BigTV English

Farmer dies in Delhi protest : ఢిల్లీ చలో నిరసనలో విషాదం.. గుండెపోటుతో రైతు మృతి..

Farmer dies in Delhi protest : ఢిల్లీ చలో నిరసనలో విషాదం.. గుండెపోటుతో రైతు మృతి..

Farmer dies in Delhi Chalo program: పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం చేయాలని కోరుతూ రైతులు ఢిల్లీ చలో కార్యక్రమంతో నిరసనకు ఢిల్లీ బాటపట్టారు. ఈ ఆందోళనకు మద్దతుగా ఫిబ్రవరి 16న సంయుక్త కిసాన్ మోర్చా.. గ్రామీణ భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ పిలుపుకు పలు పార్టీలు, సంఘాలు మద్దతు తెలిపాయి. ఈ నిరసనలో పాల్గొన్న వృద్ధ రైతు గుండెపోటుతో మరణించాడు.


పంజాబ్-హర్యానా సరిహద్దులోని శంభులో రైతులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అన్నదాతలు అక్కడకి పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఓ వృద్ద రైతు(78)కు గుండెపోటు రావడంతో.. 4 గంటల సమయంలో రాజ్‌పురాలోని ప్రభుత్వ ఆసుపత్రికి తిసుకెళ్లారు. అక్కడి నుంచి పాటియాలాలోని ప్రభుత్వ రాజింద్ర ఆసుపత్రికి తరలించారు.

అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ రాజింద్ర ఆసుపత్రిలో రైతు మరణించాడు. మృతుడు పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాకు చెందిన జ్ఞాన్ సింగ్‌గా గుర్తించారు. ఇప్పుడే కాడు అంతకు మందు నిరసనలో కూడా కొందరు రైతులు మరణించారు.


Read More:  మణిపూర్ లో మళ్లీ చెలరేగిన హింస.. ఇద్దరు మృతి

మరోవైపు చండీగఢ్‌లో కేంద్ర మంత్రులు.. రైతు సంఘూల నేతలతో మూడు దఫాలుగా చర్చలు జరిపారు. అయితే ఈ చర్చలు ఫలించలేదు. హర్యానాలో రైతు సంఘాల నేతలు పోలీసుల ఆక్షంలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎంఎస్‌పీకి చట్టపరంగా హామీ, ఇతర డిమాండ్లపై చర్చించారు. రైతుల డిమాండ్లపై ఆదివారం సాయంత్రం మరోసారి చర్చలు జరుగనున్నాయి.

Related News

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

Big Stories

×