Bald head: సాధారణంగా అయితే ఆడవారితో పోలిస్తే మగవారిలోనే ఎక్కువగా బట్టతల సమస్య వస్తుంది. మహిళల్లో ఎక్కువగా జుట్టు పల్చబడటం జరుగుతుంది, కానీ పూర్తిగా బట్టతల రావడం చాలా అరుదు. హార్మోన్లలో జరిగే మార్పులు, జన్యూ పరమైన కారణాల వల్ల ఇలా జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో హార్మోన్లు కీలక పాత్ర పోషిస్తాయి. పురుషులలో ఎక్కువ టెస్టోస్టెరాన్ ఉంటుంది. ఇది DHT (డైహైడ్రోటెస్టోస్టెరాన్) గా మారుతుంది. అయితే ఈ DHT జుట్టు కుదుళ్లను కుంచించుకుపోయేలా చేస్తుందట. అందుకే మగవారికే ఎక్కువగా బట్టతల వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఆడవారిలో ఈస్ట్రోజెన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. జుట్టు కుదుళ్లను రక్షించేందుకు ఇది హెల్ప్ చేస్తుందట. అంతేకాకుండా DHT ప్రభావాన్ని తగ్గిస్తుంది. అందుకే ఆడవారిలో జుట్టు కాస్త పల్చబడడం జరుగుతుంది. కానీ, పూర్తిగా హెయిర్ లాస్ అవ్వదు. అయితే మనోపాజ్ తర్వాత చాలా మంది మహిళల్లో విపరీతంగా జుట్టు ఊడిపోతుంది. ఈస్ట్రోజెన్ లెవెల్స్ తగ్గిపోవడం వల్లే అడవారిలో జుట్టు సన్నబడటం కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కానీ పూర్తిగా బట్టతల రావడం ఇప్పటికీ చాలా అరుదు.
ALSO READ: పుదీనా జ్యూస్ తాగితే ఎన్ని లాభాలో తెలుసా?
DHT ప్రభావాన్ని పురుషుల వెంట్రుకల కుదుళ్లు తట్టుకోలేవట. అందుకే జుట్టు అధికంగా ఊడిపోతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే మహిళల వెంట్రుకల కుదుళ్లు ఎక్కువ నిరోధకతను కలిగి ఉంటాయి. వీటిపై DHT ప్రభావం మరీ ఎక్కువగా ఉండకపోవచ్చట. కుటుంబంలో ఎవరికైనా బట్టతల ఉంటే పురుషులకు చిన్న వయస్సులోనే బట్టతల వచ్చే అవకాశం ఉందట. అయితే స్త్రీల విషయంలో మాత్రం సాధారణంగా జుట్టు పల్చబడటం మాత్రమే కనిసిస్తుంది. పూర్తి బట్టతల కాదు.
పురుషులతో పోలిస్తే మహిళల హెయిర్ గ్రోత్ సైకిల్ పెద్దగా ఉంటుందట. అంటే జుట్టు రాలిపోవడానికి, తిరిగి పెరగడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇది పురుషులతో పోలిస్తే వేగంగా జుట్టు రాలడాన్ని నిరోధించడంలో సహాయపడుతుంది.
కొందరు మహిళల్లో బట్టతలకు కారణం ఏంటి?
తక్కువలో తక్కువగా అయినా కందరు ఆడవారిలో బట్టతల సమస్య ఉంటుంది. వైద్య పరిభాషలో దీన్ని అలోపేసియా అరేటా అని పిలుస్తారట. ఇది జుట్టు రాలడానికి కారణమయ్యే ఆటో ఇమ్యూన్ వ్యాధి అని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.
PCOS వల్ల ఆడవారిలో విపరీతంగా జుట్టు రాలిపోతుంది. PCOS టెస్టోస్టెరాన్ లెవెల్స్‌పై చెడు ప్రభావం చూపినప్పుడు జుట్టు రాలిపోవడం జరుగుతుందట. కొన్ని సార్లు పోషకాహార లోపం వల్ల కూడా ఆడవారిలో హెయిర్ ఫాల్ సమస్యలు వస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. అందుకే తీసుకునే ఆహారంలో అన్ని రకాల పోషకాలు ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో కీమోథెరపీ వల్ల జుట్టు పూర్తిగా రాలే ఛాన్స్ ఉందట.