Breakfasts: మనం తినే బ్రేక్ ఫాస్ట్ .. రోజు మొత్తంలో మన శక్తి స్థాయిలను అంతే కాకుండా మానసిక స్థితిని ముఖ్యంగా జీర్ణ వ్యవస్థను ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. గట్ హెల్త్ సరిగ్గా ఉంటేనే ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. గ్యాస్, అజీర్తి , మలబద్దకం వంటి సమస్యలు లేకుండా ఉండాలంటే ఫైబర్, ప్రోబయోటిక్స్, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉండే ఆహారాన్ని ఎంచుకోవాలి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
జీర్ణక్రియను మెరుగు పరిచే, గట్‌ను ఆరోగ్యంగా ఉంచే 10 అద్భుతమైన బ్రేక్ ఫాస్ట్‌లు:
1. పెరుగు, బెర్రీలు, చియా సీడ్స్ :
పెరుగులో (ముఖ్యంగా గ్రీక్ యోగర్ట్) జీర్ణక్రియకు సహాయపడే ‘ప్రోబయోటిక్స్’ అధికంగా ఉంటాయి. బెర్రీలు (స్ట్రాబెర్రీలు, రాస్ప్‌బెర్రీలు), చియా గింజల్లోని ఫైబర్ గట్ బ్యాక్టీరియాకు ఆహారం (ప్రీబయోటిక్స్) లాగా పనిచేసి జీర్ణవ్యవస్థను సమతుల్యం చేస్తుంది. వీటిని బ్రేక్ ఫాస్ట్ సమయంలో తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
2. ఓట్‌మీల్, ఫ్లాక్ సీడ్స్, అరటిపండు:
ఓట్స్‌లో ‘సాల్యుబుల్ ఫైబర్’ (నీటిలో కరిగే పీచు పదార్థం) పుష్కలంగా ఉంటుంది. ఇది పేగు కదలికలను మెరుగు పరుస్తుంది. అరటిపండు (కొద్దిగా పచ్చిగా ఉన్నది), ఫ్లాక్ సీడ్స్, ప్రీబయోటిక్‌లను అందించి గట్ ఆరోగ్యానికి తోడ్పడతాయి. వీటిని ఉదయం పూట తినడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.
3. ఇడ్లీ, సాంబార్, కొబ్బరి పచ్చడి:
ఇడ్లీ పిండిని పులియబెట్టడం వల్ల ఇందులో సహజంగా ప్రోబయోటిక్స్ ఏర్పడతాయి. సాంబార్‌లోని పప్పులు, కూరగాయలు ఫైబర్, ప్లాంట్ ప్రోటీన్‌ను అందిస్తాయి. ఇది చాలా తేలికగా జీర్ణం అవుతుంది.
4.వెజిటెబుల్ ఆమ్లెట్:
గుడ్లలో ఉండే లీన్ ప్రోటీన్ ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతుంది. ఉల్లిపాయలు, పాలకూర, టమాటోలు వంటి కూరగాయలను కలపడం ద్వారా ఫైబర్, విటమిన్లు అందుతాయి, ఇవి జీర్ణశక్తిని పెంచుతాయి. దీన్ని హోల్‌గ్రెయిన్ టోస్ట్‌తో తీసుకుంటే ఇంకా మంచిది.
5. అల్లం, పుదీనాతో నిమ్మరసం:
ఉదయం లేవగానే తాగడానికి ఇది ఉత్తమమైనది. నిమ్మరసం జీర్ణ ఎంజైమ్‌లను ప్రేరేపిస్తుంది. అల్లం, పుదీనా జీర్ణవ్యవస్థ కండరాలను సడలించి, గ్యాస్, ఉబ్బరం సమస్యలను తగ్గిస్తాయి.
6. అవకాడో హోల్‌గ్రెయిన్ టోస్ట్ :
అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ అధికంగా ఉంటాయి. హోల్‌గ్రెయిన్ బ్రెడ్ కాంప్లెక్స్ కార్బో హైడ్రేట్‌లను అందించి.. పేగులోని సూక్ష్మజీవుల సమతుల్యతకు సహాయ పడుతుంది.
Also Read: పండగ సమయంలో నోటిని అదుపు చేసుకోలేకపోతున్నారా ? ఇలా చేయకుంటే సమస్యలు తప్పవు
7. పోహా :
పోహా త్వరగా జీర్ణమయ్యే బ్రేక్ ఫాస్ట్. ఇందులో ఫైబర్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. దీనికి కొద్దిగా పల్లీలు లేదా బీన్స్ వంటివి కలిపితే ప్లాంట్ ప్రోటీన్ కూడా లభిస్తుంది.
8. పసుపుతో చేసిన ‘టెంపే’:
టోఫు లేదా టెంపేలో ప్రోటీన్‌కు పుష్కలంగా ఉంటుంది. పసుపు, మిరియాలు వాడి తయారు చేసిన టోఫు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలతో జీర్ణక్రియలో మంటను తగ్గిస్తాయి.
9. పచ్చి బొప్పాయిలేదా పండిన బొప్పాయి:
బొప్పాయిలో ‘పపైన్’ అనే ఎంజైమ్ ఉంటుంది, ఇది ప్రోటీన్‌లను విచ్ఛిన్నం చేసి, జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. బ్రేక్ ఫాస్ట్ సమయంలో బొప్పాయి సలాడ్‌గా తీసుకోవడం చాలా మంచిది.
10. చియా పుడ్డింగ్ :
చియా సీడ్స్‌ను పాలతో రాత్రంతా నానబెట్టడం ద్వారా అవి జెల్ లాగా మారతాయి. ఇందులో ఉండే ఫైబర్ మలాన్ని మృదువుగా చేసి, పేగు కదలికలను మెరుగు పరుస్తుంది. అంతే కాకుండా ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది.