Infertility: వాలీబాల్ ఆడేవారికి తరచుగా కడుపులో నొప్పి వస్తుంది. దీని వల్ల వాలీబాల్ ఆటగాళ్లకు సంతానోత్పత్తి అవకాశాలు తక్కువగా ఉంటాయని చాలా మంది నమ్ముతారు. ఈ ఆటలో అధిక శారీరక శ్రమ, గాయాలు, ఒత్తిడి వంటివి సంతాన సామర్థ్యంపై ప్రభావం చూపుతాయని కొందరు అంటారు. ఈ రకమైన సమస్యలు ఉండటం గురించి వైద్యులు కొన్ని ముఖ్యమైన విషయాలు చెబుతున్నారు. వాలీబాల్ ఆడేవారికి నిజంగానే పిల్లలు పుట్టడం కష్టమా అనే దానికి డాక్టర్లు ఏం చెప్తున్నారంటే..
కొన్ని రకాల అంశాలు సంతాన సమస్యలు వచ్చేలా చేసే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
శారీరక ఒత్తిడి, హార్మోన్ల గందరగోళం వంటివి సంతాన సమస్యలు రావడానికి కారణం అయ్యే ఛాన్స్ ఉందని డాక్టర్లు చెబుతున్నారు. వాలీబాల్ ఆడటం అంటే గంటల తరబడి గెంతడం, బంతిని బలంగా కొట్టడం, చురుగ్గా కదలడం. ఇలాంటి తీవ్రమైన శారీరక శ్రమ వల్ల శరీరంపై చాలా ఒత్తిడి పడుతుంది. ఈ ఒత్తిడి ముఖ్యంగా మహిళా ఆటగాళ్లలో హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది. ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరోన్ వంటి హార్మోన్లు సరిగా పని చేయకపోతే, గర్భం దాల్చడం కష్టమవుతుంది. అధిక ఒత్తిడి వల్ల ఒవ్యులేషన్ సరిగా జరగకపోవచ్చని డాక్టర్లు చెబుతున్నారు, ఇది గర్భం రాకుండా అడ్డుపడుతుందట.
శక్తి కొరత
వాలీబాల్ ఆటకు చాలా శక్తి కావాలి. ఆటగాళ్లు రోజూ గంటల తరబడి శిక్షణ తీసుకుంటారు, మ్యాచ్‌లు ఆడతారు. ఇలా చేస్తే శరీరంలో కేలరీలు విపరీతంగా ఖర్చవుతాయి. ఒకవేళ ఆహారంలో తగినంత పోషకాలు, కేలరీలు తీసుకోకపోతే, శరీరంలో శక్తి తగ్గిపోతుందట. గర్భం దాల్చడానికి శరీరానికి ఎక్కువ శక్తి, పోషకాలు కావాలి. శక్తి లేకపోతే, శరీరం గర్భధారణకు సిద్ధంగా ఉండదు, దీంతో సంతాన సామర్థ్యం తగ్గుతుందని కొందరు చెబుతారు.
గాయాలు
వాలీబాల్ ఆడేటప్పుడు గాయాలు కావడం సర్వసాధారణం. మోకాళ్లు, చీలమండలు, నడుము, భుజాలు తరచూ గాయాలకు గురవుతాయి. ముఖ్యంగా నడుము భాగంలో గాయం అయితే, గర్భధారణ సామర్థ్యంపై ప్రభావం పడొచ్చట. నడుము గాయం వల్ల గర్భాశయానికి రక్త సరఫరాలో సమస్యలు రావచ్చు, ఇది గర్భస్థ శిశువు పెరుగుదలకు ఆటంకం కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. తీవ్రమైన గాయాలు శరీరం పూర్తిగా కోలుకోకుండా చేస్తే, సంతాన సమస్యలు దీర్ఘకాలంగా ఉండొచ్చని అంటున్నారు.
ఒత్తిడి
వాలీబాల్ ఆటగాళ్ల జీవనశైలి చాలా హడావిడిగా ఉంటుంది. రోజూ శిక్షణ, పోటీలు, ప్రయాణాలతో సమయం సరిపోదు. ఇలాంటి జీవనశైలి వల్ల నిద్ర, విశ్రాంతి సరిగా దొరకవు. దీంతో కార్టిసాల్ వంటి స్ట్రెస్ హార్మోన్లు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి, ఇవి సంతానోత్పత్తికి కావాల్సిన హార్మోన్లను అడ్డుకుంటాయి. అంతేకాదు, వృత్తిపరమైన ఒత్తిడి వల్ల కుటుంబ జీవనానికి సమయం కేటాయించలేక, సంతాన ప్రణాళికను వాయిదా వేయడం కూడా జరుగుతుందట.
డాక్టర్ల సలహాలు
ఈ సమస్యలను సమర్థంగా ఎదుర్కోవడానికి వైద్యులు కొన్ని సలహాలు ఇస్తున్నారు. ఆహారంలో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు సమతుల్యంగా తీసుకోవాలి. ఇది హార్మోన్ల సమతుల్యతను సరిచేస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. ఆటల తర్వాత శరీరానికి విశ్రాంతి ఇవ్వాలి. మంచి నిద్ర కూడా హార్మోన్లను నియంత్రిస్తుందట. సంతాన సమస్యలు ఎదురైతే, డాక్టర్‌ని సంప్రదించి హార్మోన్ పరీక్షలు, ఇతర టెస్టులు చేయించుకోవాలి.