తీసి గారెల్లాగా చేత్తోనే ఒత్తుకొని మధ్యలో చిల్లు పెట్టండి.
⦿ దాన్ని వేడెక్కిన నూనెలో వేసి వేయించుకోండి.
⦿ రెండు వైపులా వేగాక తీసి పక్కన పెట్టుకోండి. అంతే టేస్టీ గారెలు రెడీ అయినట్టే.
⦿ దీన్ని మీరు టమాటో చట్నీతో తిన్నా, చికెన్ కర్రీతో తిన్నా కొబ్బరి చట్నీతో తిన్నా రుచి అదిరిపోతుంది.


Also Read: క్యారెట్ టమోటోలతో ఇలా హెల్తీ పచ్చడి చేసేయండి, రెసిపీ చాలా సులువు

మరమరాలతో చేసిన గారెలు మీ అందరికీ కచ్చితంగా నచ్చుతాయి. ఒక్కసారి వీటిని చేసి చూడండి. మీకు ఇది బాగా నచ్చుతాయి. మార్నింగ్ టిఫిన్‌గా, సాయంత్రం పూట స్నాక్స్ గా కూడా వీటిని తినవచ్చు. ఒక్కసారి వీటిని చేసుకుని చూడండి. మీకు వీటి రుచి నచ్చడం ఖాయం. ఎవరైనా అతిథులు హఠాత్తుగా వచ్చినప్పుడు కూడా గారెలు చేయాల్సి వస్తే ఇలా మరమరాలతో చేసి పెట్టండి. వారికి కొత్తగాను, టేస్టీగాను అనిపిస్తాయి. చికెన్ కూరతో గారెలు తింటే చాలా రుచిగా ఉంటాయని అంటారు. కాబట్టి ఈ మరమరాలు గారెలు కూడా మీరు చికెన్‌తో ప్రయత్నించవచ్చు.

Related News

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Steel Pans: స్టీల్ పాత్రల్లో.. వీటిని పొరపాటున కూడా వండకూడదు !

Oral Health: వర్షాకాలంలో తరచూ వచ్చే గొంతు నొప్పికి.. ఈ టిప్స్‌తో చెక్ !

Diabetic Patients: షుగర్ పేషెంట్లు ఎలాంటి ఫుడ్ తినాలో తెలుసా ?

Big Stories

×