BigTV English

Betel Leaf : రెండు తమలపాకులు నమిలితే..!

Betel Leaf : రెండు తమలపాకులు నమిలితే..!
Betel leaf benefits

Betel leaf benefits (health news today):


చాలా మంది భోజనం తర్వాత తమలపాకులు తింటుంటారు. భోజనం చేసిన తర్వాత తమలపాకులు తింటే తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. తమలపాకు తినడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయని మనందరికీ తెలిసిన విషయమే. తమలపాకులను నిత్యంపాన్, పాన్ బీడా వంటి వాటి ద్వారా తీసుకుంటూ ఉంటాం.

ఈ తమలపాకులో క్యాల్షియం ఐరన్ మాంగనీస్ విటమిన్ అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. తమలపాకు శరీర ఉష్ణోగ్రతను పెంచడానికి కూడా సహాయపడుతుంది. అంతేకాకుండా పేగుల్లో పీహెచ్ స్థాయిలను క్రమబద్ధీకరించడానికి తమలపాకులు ఉపయోగపడతాయి. కడుపునొప్పి నుంచి త్వరగా ఉపశమనం కలిగిస్తుంది.


Read More : ఎనర్జీ డ్రింక్స్ తాగేస్తున్నారా..!

తమలపాకులను ఉదయాన్నే పరగడుపున తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ప్రతి రోజు ఉదయాన్నే తమలపాకులు తినడం వల్ల పోషకాల లోపం సమస్యను దూరం చేసుకోవచ్చు. చాతి ఊపిరితిత్తులు ఆస్తమాతో బాధపడే వారికి తమలపాకు అద్భుతమైన ఔషధం.

తమలపాకులపై కొద్దిగా ఆవాల నూనె రాసి వేడి చేసి చాతిపై ఉంచితే గుండె నొప్పి సమస్యలు తొలగిపోతాయి. అంతేకాకుండా పరగడుపుతో తమలపాకులు తింటే ఎలాంటి ఇన్ఫెక్షన్లు రావు. కీళ్ల నొప్పులతో బాధపడేవారికి తమలపాకు మంచి మెడిసిన్.

Read More : ఈ డ్రై ఫ్రూట్స్‌తో బరువు వేగంగా తగ్గుతారు..!

ఇటీవల నిర్వహించిన పరిశోధనల్లో తమలపాకు రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గించే సామర్ధ్యాన్ని కూడా కలిగి ఉంటాయని తేలింది. అలానే రక్తంలో గ్లూకోస్‌ను అదుపు చేయకపోవడం వల్ల కలిగే మంటను కూడా అదుపు చేస్తుంది. తమలపాకులో విటమిన్-సి, కెరోటిన్, నియాసిన్ వంటి విటమిన్లు ఉంటాయి.

తమలపాకు బెనిఫిట్స్

  • దగ్గు, ఆయాసంతో బాధపడుతున్న పిల్లలకు.. తమలపాకులను ఆవనూనెలో నానపెట్టి కొద్దగా వేడిచేసి చాతిపై రుద్దాలి.
  • గొంతులో మంటగా ఉన్నవారు.. తమలపాకు రసాన్ని గొంతు భాగంలో రుద్దితే మంట తగ్గుతుంది.
  • తమలపాకును నూరి.. గాయలపై రాస్తే త్వరగా మానిపోతాయి
  • వెన్ను నొప్పి వేధిస్తుంటే.. కొబ్బరి నూనె, తమలపాకుల రసాన్ని కలిపి ఆ నొప్పి భాగంలో రాయండి
  • చెవినొప్పితో బాధపడేవారు.. తమలపాకు రసాన్ని పిండి రెండు చుక్కలు చెవిలో వేయండి
  • కాల్షియం లోపంతో బాధపడేవారు.. సున్నంతో వీటిని నమిలితే మేలు
  • తమలపాకులో విటిమిన్ సి అధికంగా ఉంటుంది. వీటిని తింటే రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు

Disclaimer : ఈ కథనం పలు అధ్యయనాలు, మెడికల్ జర్నల్స్ ఆధారంగా రూపొందించబడింది.

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×