Pushpa 2 Pre-release : ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా పుష్ప 2. ఇదివరకే రిలీజ్ అయిన పుష్ప సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయం సాధించింది. ఆ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ కి ఆ సినిమా బీభత్సంగా ఎక్కేసింది. చాలామంది పొలిటిషియన్స్ ఆ సినిమాలోని డైలాగ్స్ ను వాడడం మొదలుపెట్టారు. అలానే క్రికెటర్స్ కూడా ఆ సినిమాలోని మ్యానరిజమ్స్ రీ క్రియేట్ చేయడం, డాన్స్ మూమెంట్స్ వేయడం మొదలుపెట్టారు. అక్కడితో సినిమాకి మరింత పాపులారిటీ వచ్చింది. ఇకపోతే డిసెంబర్ 5న పుష్ప 2 సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ తరుణంలో ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో జరుగుతుంది. ఈ ఈవెంట్ కు పెద్ద ఎత్తున అభిమానులు ప్రేక్షకులు హాజరవుతున్నారు.
అల్లు అర్జున్ కి ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ కూడా చాలా సందర్భాల్లో అందరికీ అభిమానులు ఉంటారు నాకు ఆర్మీ ఉంటుంది అంటూ చెబుతూ వచ్చారు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చాలామంది చిన్నపిల్లల ఫ్యాన్ బేస్ అల్లు అర్జున్ కి ఉంది. చాలామంది కిడ్స్ వీడియోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉంటాయి.
ఇక ఈవెంట్ కూడా చాలామంది స్టూడెంట్స్ హాజరయ్యారు. ఇక అల్లు అర్జున్ కు, మెగా ఫ్యామిలీ కు మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇదంతా కూడా అల్లు అర్జున్ నంద్యాల వెళ్లి వైయస్సార్సీపి క్యాండిడేట్ అయిన శిల్ప రవికి సపోర్ట్ చేయడం దగ్గర మొదలైంది. అయితే ఈ విషయం పైన అల్లు అర్జున్ కూడా చాలా క్లారిటీ ఇస్తూ వచ్చాడు. కానీ అది ఎవరికీ జెన్యూన్ గా అనిపించలేదు.
ఇక ఈ ఈవెంట్ కి కేవలం అల్లు అర్జున్ అభిమానులు మాత్రమే కాకుండా చాలామంది మెగా ఫ్యామిలీ అభిమానులు కూడా హాజరవుతున్నారు. అక్కడ రియాక్షన్ చూస్తుంటే రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఆ ఈవెంట్ కు హాజరయ్యారు. హాజరు అవ్వడమే కాకుండా అక్కడ కూడా బన్నీని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఫ్రీగా పాసులు ఉన్నాయి కాబట్టి ఈ ఈవెంట్ కి వచ్చాము. అంతేకానీ అభిమానంతో కాదు అంటూ ఫన్నీ రియాక్షన్స్ ఇస్తున్నారు.
ఇక ఏదేమైనా ఈ సినిమాకి మాత్రం మంచి పాజిటివ్ బజ్ ఉంది. బుకింగ్ సేల్స్ కూడా చాలా ఫాస్ట్ గా సేల్ అవుతున్నాయి. ఈ సినిమా విషయానికి వస్తే టిక్కెట్ రేట్లు కూడా భారీగా పెంచారు. టికెట్ రేట్ కి ఆడియన్స్ సాటిస్ఫై అయితే పర్వాలేదు కానీ ఏమాత్రం ఆడియన్స్ అంచనాల తగ్గిన ఈ సినిమా రిస్క్ లో పడటం ఖాయమని కొంతమంది సినీ ప్రేమికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : Pushpa 2: డైరెక్ట్ ‘ఆర్ఆర్ఆర్’ను టార్గెట్ చేస్తున్న ‘పుష్ప 2’.. సక్సెస్ అవ్వగలదా?