Standing all day: అటు ఇటు కదులుతూ, నడుస్తూ, కొన్ని సార్లు కూర్చొని చేసే పనులు చాలానే ఉంటాయి. కానీ, కొన్ని రకాల వృత్తులలో ఉండే వారు అనేక రకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నిలబడి ఉండడం వల్ల శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ మార్పులు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చట.
నిలబడితే జరిగేది ఇదే
నిలబడి ఉండటం వల్ల కాళ్లలో రక్తప్రసరణ తగ్గుతుందని డాక్టర్లు చెబుతున్నారు. దీని కారణంగా కాళ్లలో వాపు, నొప్పులు, వేరికోస్ వేన్‌లు వంటి సమస్యలు ఏర్పడతాయట. రక్తప్రసరణ తగ్గడం వల్ల శరీరంలోని కణజాలాలకు ఆక్సిజన్, పోషకాలు సమర్థవంతంగా చేరకపోవచ్చు, ఇది కండరాల అలసటకు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
రోజంతా కదలకుండా నిలబడి ఉండటం వల్ల కీళ్లపై ఒత్తిడి పెరుగుతుందట. కీళ్లలో మ్యూకస్ తగ్గిపోతుంది, కీళ్లలో నొప్పులు, వాపులు ఏర్పడతాయి. దీని కారణంగా కీళ్ల కండరాలు బలహీనపడతాయి, నొప్పులు పెరుగుతాయని డాక్టర్లు చెబుతున్నారు.
వెన్నెముక నొప్పులు
నిలబడి ఉండటం వల్ల వెన్నెముకపై ఒత్తిడి పెరుగుతుందట. దీని వల్ల వెన్నెముకలో నొప్పులు, కండరాల అలసట, వాపులు ఏర్పడతాయి. వెన్నెముక సమస్యలు పెరుగుతాయి. చాలా మందిలో ఇది తీవ్రమైన నడుపు నొప్పికి కూడా దారి తీసే ఛాన్స్ ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
కదలకుండా నిలబడి ఉండటం వల్ల శరీరంలో శక్తి తగ్గుతుందట. అంతేకాకుండా కండరాలు అలసిపోతాయి, శక్తి తగ్గుతుంది. దీని వల్ల అలసట, నిద్రలేమి వంటి సమస్యలు ఏర్పడతాయని నిపుణులు వెల్లడిస్తున్నారు.
నిలబడి ఉండటం వల్ల గుండెపై ఒత్తిడి పెరుగుతుందని డాక్టర్లు చెబుతున్నారు. రక్తపోటు పెరుగుతుంది, గుండె సంబంధిత సమస్యలు ఏర్పడతాయట. గుండె ఆరోగ్యం ప్రభావితం అవుతుందని డాక్టర్లు చెబుతున్నారు.
నిలబడి ఉండటం వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుందని డాక్టర్లు చెబుతున్నారు. అలసట, ఒత్తిడి, మానసిక సమస్యలు ఏర్పడతాయి. మానసిక ఆరోగ్యం ప్రభావితం అవుతుందని అంటున్నారు.
పరిష్కారాలు
రోజంతా నిలబడే ఉండడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయట పడే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. రోజుకు కొంత సమయం నడవడం వల్ల ఆరోగ్యానికి మంచిదని అంటున్నారు. నడక వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది, కీళ్ల నొప్పులు తగ్గుతాయి, వెన్నెముకకు కొంత సపోర్ట్ లభిస్తుందట.
పాల, పండ్లు, కూరగాయలు వంటి పోషకాహారాలను తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. దీని వల్ల కాళ్లు, కీళ్ల నొప్పుల సమస్యలు దూరం అయ్యే అవకాశం ఉందట. రోజంతా నిలబడే ఉడడం వల్ల ఆరోగ్యంపై విపరీతమైన చెడు ప్రభావం పడితే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.