Rosemary Oil: ఈ రోజుల్లో జుట్టు సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. చాలా మంది జుట్టు ఒత్తుగా పెరగడానికి రకరకాల హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. అయినప్పటికీ ఫలితం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఇలాంటి సమయంలో రోజ్ మేరీ ఆయిల్ వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. రోజ్ మేరీ మీ చర్మ సౌందర్యంతో పాటు జుట్టు పెరుగుదలకు కూడా ఉపయోగపడుతుంది. మరి రోజ్ మేరీ ఆయిల్ ను జుట్టు పెరుగుదలకు ఎలా ఉపయోగించాలనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
రోజ్ మేరీ ఆయిల్ వాడకం వల్ల జుట్టు పెరుగుదల బాగుంటుంది. ఈ నూనెను ఉపయోగించడం వల్ల పొడి జుట్టుకు తిరిగి జీవం వస్తుంది. దీంతో పాటు కొత్త వెంట్రుకలు కూడా మూలాల నుండి పెరగడం ప్రారంభిస్తాయి.
రోజ్మేరీ ఆయిల్ యొక్క ప్రయోజనాలు:
రోజ్మేరీ ఆయిల్లో A, B, C, D2, D3, కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఈ ఆయిల్‌లో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. దీంతో పాటు, సోడియం, పొటాషియం, జింక్, కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం వంటి లక్షణాలు ఈ నూనెలో ఉంటాయి.
జుట్టు పెరుగుదల రెట్టింపు:
జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి.. మీరు కొబ్బరి నూనెతో కలిపిన రోజ్మేరీ నూనెను అప్లై చేయవచ్చు. ఈ నూనె జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే అనేక లక్షణాలు ఉన్నాయి.
జుట్టు రాలడాన్ని నివారిస్తుంది:
మీ జుట్టు విపరీతంగా రాలిపోయి.. అన్ని రకాల హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ వాడినా ఫలితం అంతంత మాత్రంగానే ఈ సమస్య నుండి బయటపడాలంటే మాత్రం మీరు రోజ్మేరీ నూనెను ఉపయోగించాలి. దీనిని వాడటం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అంతే కాకుండా ఇది జుట్టు మూలాలకు సరైన పోషణను అందిస్తుంది. ఇది జుట్టు రాలడాన్ని కూడా తగ్గిస్తుంది.
చుండ్రు తొలగిపోతుంది:
తలలో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు.. అది జుట్టులో చుండ్రు సమస్యను కలిగిస్తుంది. దీని కారణంగా..అనేక రకాల జుట్టు సంబంధిత సమస్యలు మొదలవుతాయి. మీరు వారానికి కనీసం రెండుసార్లు మీ జుట్టుకు రోజ్మేరీ నూనెను ఉపయోగించడం వల్ల చుండ్రు సమస్యలు తగ్గుతాయి. ఇది మీ తలపై ఉండే చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంతో పాటు.. ఇది జుట్టు ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది.
జుట్టుకు రోజ్మేరీ ఆయిల్ ఎలా అప్లై చేయాలి ?
హెయిర్ క్లెన్సర్‌గా ఉపయోగించండి:
కాస్త మెంతి గింజలను తీసుకుని రాత్రంతా నీటిలో నానబెట్టండి. ఈ నీటిలో రోజ్ మేరీ ఆకులను వేసి వేడి చేయండి. తర్వాత చల్లబరచండి. అనంతరం దీన్ని స్ప్రే బాటిల్‌లో నింపి.. ప్రతిరోజూ మీ జుట్టు మూలాలకు అప్లై చేయండి. ఇలా చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గి, జుట్టు పెరుగుదల మెరుగుపడుతుంది.
Also Read: కూరల్లో సాల్ట్ ఎక్కువైందా ? ఇలా చేస్తే.. ప్రాబ్లమ్ సాల్వ్
రోజ్మేరీ హెయిర్ మాస్క్ :
2 టీస్పూన్ల కొబ్బరి నూనెను 1 టీస్పూన్ రోజ్మేరీ నూనెతో కలపండి. దీనికి కాస్త కలబంద జెల్ కలిపి జుట్టుకు అప్లై చేయండి. ఆపై వేడి టవల్ తో జుట్టును కప్పండి. దీన్ని 1 గంట పాటు ఆరిన తర్వాత షాంపూతో జుట్టును వాష్ చేయండి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అంతే కాకుండా జుట్టు మందంగా మారుతుంది. అంతే కాకుండా బలంగా తయారవుతుంది.