Liver Hot Beverage| ఉదయం ఒక కప్పు బ్లాక్ కాఫీతో రోజు ప్రారంభించడం చాలా మందికి అలవాటు. కొందరికి కాఫీ లేకుండా రోజు మొదలు కాదు! బ్లాక్ కాఫీ అనేది రుచికరమైన పానీయం మాత్రమే కాదు, ఆరోగ్యానికి ఎంతో మేలు కూడా చేస్తుంది. ఈ హాట్ డ్రింక్ ఎనర్జీ ఇవ్వడమే కాకుండా, ముఖ్యంగా మీ కాలేయం (లివర్) ఆరోగ్యాన్ని కాపాడుతుంది. బ్లాక్ కాఫీలో పాలు, చక్కెర, క్రీమ్ లేదా ఇతర పదార్థాలు ఏవీ ఉండవు. దీని రుచి గాఢంగా ఉంటుంది. ఇది లివర్‌కు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. బ్లాక్ కాఫీ ఎలా సహాయపడుతుంది. రోజుకు ఎంత తాగాలి అని తెలుసుకుందాం.
లివర్ పనితీరును మెరుగుపరుస్తుంది
బ్లాక్ కాఫీ కాలేయంలోని ఎంజైమ్‌ల స్థాయిలను పెంచుతుంది. ఈ ఎంజైమ్‌లు రక్తంలోని విష పదార్థాలను తొలగించడంలో సహాయపడతాయి. అధ్యయనాల ప్రకారం.. కాఫీ తాగే వారిలో ALT (అలనైన్ అమినోట్రాన్స్‌ఫెరేస్) వంటి ఎంజైమ్‌లు ఆరోగ్యకరమైన స్థాయిలో ఉంటాయి. ఇవి లివర్ సరిగ్గా పనిచేయడానికి అవసరం.
లివర్ సిర్రోసిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది
క్రమం తప్పకుండా బ్లాక్ కాఫీ తాగడం వల్ల సిర్రోసిస్ తగ్గుతుంది. సిర్రోసిస్ అంటే లివర్ టిష్యూ డ్యామేజ్ కావడం. ముఖ్యంగా మద్యం తాగడం కారణంగా వచ్చే సిర్రోసిస్ ప్రమాదాన్ని బ్లాక్ కాఫీ 65-80% తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కాఫీలోని పదార్థాలు లివర్‌ని రక్షిస్తాయి.
లివర్ డ్యామేజ్‌ని తగ్గిస్తుంది
కాఫీలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ కాంపౌండ్స్ ఉంటాయి. ఇవి కాలేయంలో వాపును, గాయాలను తగ్గిస్తాయి. మద్యం, విష పదార్థాలు లేదా కొవ్వు పేరుకుపోవడం వల్ల లివర్ (కాలేయ) కణాలకు జరిగే నష్టాన్ని ఇవి నివారిస్తాయి.
లివర్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది
కాఫీ తాగేవారిలో లివర్ క్యాన్సర్ (హెపాటోసెల్యులార్ కార్సినోమా) వచ్చే అవకాశం 40 శాతం తక్కువగా ఉంటుంది. కాఫీలోని కాంపౌండ్స్ కాలేయాన్ని శుద్ధి చేస్తాయి, కణాలను రిపేర్ చేస్తాయి.
నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD) నివారిస్తుంది
బ్లాక్ కాఫీ కాలేయంలో కొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది. ఇది కొవ్వు జీవక్రియను పెంచుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ను తగ్గిస్తుంది. ఇవి NAFLDని నివారించడంలో, నిర్వహించడంలో సహాయపడతాయి.
Also Read: డిప్రెషన్, మానసిక ఒత్తిడిని దూరం చేయండిలా.. కార్టిసోల్ హార్మోన్‌ని తగ్గించే అలవాట్లు ఇవే..
రోజుకు ఎంత కాఫీ తాగాలి?
కాలేయ ఆరోగ్యం కోసం రోజుకు 2 నుండి 4 కప్పుల బ్లాక్ కాఫీ తాగడం మంచిదని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ మోతాదు ప్రయోజనకరంగా ఉంటుంది, సురక్షితం కూడా. అయితే, 4-5 కప్పుల కంటే ఎక్కువ తాగితే, కొందరిలో ఆందోళన, నిద్రలేమి వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి, మితంగా తాగడం మంచిది.
బ్లాక్ కాఫీ మీ లివర్‌ని ఆరోగ్యంగా ఉంచడానికి ఒక సులభమైన, రుచికరమైన మార్గం. రోజూ సరైన మోతాదులో తాగండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి!