మనిషి తనలోని సంతోషాన్ని లేదంటే బాధను పంచుకునేందుకు ఇష్టమైన వారిని హగ్ చేసుకుంటాడు. మనసును కుదుటపరుచుకుంటాడు. కౌగిలింత అనేది ప్రేమ, ఓదార్పు, అనుబంధాన్ని అందిస్తుంది. అందుకే చాలా మంది కలవగానే హగ్ చేసుకుంటారు. ఇక వాలంటైన్స్ డే వచ్చిందంటే చాలు.. కొత్త ట్రెండ్ మొదలయ్యింది. గతంలో కేవలం ఫిబ్రవరి 14న తమ ప్రేమను వ్యక్త పరుచుకునేందుకు వాలంటైన్స్ డే జరుపుకునే వాళ్లు. కానీ, ఇప్పుడు వాలంటైన్ వీక్ జరుపుకుంటున్నారు. వారం రోజుల పాటు ఒక్కో రోజు ఒక్కో కాన్సెప్ట్ తో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అందులో భాగంగానే ఆరో రోజున అంటే ఫిబ్రవరి 12న ‘హగ్ డే’ నిర్వహించుకుంటున్నారు. ఇంతకీ కౌగిలింతో కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
⦿ ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది
కౌగిలింత అనేది ఒత్తిడిని తగ్గిస్తుంది. బాడీలో ఒత్తిడికి కారణమయ్యే హార్మోన్ అయిన కార్టిసాల్ ను తగ్గించడం ద్వారా ఒత్తిడి స్థాయిలను కంట్రోల్ చేస్తుంది. ఒకరిని మరొకరు కౌగిలించుకున్నప్పుడు.. శరీరం ఆక్సిటోసిన్‌ను విడుదల చేస్తుంది. ప్రేమ హార్మోన్ గా పిలిచే ఈ హార్మోన్ మనస్సును ప్రశాంతపరుస్తుంది. వెచ్చని ఆలింగనం తక్షణమే ఆందోళనను తగ్గిస్తుంది.
⦿ గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది
కౌగిలింత గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఎదుటి వ్యక్తిని కౌగిలించుకున్నప్పుడు, మీ హృదయ స్పందన రేటు తగ్గుతుంది. బీపీ కంట్రోల్ అవుతుంది. కౌగిలింతతో కలిగే ప్రశాంతమైన ప్రభావం హృదయనాళ ఒత్తిడిని తగ్గిస్తుంది. గుండె జబ్బులను అరికడుతుంది.
⦿ రోగనిరోధక శక్తి బలోపేతం
కౌగిలింతలు తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచడం ద్వారా రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలోసాయపడుతుంది. తరచుగా కౌగిలింతల వల్ల ఒత్తిడి స్థాయిలను తక్కువగా ఉంచుతుంది. బలమైన రోగనిరోధక వ్యవస్థను తయారయ్యేలా చేస్తాయి.
⦿ మానసిక సంతోషం
కౌగిలింత సమయంలో ఆక్సిటోసిన్ విడుదల అవుతుంది. ఇది ఆనందానికి కారణమయ్యే సెరోటోనిన్, డోపామైన్ స్థాయిలను పెంచుతుంది. ఫలితంగా మానసిక ఆనందం కలుగుతుంది. ఒంటరితనం నుంచి ఉపశమనం పొందేలా చేస్తుంది. తరచుగా కౌగిలింతలు ఇచ్చుకునే వ్యక్తులు పాజిటివ్ గా ఉంటారు.
⦿ నొప్పిని తగ్గిస్తుంది
కౌగిలింతల వలన శరీరంలోని సహజ నొప్పులు తగ్గిపోతాయి. శారీరక స్పర్శ సమయంలో విడుదలయ్యే ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్లు హార్మోన్లు సహజ నొప్పిని తగ్గించే లక్షణాలను కలిగి ఉంటాయి. తలనొప్పి, కండరాల నొప్పి, దీర్ఘకాలిక నొప్పి మాయం అవుతాయి.
Read Also: వారం రోజుల ప్రేమికుల పండుగ, ఒక్కో రోజు ఒక్కో స్పెషల్!
⦿ సంబంధాలు బలోపేతం
కౌగిలింతలు నమ్మకం, భావోద్వేగ భద్రతను పెంచుతాయి. వ్యక్తుల మధ్య బంధాలను బలపరుస్తాయి. తరచుగా హగ్ చేసుకోవడం వల్ల బలమైన బంధాలు ఏర్పడుతాయి.
⦿ మెరుగైన నిద్ర
కౌగిలింతలు ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తాయి కాబట్టి.. చక్కటి నిద్ర లభిస్తుంది. ప్రశాంతమైన మైండ్, బాడీ నిద్రపోవడాన్ని పెంచుతుంది.
సో, మీరు కూడా వాలంటైన్ వీక్ లో భాగంగా ప్రియమైన వారికి హగ్ ఇవ్వండి. ప్రేమికుల రోజు మాత్రమే కాదు, ప్రతి రోజూ ఓసారి కౌగిలించుకోండి. ప్రేమను బలోపేతం చేసుకోవడంతో పాటు ఆరోగ్యంగా ఉండండి.
Read Also: ఒక్కో రంగు గులాబీ వెనుక ఒక్కో అర్థం, వాలంటైన్స్ డే వీక్ లో ఏ గులాబీ ఎవరికి ఇవ్వాలంటే?