Beauty Tips: శీతాకాలంలో చర్మం తరచుగా పొడిగా , నిర్జీవంగా మారుతుంది. ఇలాంటి సమయంలో మీరు కోల్పోయిన మెరుపును తిరిగి తీసుకురావడంలో శనగపిండి సహాయపడుతుంది.
ఇది మీకు మృదువైన, మెరిసే చర్మాన్ని అందిస్తుంది. శనగ పిండితో మీ ముఖం యొక్క కోల్పోయిన మెరుపును కూడా తిరిగి పొందవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆల్కలీన్ గుణాలు శనగపిండిలో ఉంటాయి. ఇది చర్మానికి క్లెన్సర్‌గా పనిచేస్తుంది. అంతే కాకుండా ఇది చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తాయి. ఎక్స్‌ఫోలియేట్ చేస్తాయి. చర్మంపై ఉన్న దుమ్ము, ధూళి, ధూళిని తొలగించి ముఖానికి కోల్పోయిన గ్లోను తిరిగి ఇస్తాయి. కాబట్టి దీనిని తరుచుగా ముఖానికి వాడటం మంచిది. శనగపిండితో తయారు చేసి ఫేస్ ప్యాక్ లను ఎలా వాడాలనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పెరుగు, శనగపిండి ఫేస్ ప్యాక్:
1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, 2 టేబుల్ స్పూన్ల పెరుగు ఒక బౌల్‌లో వేసి మిక్స్ చేయండి. తర్వాత సగం నిమ్మకాయను పిండి వేసి పేస్ట్ లాగా తయారు చేయండి. ఇలా సిద్ధం చేసుకున్న పేస్ట్‌ని ముఖానికి పట్టించి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత నీళ్లతో కడిగి మాయిశ్చరైజర్ రాసుకోవాలి. దీంతో పసుపులో ఉండే యాంటీ-ఆక్సిడెంట్ , యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మొటిమలను తొలగించడంలో సహాయపడతాయి. శనగ పిండి చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. మృత చర్మ కణాలను తొలగిస్తుంది. ఇది ఫేషియల్ ట్యానింగ్‌ను తొలగించి, ఛాయను మెరుగుపరుస్తుంది. పెరుగు ముడతలను తొలగించడంలో సహాయపడుతుంది . విటమిన్ సి పుష్కలంగా ఉండే నిమ్మకాయ చర్మానికి మెరుపును తెస్తుంది.
మరో ఫేస్ ప్యాక్ తయారే చేయడం కోసం అర టేబుల్ స్పూన్ శనగపిండిలో అర టేబుల్ స్పూన్ పసుపు పొడి, ఒక టేబుల్ స్పూన్ గంధపు పొడి, ఒక టీస్పూన్ పచ్చి పాలు, ఒక టీస్పూన్ తేనె వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి. శుభ్రమైన ముఖానికి ఈ పేస్ట్ అప్లై చేసి 20 నిమిషాల తర్వాత శుభ్రమైన నీటితో కడగాలి. పచ్చి పాలలో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మంలోని మృతకణాలను తొలగిస్తుంది. అంతే కాకుండా వడదెబ్బ నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. తేనె చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది. ఇన్ఫెక్షన్ నుండి రక్షిస్తుంది. చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. మురికి , టాక్సిన్‌లను తొలగిస్తుంది. చర్మంలోని తేమను పోగొడుతుంది.