BigTV English

Mad Square Movie Review : ‘మ్యాడ్ స్క్వేర్’ మూవీ రివ్యూ

Mad Square Movie Review : ‘మ్యాడ్ స్క్వేర్’ మూవీ రివ్యూ

Mad Square Movie Review : ‘మ్యాడ్’ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో దానికి సీక్వెల్ గా ‘మ్యాడ్ స్క్వేర్’ తీశారు. హిట్టు సీక్వెల్ కావడంతో దీనిపై మొదటి నుండి మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆ అంచనాలను అందుకుందో లేదో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి..


కథ :
గణేష్ అలియాస్ లడ్డు(విష్ణు ఓఐ) జైల్లో ఉన్న ఎపిసోడ్ తో సినిమా మొదలవుతుంది. లడ్డుకి పెళ్లి కుదరడం.. ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత అతని పెళ్ళికి ముహూర్తం ఫిక్స్ చేయడంతో విషయం తెలుసుకున్న ముగ్గురు ఫ్రెండ్స్ మనోజ్(రామ్ నితిన్), అశోక్(నార్నె నితిన్), దామోదర్(సంగీత్ శోభన్) లు.. అతని పెళ్ళికి వస్తారు. వాళ్ళు వచ్చినప్పటి నుండి లడ్డుకి అనేక సమస్యలు వచ్చి పడుతుంటాయి. వాళ్ళ వల్ల పెళ్లి ఎక్కడ ఆగిపోతుందో అనే భయంతో ఉంటాడు లడ్డు. అయితే ఊహించని విధంగా అతను పెళ్లి చేసుకోవాలనుకునే అమ్మాయి ముహూర్తం టైంకి లేచిపోతుంది.అప్పటికే తన హనీమూన్ కోసం గోవాలో ఒక రిసార్ట్ బుక్ చేసుకుంటాడు లడ్డు. అది క్యాన్సిల్ చేసుకోబోతుండగా.. హనీమూన్ కాకపోతే ఏంటి.. ‘ఇప్పుడు మనం వెళ్లి అక్కడ ఎంజాయ్ చేద్దాం’ అంటూ మనోజ్,అశోక్,డిడి..లు లడ్డుని వెంటేసుకుని గోవా వెళ్తారు. అక్కడ ఊహించని విధంగా వీళ్ళు ఓ క్రైమ్లో ఇరుక్కుంటారు. ఇతన్ని క్రైమ్లో ఇరికించింది ఎవరు? లడ్డు ఎందుకు జైలుకి వెళ్లాల్సి వచ్చింది? మధ్యలో అతని తండ్రి(మురళీధర్ గౌడ్) ఎందుకు గోవాకి ఎందుకు రావాల్సి వచ్చింది? ఈ ప్రశ్నలకి సమాధానమే మిగిలిన సినిమా.

విశ్లేషణ :
నిర్మాత నాగవంశీ మొదటి నుండి చెప్పినట్టు గానే ‘మ్యాడ్ స్క్వేర్’ లో కథ ఏమీ లేదు. మొదటి భాగంలో లవ్ స్టోరీలు అయినా చెప్పుకోడానికి ఉన్నాయి. కానీ ‘మ్యాడ్ స్క్వేర్’ విషయంలో అలాంటి కహానీలు ఏమీ కనిపించవు. కానీ ఎక్కడైతే బోరు కొడుతుంది అని ఆడియన్స్ ఫీలవుతారో అక్కడ ఓ మంచి కామెడీ సీన్ పెట్టి.. ఎంగేజ్ చేస్తూ వచ్చాడు దర్శకుడు కళ్యాణ్ శంకర్. లడ్డు పెళ్లి ఎపిసోడ్ ఫ్రెండ్స్ గ్యాంగ్ చేసే కామెడీతో పాటు మురళీధర్ గౌడ్ కామెడీ టైమింగ్ కూడా మెప్పిస్తుంది. ఇంటర్వెల్ ఎపిసోడ్ క్రేజీగా అనిపిస్తుంది. సగం ప్రెజెంట్, సగం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ వస్తుంటాయి. సెకండాఫ్ లో మాత్రం కొన్ని డైలాగులు ఫ్యామిలీ ఆడియన్స్ ని ఇబ్బంది పెట్టే విధంగా ఉంటాయి. కానీ సత్యం రాజేష్, సునీల్ ట్రాక్..లు బాగా వర్కౌట్ అయ్యాయి. ఇలాంటి సినిమాలకి ఎడిటింగ్ పార్ట్ చాలా కష్టం. అందుకు ఎడిటర్ ని అభినందించాల్సిందే. నిర్మాణ విలువలకి పేరు పెట్టాల్సిన పనిలేదు. కథ లేకుండా 2 గంటల వరకు ప్రేక్షకులను కుర్చోపెట్టడం అనేది కూడా టఫ్ టాస్క్. ఆ విషయంలో కళ్యాణ్ శంకర్ కి కచ్చితంగా మంచి మార్కులే పడతాయి. భీమ్స్ మ్యూజిక్లో రూపొందిన లడ్డు గాని పెళ్లి, స్వాతి రెడ్డి పాటలు బాగున్నాయి. వాటిలో మాస్ అప్పీల్ కూడా ఉండటం ఒక అడ్వాంటేజ్.


