Calcium Deficiency in Kids: ఎదుగుతున్న వయసులో పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని రకాల పోషకాలు అవసరం. ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ వంటివి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా అన్ని రకాల పోషకాలను అందించడంలో సహాయపడతాయి. అయితే వీటిలో ఏ ఒక్కటి లోపించినా అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ ఉందని డాక్టర్లు చెబుతున్నారు.
వీటిలో ముఖ్యంగా కాల్షియం లోపిస్తే ఎముకలు, దంతాలకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అసలు కాల్షియం వల్ల కలిగే లాభాలు ఏంటి? చిన్నారుల్లో కాల్షియం లోపిస్తే ఏం జరుగుతుంది? ఎలాంటి ఆహారాల్లో ఇది ఎక్కువగా లభిస్తుంది? అనేది తెలుసుకుందాం..
కాల్షియం బెనిఫిట్స్:
కాల్షియం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందట. ఇది ఎముకలను పటిష్టంగా ఉంచడంలో సహాయపడుతుంది, దాంతో ఎముకలు బలంగా,ఆరోగ్యంగా ఉంటాయని అంటున్నారు. చిన్నారుల్లో బోన్ స్ట్రెంత్‌ని పెంచేందుకు కూడా ఇది సహాయపడుతుందట.
బీపీ:
హైపర్ టెన్షన్ సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు కాల్షియం అధికంగా ఉండే ఆహారం తీసుకుంటే రక్తపోటు అదుపులో ఉంటుందట.
కండరాలు:
కండరాలను బలంగా ఉంచేందుకు కూడా కాల్షియం సహాయపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా నరాల బలహీనతను కూడా దూరం చేస్తుందట.
చిన్నారుల్లో కాల్షియం లోపిస్తే:
చిన్నారుల్లో కాల్షియం లోపించడం వల్ల ఆరోగ్యానికి హాని జరిగే ప్రమాదం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. చిన్నారుల్లో కాల్షియం లోపం కారణగా ఎముకలు బలహీనంగా మారుతాయట. మరి కొందరిలో రికెట్స్ వచ్చే అవకాశం ఉందట దీని వల్ల ఎముకలు వక్రంగా మారిపోయే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు.
కాల్షియం లోపం వల్ల పిల్లల శారీరక, మానసిక అభివృద్ధి మందగిస్తుందని వైద్యులు వెల్లడిస్తున్నారు. చిన్న పిల్లల్లో కాల్షియం లోపించడం వల్ల హైపోకాల్సెమియా, కీళ్ల నోప్పులు, జువైనల్ ఆర్థరైటిస్ వచ్చే ఛాన్స్ ఉందట.
కాల్షియం రిచ్ ఫుడ్:
కాల్షియం అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల ఎముకలు, దంతాలు బలంగా మారుతాయని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. అందుకే తీసుకునే ఆహారంలో కాల్షియం తప్పకుండా ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. పాల, పెరుగు, కరక్కాయ, చిక్కుడుకాయ వంటి వాటిలో కాల్షియం అధికంగా ఉంటుందట. వీటిని ప్రతి రోజూ తీసుకునే ఆహారంలో చేర్చుకోవడం ఉత్తమం.
వీటితో పాటు కాల్షియం అధికంగా ఉండే మొక్కజొన్న, పొటాటో, బేబి స్పినాచ్, చింతపండు, టోఫు, బాదం వంటి వాటిని డైట్‌లో చేర్చుకోవాలి. అరటి పండ్లు, మామిడి పండ్లను అధికంగా తీసుకోవడం వల్ల కూడా శరీరంలో కాల్షియం పెరుగుతుందట.