BigTV English

Betel Leaf For Hair Growth : జుట్టు సంరక్షణకు తమలపాకు.. ఎలా వాడాలంటే..

Betel Leaf For Hair Growth : జుట్టు సంరక్షణకు తమలపాకు.. ఎలా వాడాలంటే..

Betel Leaf For Hair Growth : మారుతున్న ఆహార అలవాట్ల వల్లనో, కాలుష్యం కారణంగానో కురుల సమస్యలు అధికమౌతున్నాయి. ఈ సమస్యలను నిరోధించటంలో తమలపాకు బాగా ఉపయోగపడుతుంది. దీనిలో ఉండే పొటాషియం, నికోటినిక్ యాసిడ్, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బీ2 వంటి పోషకాలు కేశాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. మరి తమలపాకులతో ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చో చూద్దామా!


సులభమైన పద్ధతుల్లో ఆరోగ్యకరమైన చిట్కాలను అనుసరించటం పెద్ద కష్టమేమీకాదు. కొంచెం ఓపికతో వ్యవహరించటమే ముఖ్యం. అయితే, తమలపాకులతో రెండు రకాలుగా కురులను రక్షించుకోవచ్చు. అందులో మొదటిది.. కొన్ని తమలపాకులను తీసుకుని బాగా కడిగి వాటిని పేస్టు చేసుకోవాలి. ఆ పేస్టులో టీస్పూన్ నెయ్యి వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని మాడు నుంచి కురుల చివర వరకు పట్టించాలి. ఒక గంట తర్వాత తల స్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే.. జుట్టు చిట్లడం, పల్చబడటం, పొడిబారటం, జుట్టు రాలటం వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి.

ఇక రెండో టిప్.. తమలపాకులతో చేసిన పేస్టులో కొద్దిగా కొబ్బరి నూనె, ఆముదం కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు రాసి మసాజ్ చేసిన 30 నిమిషాల తర్వాత స్నానం చేయాలి. ఇలా 10 రోజులకు ఒకసారి చేస్తే.. చుండ్రు సమస్య, జుట్టులో ఉండే ఇన్ఫెక్షన్లు తగ్గి.. కురులు ఒత్తుగా, పొడవుగా పెరుగుతాయి. అంతేకాకుండా కురుల రంగు(నలుపు) మారకుండా ఉండేందుకు తమలపాకులోని విటమిన్స్ దోహదపడతాయి. తమలపాకులు కండిషనర్‌గా కూడా పనిచేస్తుంది.


Related News

Non-vegetarian food: ముక్క లేనిదే ముద్ద దిగడం లేదా ? అయితే జాగ్రత్త !

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Big Stories

×