రాత్రిపూట నిద్రపోవడమే ఆరోగ్యకరం. కొంతమంది పగటి పూట కూడా నిద్రపోతూ ఉంటారు. ఏమీ తోచక నిద్రపోయే వారితో సమస్య లేదు. కానీ కొందరిలో పగటిపూట నిద్ర అధికంగా ఉంటుంది. వారు ఆపాలనుకున్న ఆపుకోలేరు. నిద్ర ముంచుకొచ్చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇలాంటిది ఆరోగ్యకరమైన లక్షణం కాదు. కొంతమంది ఉదయాన పనిచేస్తూనే నిద్రలోకి జారుకుంటూ ఉంటారు. పగటిపూట నిద్రపోవడం అనేది తీవ్రమైన వ్యాధులకు కారణం కావచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. వీలైనంతవరకు పగటిపూట నిద్రను ఎంతగా దూరం పెడితే అంత మంచిది. రాత్రిపూట తొమ్మిది గంటల నిద్రపోతే ఉదయాన్నే నిద్ర వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. రాత్రిపూట నిద్ర తగ్గినా కూడా ఉదయం పూట నిద్ర వచ్చేయవచ్చు .అలా కాకుండా రాత్రి పూర్తిగా నిద్రపోతున్న పగటి నిద్ర మీకు వస్తోందంటే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
జర్నల్ ఆఫ్ న్యూరాలజీలో పబ్లిష్ చేసిన రీసెర్చ్ ప్రకారం పగటిపూట నిద్ర అనేది డిమెన్షియా అనే వ్యాధికి లక్షణంగా తేలింది. డిమెన్షియా వ్యాధికి ప్రారంభ లక్షణంగా పగటి నిద్రను చెప్పుకోవచ్చు. కాబట్టి పగటిపూట నిద్ర ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. డిమెన్షియా వ్యాధి వచ్చిందంటే మెదడు సరిగా పనిచేయలేదు.
డిమెన్షియాను చిత్తవైకల్యం అంటారు. అంటే ఒక వ్యక్తి ఆలోచన సామర్థ్యం చాలా వరకు తగ్గిపోతుంది. విషయాలను నిర్ణయించుకోలేదు.ఏ అంశాన్ని గుర్తుంచుకోలేరు. నిర్ణయాలు కూడా సరిగా తీసుకోలేరు. మెదడు కణాలు దెబ్బతిని డిమెన్షియా వస్తుంది. కాబట్టి పగటిపూట నిద్ర ముంచుకొస్తూ ఉంటే డిమెన్షియా బారిన పడతారేమో జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే మీ మెదడు పనితీరును కూడా ఎప్పటికప్పుడు అంచనా వేసుకోవాలి. అవసరమైతే ముందుగానే వైద్యులను సంప్రదించాల్సిన అవసరం ఉంది.
పగటిపూట నిద్రకు, డిమెన్షియా కు మధ్య సంబంధం ఏంటనే సందేహం ఎంతో ఎక్కువ మందిలో రావచ్చు. పగటిపూట అధిక నిద్ర చేయడం వల్ల ఏ పని పట్ల ఆసక్తి ఉండదు. మెదడు చురుగ్గా పనిచేయదు. మొద్దుల్లాగా మారిపోతారు. చదివింది గుర్తుండదు. బరువు కూడా పెరిగిపోతారు. పొట్ట చుట్టూ కొవ్వు పెరిగిపోయే అవకాశం ఉంది. జ్ఞాపకశక్తిని కూడా త్వరగా కోల్పోతారు.
వ్యక్తిత్వంలో కూడా మార్పులు సహజంగా కనిపిస్తూ ఉంటాయి. రోజువారీ కార్యక్రమాలు కూడా మీకు చేసుకోవాలనిపించదు. ఇవన్నీ కూడా డిమెన్షియా లక్షణాలు. మీరు పగటిపూట నిద్రపోతూ ఇలాంటి లక్షణాలతో బాధపడుతూ ఉంటే వెంటనే వైద్యులను కలిసి తగిన చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉంది. రాత్రి సమయాల్లో నిద్ర పట్టకుండా అలసటగా అనిపిస్తున్నా లేక కాస్త డిప్రెషన్ గా అనిపిస్తున్నా వెంటనే వైద్యులను కలిసి తగిన చికిత్స తీసుకోండి.

Share