Big Stories

Flu virus : పందుల నుంచి ఫ్లూవైరస్.. బ్రిటన్‌లో కలవరం

Flu virus

Flu virus : చైనాలో కొత్త రకం నిమోనియాతో ప్రపంచం కలవరపడుతోంది. ఈ తరుణంలో బ్రిటన్‌లో ఓ వార్త మరింత ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా పందుల్లో కనిపించే ఫ్లూ వైరస్ అక్కడ తొలిసారిగా ఓ వ్యక్తికి సంక్రమించింది. శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్న రోగిని యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ(UKHSA) నిపుణులు పరీక్షించినప్పుడు ఇది బయటపడింది. అతనికి ఇన్‌ఫ్లూయెంజా A(H1N2)v వైరస్ సోకినట్టుగా నిర్థారించారు.

- Advertisement -

వాస్తవానికి పందుల్లో ఈ తరహా ఫ్లూ వైరస్ కనిపిస్తుంటుందని నిపుణులు వెల్లడించారు. అతనిలో స్వల్పంగా ఫ్లూ లక్షణాలు కనిపించాయని, ఆ తర్వాత కోలుకున్నాడని వైద్యులు వివరించారు. అతనితో కాంటాక్ట్ అయిన వారి వివరాలను సేకరిస్తున్నారు. అలాగే నార్త్ యార్క్‌షైర్‌లోని ఆస్పత్రులపైనా UKHSA కన్నేసింది.

- Advertisement -

పెంపకందార్ల నుంచి కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. వారు పెంచుకుంటున్న పందుల్లో స్వైన్ ఫ్లూ లక్షణాలు ఏవైనా ఉన్నాయా? అని ప్రశ్నిస్తున్నారు. ఫ్లూ కేసులపై నిఘాలో భాగంగా రొటీన్‌గా పరీక్షలు, జినోమ్ సీక్వెన్సింగ్ వంటివి నిర్వహిస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఇది బయటపడిందని UKHSAలో డైరెక్టర్ మీరా చాంద్ వివరించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News