Blackheads: చర్మంపై ఉండే బ్లాక్‌హెడ్స్ చాలా మందిని ఇబ్బంది పెట్టే సాధారణ సమస్య. ఇవి నల్లగా, చిన్న చిన్న చుక్కల్లా కనిపిస్తాయి. చర్మ రంధ్రాలలో పేరుకుపోయిన నూనె, మృతకణాలు, బ్యాక్టీరియా గాలికి తగలడం వల్ల ఆక్సీకరణం చెంది నల్లగా మారతాయి. ముక్కు, గడ్డం, , నుదిటిపై ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. అయితే.. సరైన చర్మ సంరక్షణ పద్ధతులు పాటించడం ద్వారా వీటిని సమర్థవంతంగా తొలగించవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోండి:
రోజూ రెండు సార్లు.. ఉదయం, రాత్రి, మీ చర్మం రకానికి సరిపోయే క్లెన్సర్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం. దీనివల్ల చర్మంపై పేరుకుపోయిన అదనపు నూనె మురికి తొలగిపోతాయి. బ్లాక్‌హెడ్స్‌కి చికిత్స చేయడానికి సాలిసిలిక్ యాసిడ్ లేదా బెంజోయిల్ పెరాక్సైడ్ ఉన్న క్లెన్సర్‌ని ఉపయోగించడం మంచిది. ఇవి చర్మ రంధ్రాలను శుభ్రం చేయడంలో సహాయపడతాయి.
2. ఎక్స్‌ఫోలియేషన్ చేయండి:
ఎక్స్ ఫోలియేషన్ అనేది మృత కణాలను తొలగించే ప్రక్రియ. వారానికి ఒకటి లేదా రెండు సార్లు స్క్రబ్ చేయడం వల్ల బ్లాక్‌హెడ్స్ రాకుండా నివారించవచ్చు. సాలిసిలిక్ యాసిడ్ (BHA) లేదా గ్లైకోలిక్ యాసిడ్ (AHA) వంటి కెమికల్ ఎక్స్ ఫోలియెంట్స్ ఉపయోగించడం వల్ల చర్మ రంధ్రాలు లోపల నుంచి శుభ్రమవుతాయి. మరీ గరుకుగా ఉండే స్క్రబ్‌లు వాడకుండా జాగ్రత్తపడాలి. ఎందుకంటే అవి చర్మాన్ని దెబ్బతీస్తాయి.
3. ఫేస్ మాస్కులు వాడండి:
బ్లాక్‌హెడ్స్ తొలగించడంలో ఫేస్ మాస్కులు చాలా ప్రభావ వంతంగా పనిచేస్తాయి.
బంకమట్టి మాస్కులు : ఇవి చర్మం నుంచి అదనపు నూనె, మురికిని పీల్చుకుంటాయి.
కరి బొగ్గు మాస్కులు: కార్బన్ బ్లాక్ మాస్కులు చర్మ రంధ్రాలలో ఉన్న మురికిని బయటకు లాగి శుభ్రం చేస్తాయి.
4. బ్లాక్‌హెడ్ ప్యాచ్‌లను వాడండి:
మార్కెట్లో లభించే బ్లాక్‌హెడ్ రిమూవల్ ప్యాచ్‌లు, ముఖ్యంగా ముక్కుపై ఉండే బ్లా క్‌హెడ్స్‌ని తొలగించడానికి బాగా ఉపయోగపడతాయి. వీటిని వాడే ముందు ముఖాన్ని శుభ్రం చేసి.. ఆపై ప్యాచ్‌ను తడి ప్రదేశంలో అంటించాలి. ఇది ఆరిన తర్వాత నెమ్మదిగా తీసివేయాలి. ఈ పద్ధతి తాత్కాలిక ఉపశమనాన్ని ఇస్తుంది.
5. రెటినాయిడ్స్ వాడండి:
విటమిన్ ఎ నుంచి తయారైన రెటినాయిడ్ క్రీమ్‌లు బ్లాక్‌హెడ్స్ చికిత్సలో చాలా ప్రభావ వంతంగా పనిచేస్తాయి. ఇవి కణాల పునరుత్పత్తిని వేగవంతం చేసి, చర్మ రంధ్రాలు మూసుకుపోకుండా నివారిస్తాయి. వీటిని రాత్రిపూట ఉపయోగించడం మంచిది. ఎందుకంటే అవి సూర్యరశ్మికి సున్నితత్వాన్ని పెంచుతాయి.
Also Read: ఫేస్ సీరం వాడటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో తెలుసా ?
6. కొన్ని జాగ్రత్తలు:
బ్లాక్‌హెడ్స్‌ను చేతితో నొక్కడం లేదా పిండడం మానుకోండి. దీనివల్ల చర్మానికి ఇన్ఫెక్షన్లు, మచ్చలు ఏర్పడే ప్రమాదం ఉంది.
మేకప్ వేసుకున్న తర్వాత రాత్రి పడుకునే ముందు తప్పని సరిగా తొలగించండి.
చర్మాన్ని ఎల్లప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంచుకోండి.
చర్మ సంరక్షణలో క్రమం తప్పకుండా ఈ పద్ధతులను పాటించడం వల్ల బ్లాక్ హెడ్స్‌ను సమర్థ వంతంగా నివారించవచ్చు. సమస్య తీవ్రంగా ఉంటే, చర్మ వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.