BigTV English

Impact on Eggs: బర్డ్ ఫ్లూ కల్లోలం.. మరి గుడ్డు తినొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?

Impact on Eggs: బర్డ్ ఫ్లూ కల్లోలం.. మరి గుడ్డు తినొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?

Bird Flu Impact On Eggs: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ విజృంభిస్తోంది. కోళ్లకు బర్డ్‌ ఫ్లూ సోకి భారీ సంఖ్యలో చనిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. ఏపీలో ప్రభావం మరింత ఎక్కువగా ఉండటంతో తెలంగాణ సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఏపీ నుంచి కోళ్ల వాహనాలు రాకుండా అడ్డుకుంటున్నారు. ఫౌల్ట్రీలలో బర్డ్ ఫ్లూ సోకుతున్న నేపథ్యంలో రైతులకు అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఇప్పటికే కొద్ది రోజులు చికెన్ తినడం మానేయడం మంచిదన్నారు. అయితే, బర్డ్ ఫ్లూ నేపథ్యంలో కోడి గుడ్లు తినవచ్చా? తినకూడదా? అనే సందేహాలు ప్రజల్లో తలెత్తుతున్నాయి. నిఫుణులు ఏం చెప్తున్నారో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..


బర్డ్ ఫ్లూ ఎలా సోకుతుందంటే?

కోళ్లు, బాతులు లాంటి పక్షి జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ అనేది విజృంభిస్తుంది. ఈ వ్యాధి సోకిన కోళ్లు, లేదంటే బాతులు ఇతర రకాలా పక్షి జాతులతో ఇతర కోళ్లు కలిసి ఉండటం వల్ల సోకే అవకాశం ఉంటుంది. కలుషితమైన ఆహారం, గాలి ద్వారా పౌల్ట్రీలలో బర్డ్ ఫ్లూ వేగంగా వ్యాపిస్తుంది. బర్డ్ ఫ్లూ సోకిన కోళ్లు, బాతులు మొదట ఆరోగ్యంగానే కనిపిస్తాయి. కానీ, వైరస్ తీవ్రత పెరిగే కొద్దీ తీవ్రమైన అనారోగ్యానికి గురవుతాయి. శ్వాసకోశ, జీర్ణ, నాడీ వ్యవస్థలు నాశనం అవుతాయి. తక్కువ సమయంలోనే చిపోయే అవకాశం ఉంటుంది.


Read Also: గుండు చేయించుకుంటే ఇన్ని ప్రయోజనాలా? మీరు అస్సలు నమ్మరేమో!

గుడ్లు తింటే బర్డ్ ఫ్లూ వస్తుందా?

ఈ వైరల్ ఇన్ఫెక్షన్ కోళ్లను ప్రభావితం చేస్తున్నప్పటికీ..  గుడ్ల మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపించదంటున్నారు నిపుణులు.  గుడ్ల గురించి ఎలాంటి ఆందోళన అవసరం లేదంటున్నారు. గుడ్ల ద్వారా బర్డ్ ఫ్లూ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యాపించే అవకాశం లేదంటున్నారు.గుడ్లు తినడం ద్వారా బర్డ్ ఫ్లూ వ్యాపిస్తుందనేది కేవలం అపోహ అంటున్నారు వైద్య నిపుణులు. బర్డ్ ఫ్లూ వైరస్ అనేది ఉడికిండం ద్వారా నాశనం అయ్యే అవకాశం ఉందంటున్నారు. సరిగ్గా ఉడికించిన గుడ్లు అంటే.. పచ్చసొన, తెల్లసొన  గట్టిగా ఉంటే ఎలాంటి ప్రమాదం ఉండదంటున్నారు. బర్డ్ ఫ్లూ సోకిన కోళ్ల నుంచి వచ్చిన గుడ్ల వల్ల వినియోగదారులకు ఎలాంటి సమస్యలు రావంటున్నారు. అయితే, తక్కువగా ఉడికించిన గుడ్లు లేదంటే పచ్చి గుడ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదంటున్నారు. బర్డ్ ఫ్లూతో కోళ్లు చనిపోతున్న నేపథ్యంలో గుడ్ల మీద కూడా ఈ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. అదే సమయంలో బర్డ్ ఫ్లూ సోకిన కోళ్లను చంపడం ద్వారా గుడ్ల ఉత్పత్తి తగ్గిపోయే అవకాశం ఉంటుంది.  మరికొద్ది రోజుల్లో గుడ్ల ధరలు పెరిగే అవకాశం ఉంటుంది.

Read Also: ఒక్కో రంగు గులాబీ వెనుక ఒక్కో అర్థం, వాలంటైన్స్ డే వీక్ లో ఏ గులాబీ ఎవరికి ఇవ్వాలంటే?

Read Also: చిన్న కౌగిలింతతో బోలెడన్ని బెనిఫిట్స్.. హగ్ ఇవ్వండి గురూ!

Related News

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Weight Loss: ఈ యోగాసనాలతో.. 10 రోజుల్లోనే వెయిట్ లాస్

Sugar: చక్కెర తినడం 30 రోజులు ఆపేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా ?

Big Stories

×