Buttermilk Benefits: మన అమ్మమ్మల కాలం నుండి మజ్జిగ ఆరోగ్యానికి ఒక వరంలా పరిగణించబడుతోంది. వేసవి కాలంలో ఔషధ గుణాలతో నిండిన ఈ పానీయాన్ని తాగడం వల్ల కలిగే కొన్ని అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
వేసవిలో ఎండ వేడిమి నుంచి తప్పించుకునేందుకు ప్రజలు ఐస్ క్రీమ్‌లు, శీతల పానీయాలు తీసుకుంటారు. కానీ వీటి వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. గొంతులో మంటగా మరియు తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి. ఎండ వేడిమి తట్టుకోవడానికి మజ్జిగా అత్యంత ప్రయోజనకరంగా పనిచేస్తుంది. దీనిని తాగడం వల్ల శరీరం చల్లబడుతుంది. పొట్ట ఆరోగ్యానికి కూడా చాలా మంచిదంటున్నారు.
పేగు ఆరోగ్యానికి ప్రయోజనకరం
మజ్జిగలో లభించే ప్రోబోయటిక్స్ మరియు అనేక పోషకాలు మీ పేగు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. కడుపు సంబంధిత సమస్యలను వదిలించుకోవడానికి మజ్జిగ తాగవచ్చని అంటున్నారు. ఇది కాకుండా, మజ్జిగలో విటమిన్లు, కాల్షియం మరియు ప్రోటీన్లతో సహా అనేక పోషకాలు లభిస్తాయి. శరీరానికి చల్లదనం లభిస్తుంది.
Also Read: Jewellery Cleaning: వెండి వస్తువులు నల్లగా మారాయా ? ఇలా చేస్తే.. తెల్లగా మెరిసిపోతాయ్
రోగనిరోధక శక్తిని పెంచుతుంది
రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల శరీరం బలహీనంగా ఉంటుంది. దీంతో తరచుగా అనారోగ్యానికి గురి అవుతుంటారు. రోగనిరోధక శక్తి తగ్గకుండా ఉండటానికి మజ్జిగా తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. దీనిలో కాల్షియం అధికంగా ఉండటం వల్ల మీ ఎముకల ఆరోగ్యానికి మరియు కండరాల ఆరోగ్యానికి బాగా పనిచేస్తుంది. వేసవిలో మజ్జిగ తాగడం వల్ల శరీరం వడదెబ్బ తగలకుండ ఉంటుందని వైద్యులు చెప్తున్నారు.
మీరు ఉత్సాహంగా ఉండగలుగుతారు
మజ్జిగలో లభించే పోషకాలు శరీరం డీహైడ్రేషన్ కాకుండా కాపాడుతుంది. రోజూ ఉదయం ఖాళీ కడుపుతో మజ్జిగ తాగడం వల్ల డయాబెటిస్, అజీర్ణం, గ్యాస్ వంటి కడుపు సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరచడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది శరీరంలోని పోషక లోపాలను తీర్చడంలో సహాయపడుతుంది. దీంతోపాటు, బ్యాక్టీరియా వల్ల జీర్ణవ్యవస్థ బలపడుతుంది. రోజూ ఉదయం ఖాళీ కడుపుతో మజ్జిగా తాగడం వల్ల కడుపు చల్లగా ఉంటుంది.