BigTV English

District Collector: జిల్లా కలెక్టర్‌కు వచ్చే జీతం ఎంత? సదుపాయలేంటీ? ఈ జాబ్‌కు ఎలా ప్రిపేర్ కావాలి?

District Collector: జిల్లా కలెక్టర్‌కు వచ్చే జీతం ఎంత? సదుపాయలేంటీ? ఈ జాబ్‌కు ఎలా ప్రిపేర్ కావాలి?

District Collector: దేశంలో అత్యున్నత ఉద్యోగం ఏది అంటే చదువుకున్న ప్రతి ఒక్కరూ ఈజీగా కలెక్టర్ (Collector) అనే చెప్పేస్తారు. కలెక్టర్ పోస్ట్ దేశంలోనే అత్యున్నత పోస్ట్. జిల్లాలో అతి ముఖ్యమైన ప్రభుత్వ అధికారి కలెక్టర్. జిల్లాలో శాంతిభద్రతలు, ప్రభుత్వ పథకాలు, జిల్లాకు సంబంధించి అభివృద్ది పనులు.. ఇలాంటి ముఖ్యమైన నిర్ణయాలన్నీ కలెక్టర్ ఆధీనంలోనే ఉంటాయి.


చాలా మంది విద్యార్థులు స్కూల్ దశలో నుంచే కలెక్టర్ కావాలని గోల్ పెట్టుకుంటారు. కలెక్టర్ చదువు కోసం ఏళ్ల తరబడి మరీ చదువుతుంటారు. అయితే పక్కా ప్రణాళిక ప్రకారం చదివితే కలెక్టర్ జాబ్ సాధించవచ్చని విద్యా నిపుణులు చెబుతున్నారు.  అసలు ఎవరు కలెక్టర్ కావచ్చు..? ఎలా ప్రిపేర్ అవ్వాలి..? ఎలాంటి పుస్తకాలు చదవాలి..? కలెక్టర్ జాబ్ వస్తే ఎంత జీతం వస్తుంది..? అనేది మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం.

ALSO READ: DMHO: గుడ్ న్యూస్.. టెన్త్ క్లాస్‌తో ఆ జిల్లాలో ఉద్యోగాలు.. మంచి వేతనం. వారం రోజులే గడవు


కలెక్టర్‌ జాబ్‌కి కావాల్సిన అర్హతలు:

మీరు కలెక్టర్ సాధించాలంటే ఐఏఎస్ (IAS-  ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్) అధికారి అవ్వాలి. దాని కోసం మీరు మీరు ప్రతి ఏడాదికి ఒకసారి జరగే యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్, ఇంటర్వ్యూ పాస్ కావాలి.

విద్యార్హత:

మీరు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో సబ్జెక్టులో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. (BA, BSc, BCom, BTech, బీఫార్మసీ మొదలైనవి ఏదో ఒక్కటి పాసై ఉంటే సరిపోతుంది.)

వయోపరిమితి: జనరల్ అభ్యర్థులు 21 నుంచి 32 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. భారతీయ పౌరులు మాత్రమే ఈ పరీక్షలకు అర్హులు అవుతారు.

కలెక్టర్ కావాలంటే..?

ముందుగా మీరు ఏదైనా యూనివర్సిటీ నుంచి డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పాస్ అవ్వాలి. ఆ తర్వాత ప్రతి ఏడాది విడుదలయ్యే UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షకు దరఖాస్తు చేసుకోండి.  పరీక్షకు సంబంధించి మొత్తం మూడు దశలు ఉంటాయి.

ప్రిలిమ్స్: అబ్జెక్టివ్ టెస్ట్ (జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్)

మెయిన్స్: రాత పరీక్ష (ప్రశ్రలకు వ్యాసాలు రాయాల్సి ఉంటుంది)

ఇంటర్వ్యూ – ముఖాముఖి పరీక్ష ఉంటుంది.

మెయిన్స్, ఇంటర్వ్యూలో మీరు మంచిగా రాణిస్తే.. ఉన్నత ర్యాంక్ పొందుతారు. అప్పుడు మీరు IAS అధికారిగా ఎంపిక చేయబడతారు. కొన్ని సంవత్సరాల పని, శిక్షణ తర్వాత, మీరు జిల్లా కలెక్టర్ గా ప్రమోషన్ వస్తుంది.

కలెక్టర్ జీతం వివరాలు..

దేశంలో కలెక్టర్ పోస్ట్ అత్యున్నతమైనది కాబట్టి మంచి వేతనం, అలాగే అనేక ప్రమోజనాలు లభిస్తాయి.

జీతం: ప్రారంభ వేతనం రూ.56,100 ఉంటుంది. అలవెన్సులు DA, HRA, మొదలైనవి కలుపుకుని  నెలకు రూ.70,000 నుండి రూ.1.2 లక్షలు జీతం ఉంటుంది.

ఇతర సదుపాయాలు..

☀ పెద్ద ప్రభుత్వ ఇల్లు (బంగ్లా)

☀ అఫీషియల్ కారు, డ్రైవర్

☀ సెక్యూరిటీ గార్డులు

☀ ఉచిత విద్యుత్, ఫోన్, నీరు వసతు ఉంటాయి

☀ కుటుంబానికి వైద్య సంరక్షణ

☀ సహాయం కోసం ప్రభుత్వ సిబ్బంది

కలెక్టర్ కావడం అనేది పెద్ద లక్ష్యం. కష్టపడి నిరంతరం చదివితే విజయం మిమ్మిల్ని తప్పకుండా వరిస్తుంది. మీరు అకాడమిక్ లో టాపర్‌గా ఉండనవసరం లేదు.  ప్లాన్ ప్రకారం.. ప్రతి రోజు ఒక ఏడాది పాటు చదివితే సివిల్స్ క్రాక్ చేయవచ్చు.

ALSO READ: Telangana Jobs: గుడ్ న్యూస్.. తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల కోసం 390 ఉద్యోగాలు.. ఇంకా వారం రోజులే..!

ALSO READ: AAI Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. డిగ్రీ అర్హతతో 309 ఉద్యోగాలు.. రూ.1,40,000 జీతం..

Related News

Paramedical Staff Jobs: రైల్వేలో పారామెడికల్ స్టాఫ్ ఉద్యోగాలు.. మంచి వేతనం, ఇంకా 5 రోజులే గడువు

IBPS RRB Recruitment: నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. 13,217 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. డిగ్రీ పాసైతే చాలు..

BEML LIMITED: టెన్త్, ఐటీఐతో భారీగా పోస్టులు.. అక్షరాల రూ.1,60,000 జీతం.. దరఖాస్తుకు మూడు రోజులే సమయం..!

JOBS: పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్‌లో భారీగా పోస్టులు.. భారీ వేతనం.. 2 రోజులే గడువు

FOREST BEAT OFFICER: అటవీశాఖలో భారీగా ఉద్యోగాలు.. ఇవ్వి చదివితే చాలు.. ఉద్యోగం మీ సొంతం!

Police Jobs: భారీగా పోలీస్ ఉద్యోగాలు.. టెన్త్ పాసైతే అప్లై చేసుకోవచ్చు.. పూర్తి వివరాలివే..!

Big Stories

×