OTT Movie : ఈరోజు మన మూవీ సజెషన్ అ అవార్డు విన్నింగ్ షార్ట్ ఫిల్మ్. ఇందులో ఓ దెయ్యం డోర్ వెనక ఉండి, దాగుడు మూతలు ఆడడమే కాదు ఏకంగా ఓ అబ్బాయిని ఆత్మహత్య చేసుకునేలా చేస్తుంది. మరి ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ తో తెరకెక్కిన ఈ హర్రర్ మూవీని ఎక్కడ చూడవచ్చు? స్టోరీ ఏంటి? అనే విషయాపై ఓ లుక్కేద్దాం పదండి.
ఫ్రీగానే చూడవచ్చు
ఈ హారర్ షార్ట్ ఫిల్మ్ పేరు ‘Night Whispers’. 2024 లో వచ్చిన ఈ సినిమాకి ఇ హన్ట్ దర్శకత్వం వహించారు. ఇది Screamfest లాస్ ఏంజిల్స్ కౌంటీ ప్రీమియర్‌గా 2024, అక్టోబర్ 13 విడుదలైంది. ఈ చిత్రంలో ఇ హన్ట్ ప్రధాన పాత్రలో నటించడమే కాకుండా, దీనికి కథ అందించి నిర్మించాడు. ఇది ఒక సైకలాజికల్ హారర్ ఫిల్మ్. ఇందులో ఒక టీనేజర్ ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు, ఒక దుష్ట శక్తి అతన్ని ఏం చేసింది అనేది స్టోరీ లైన్. ఇక ఈ మూవీ YouTubeలో ఫ్రీగానే అందుబాటులో ఉంది. ఇది ఒక షార్ట్ ఫిల్, USC స్టూడెంట్ ప్రాజెక్ట్ కావడం వల్ల, ప్రధానంగా ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో లేదా USC ఈవెంట్‌లలో ప్రదర్శించబడుతోంది.
స్టోరీలోకి వెళ్తే…
ఒక టీనేజ్ అబ్బాయి రాత్రి సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉంటాడు. ఆ ఇల్లు ఒక సాధారణంగానే చీకటిగా, నిశ్శబ్దంగా ఉంటుంది. ఈ వాతావరణం చూడటానికి భయంకరంగా ఉంటుంది. ఈ సమయంలో, ఆ అబ్బాయి తన రొటీన్ పనుల్లో బిజీగా ఉంటాడు. అయితే హఠాత్తుగా ఒక భయంకరమైన శబ్దం అతన్ని ఆందోళనకు గురి చేస్తుంది. ఈ శబ్దం, ఒక దుష్ట శక్తి వల్ల వచ్చినట్లు అతనికి అనిపిస్తుంది.ఇది అతన్ని మరింత భయపెడుతుంది.
ఆ పిల్లాడు ఇంట్లో ఆ సౌండ్స్ ను అనుసరించి తిరుగుతూ ఉంటాడు. అయితే స్పష్టంగా అక్కడ ఏమీ కనిపించదు. కానీ లైట్లు ఆన్-ఆఫ్ అవడం, డోర్లు రహస్యంగా తెరుచుకోవడం, వస్తువులు తమంతట తాము కదలడం వంటివి జరుగుతుంటాయి. ఈ దుష్ట శక్తి అతని మనసుతో ఆడుకుంటుంది. అతన్ని భయాందోళనలోకి నెట్టివేస్తుంది. ఈ పిల్లాడు ఈ శబ్దాలు తన ఊహలా, నిజమైనవా అని అనుమానిస్తాడు. కానీ వాటి తీవ్రత పెరుగుతూ ఉంటుంది. ఈ శక్తి అతన్ని చంపడానికి ప్రయత్నిస్తుందని అర్థమవుతుంది. ఈ దుష్ట శక్తి అతన్ని ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపిస్తుంది. ఈ ప్రభావం నుండి తప్పించుకోవడానికి, ఆ పిల్లాడు ఇంటి గార్డెన్ కాటేజ్‌కి పరిగెత్తుతాడు. కానీ ఈ శక్తి అతన్ని వెంటాడుతూనే ఉంటుంది.
Read Also : స్కూల్ ను ఎగ్గొట్టి బాయ్ ఫ్రెండ్ తో జలకాలాటలు… గుండెలదిరే ట్విస్ట్ ఇచ్చే సైకో
ఈ శక్తి అతన్ని ఆత్మహత్యకు ప్రేరేపించడంలో దాదాపు సక్సెస్ అవుతుంది. కానీ చివరి క్షణంలో తనని తాను చంపుకోకుండా ఆ పిల్లాడు తప్పించుకుంటాడు. ఆ తరువాత స్టోరీ భయంకరమైన సన్నివేశాలతో ఇంట్రెస్టింగ్ టర్న్ తీసుకుంటుంది. చివరికి ఆ దెయ్యం పిల్లాడిని చంపుతుందా ? ఆ పిల్లాడు దెయ్యాన్ని ఎలా ఎదుర్కొన్నాడు ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.