BigTV English

Cardamom Milk: పాలలో.. ఏలకులు కలిపి తాగితే ?

Cardamom Milk: పాలలో.. ఏలకులు కలిపి తాగితే ?

Cardamom Milk: ఏలకులలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. చాలా మంది ఏలకులను మౌత్ ఫ్రెషనర్‌గా ఉపయోగిస్తారు. టీ రుచి, వాసనను పెంచడానికి కూడా ఏలకులను వాడతారు. కానీ పాలలో ఏలకులు కలిపి తాగితే కూడా అనేక ప్రయోజనాలు ఉంటాయని మీకు తెలుసా ? అవును.. రాత్రి పడుకునే ముందు ఏలకుల పాలు తాగితే .. శరీరానికి కావాల్సిన అనేక పోషకాలు లభిస్తాయి. పాలలో కాల్షియం పుష్కలంగా ఉన్నప్పటికీ.. ఏలకులు ఆరోగ్యకరమైన జీర్ణక్రియను నిర్వహించడంలో సహాయపడతాయి.


జీర్ణక్రియ ఆరోగ్యం:
ఏలకుల పాలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది మన జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడంలో కూడా సహాయపడుతుంది. పడుకునే ముందు ఏలకుల పాలు తాగడం వల్ల ఉదయం కడుపు పూర్తిగా క్లియర్ అవుతుంది. కాబట్టి మలబద్ధకం ఉన్న రోగులకు ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఏలకులు ఆమ్లతను తగ్గించడంలో కూడా చాలా సహాయపడతాయి. అజీర్ణం,గ్యాస్ వంటి సమస్యలు ఉన్న వారు కూడా ఏలకులు కలిపిన పాలు తీసుకోవడం ద్వారా నయమవుతాయి.

జలుబు, దగ్గు :
సీజనల్ వ్యాధుల వల్ల కలిగే సమస్యలను ఏలకులు సులభంగా తొలగిస్తాయి. పాలలో ఏలకులు కలుపుకుని తాగడం వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యలు తొలగిపోతాయి. ఛాతీలో పేరుకుపోయిన కఫాన్ని తొలగించడంలో కూడా ఏలకుల పాలు సహాయపడతాయి. ఏలకులు కలపడం వల్ల పాల రుచి కూడా పెరుగుతుంది. కాబట్టి పిల్లలకు కూడా దీన్ని సులభంగా ఇవ్వవచ్చు.


నోటి పూత:
నోటిలో పుండ్లు ఉన్నప్పుడు ఆహారం తినడానికి చాలా ఇబ్బంది ఉంటుంది. ఇలాంటి సమయంలో ఏలకులు కలిపిన పాలు తీసుకోవడం నోటి పూత సమస్య నుండి బయట పడవచ్చు. రాత్రిపూట ఏలకుల పాలు తాగడం వల్ల కడుపు శుభ్రంగా ఉంటుంది. మీకు బొబ్బలు ఉంటే, ఏలకులు కలిపిన పాలు తాగడం వల్ల అవి నయమవుతాయి.

రక్తపోటు:
రక్తపోటును అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. అధిక రక్తపోటు ఉన్న రోగులు ఎప్పుడైనా గుండె జబ్బులకు గురయ్యే అవకాశం ఉంది. ఇది మాత్రమే కాదు.. అధిక రక్తపోటు కారణంగా స్ట్రోక్ , గుండెపోటు వంటి అనేక తీవ్రమైన గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం కూడా పెరుగుతుంది. దీనిని నివారించడానికి.. పాలలో ఏలకులతో కలిపి తాగడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. పాలు, ఏలకులు రెండింటిలోనూ మెగ్నీషియం సమృద్ధిగా ఉండటం వల్ల రక్త పోటు తగ్గిస్తాయి

ఎముకలకు బలం:
పాలు ఎముకలను బలోపేతం చేయడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి ఎందుకంటే ఇందులో కాల్షియం ఉంటుంది. ఏలకులలో ఉండే కాల్షియం మొత్తం దాని ప్రయోజనాలను రెట్టింపు చేస్తుంది. అందుకే వృద్ధులు ముఖ్యంగా ఏలకులు కలిపిన పాలు తాగాలి. ఇది వారికి చాలా ప్రయోజనకరంగా అందిస్తుంది.

నిద్రలేమి సమస్య:
రాత్రి బాగా నిద్రపోలేకపోతే.. పడుకునే ముందు ఒక గ్లాసు ఏలకుల పాలు త్రాగాలి. పాలలో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది సెరోటోనిన్ , మెలటోనిన్ అనే రసాయనాలను ఉత్పత్తి చేస్తుంది. ఏలకులు కలిపిన పాలు తాగడం వల్ల బాగా నిద్రపోవడానికి కూడా సహాయపడుతుంది.

Also Read: జుట్టు పెరగాలంటే.. ఈ ఒక్కటి వాడితే చాలు !

బరువు తగ్గడం:
మీరు బరువు తగ్గాలని ఆలోచిస్తుంటే ఏలకుల పాలను క్రమం తప్పకుండా తాగాలి. శరీరం నుండి వ్యర్థ పదార్థాలను తొలగించడంలో ఏలకులు సహాయపడతాయి. గోరువెచ్చని పాలతో ఏలకులు కలిపి తీసుకుంటే.. జీవక్రియను వేగవంతం అవుతుంది. ఫలితంగా రువు తగ్గడానికి అవకాశం ఉంటుంది. బెల్లీ ఫ్యాట్ తగ్గించడంలో ఏలకుల పాలు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి.

Related News

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Weight Loss: ఈ యోగాసనాలతో.. 10 రోజుల్లోనే వెయిట్ లాస్

Sugar: చక్కెర తినడం 30 రోజులు ఆపేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా ?

Hair Care Tips: వర్షంలో జుట్టు తడిస్తే..… వెంటనే ఇలా చేయండి?

Paneer Effects: దే…వుడా.. పన్నీరు తింటే ప్రమాదమా?

Hair Growth Tips: ఈ టిప్స్ పాటిస్తే.. వారం రోజుల్లోనే ఒత్తైన జుట్టు !

Big Stories

×