నటీనటుల విషయానికి వస్తే… ముగ్గురు హీరోలు ఉన్నప్పటికీ ఈ సినిమాలో ఎక్కువ మార్కులు లడ్డు పాత్ర చేసిన విష్ణుకే పడతాయి. తర్వాత మురళీధర్ గౌడ్, సత్యం రాజేష్..లు కూడా బాగా చేశారు. హీరోల్లో సంగీత్ శోభన్, రామ్ నితిన్ తమ మార్క్ నటనతో మెప్పిస్తారు. నార్నె నితిన్ జస్ట్ ఓకే. కానీ మిగిలిన ఇద్దరు హీరోలతో పోలిస్తే.. ఇతను కొంచెం తక్కువగానే కనిపిస్తాడు. సునీల్, రఘుబాబు వంటి వారు తమ తమ పాత్రలకి న్యాయం చేశారు.

ప్లస్ పాయింట్స్ :

కామెడీ
రన్ టైం
ఫస్ట్ హాఫ్

మైనస్ పాయింట్స్ :

లాజిక్స్ లేకపోవడం
కథ లేకపోవడం
సెకండాఫ్ కొంచెం సాగదీసినట్టు అనిపించడం

మొత్తంగా ‘మ్యాడ్ స్క్వేర్’ … ‘మ్యాడ్’ రేంజ్లో కంప్లీట్ శాటిస్ఫేక్షన్ ఇవ్వదు. కథ లేకపోవడం.. కేవలం కామెడీ పైనే ఆధారపడి తీసిన సినిమా కావడంతో ‘జాతి రత్నాలు’ ఫీలింగ్ ఇస్తుంది. ఫ్రెండ్స్ గ్యాంగ్ తో మాత్రమే వెళ్లి చూడగల సినిమా. కాదు అంటే ఒంటరిగా వెళ్లినా లేక ఫ్యామిలీతో వెళ్లినా.. ఈ సినిమాతో కనెక్ట్ అవ్వడం కష్టం

Mad Square Telugu Movie Rating : 2.5/5

Related News

Bakasura Restaurant Movie Review : బకాసుర రెస్టారెంట్ రివ్యూ : హాఫ్ బేక్డ్ మూవీ

Coolie First Review: కూలీ మూవీ ఫస్ట్ రివ్యూ.. హైప్ ని మ్యాచ్ చేస్తుందా?

Arebia Kadali Review: అరేబియ కడలి రివ్యూ.. తండేల్‌కి తక్కువే ?

SU from SO Telugu Review : ‘సు ఫ్రొం సో’ రివ్యూ’ రివ్యూ… ఇది ఊహించని కామెడీ

Mayasabha Review : మయసభ రివ్యూ 

Sir Madam Review : ‘సర్ మేడమ్’ మూవీ రివ్యూ… విడాకుల దాకా వెళ్లిన వింత గొడవ

Big Stories

×