BigTV English

Heart Stroke Causes: వానాకాలంలో హార్ట్ స్ట్రోక్ ప్రమాదం ఎక్కువ.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు.

Heart Stroke Causes: వానాకాలంలో హార్ట్ స్ట్రోక్ ప్రమాదం ఎక్కువ.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు.

Heart Stroke Causes: వర్షాకాలంలో అనేక అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. గాలిలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల అది మన చర్మంపై ఎక్కువసేపు ఉండిపోతుంది. దీంతో శరీరం త్వరగా చల్లబడదు. ఫలితంగా ఎక్కువ వేడి అనుభూతి కూడా కలుగుతుంది. ఇది మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. వానకాలం గుండె, చర్మానికి బాగా హాని కలుగుతుంది, ఫుడ్ పాయిజనింగ్, వైరల్ ఇన్ఫెక్షన్ వంటి సమస్యలను ఈ సీజన్‌లో చుట్టుముట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాస్త జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదంలోకి నెట్టేస్తాయి.


తేమ గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది..
వానా కాలంలో వాతావరణంలో అధిక తేమ ఉంటుంది. ఇది శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, అలర్జీలకు కారణమవుతుంది. హృదయ సంబంధిత సమస్యలతో బాధపడేవారికి కూడా ఈ సీజన్ ప్రాణాంతకం. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చేసిన పరిశోధనలో అధిక తేమ గుండెకు ఎంత ప్రమాదమో వివరిస్తోంది. తేమ పెరిగే కొద్దీ గుండె జబ్బుల వల్ల కలిగే మరణాల సంఖ్య కూడా మూడురెట్లు అధికం అవుతుందని పరిశోధనలో వెల్లడైంది.

అదే సమయంలో ఉష్ణోగ్రత, తేమ రెండూ పెరగడం కూడా గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుందని మరో అధ్యయనంలో వెల్లడైంది. ఎండలోకి వెళ్లినప్పుడు శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. ఫలితంగా డీ హైడ్రేట్ అయ్యి గెండెకు ప్రమాదం పెరుగుతుంది. శరీరంలో అధిక రక్తపోటు చాలా హానికరం. వాతావరణ మార్పు పిల్లల రోగనిరోధక శక్తిని కూడా బలహీనపరుస్తుంది. ఈ సమయంలో వైరల్ ఇన్‌ఫెక్షన్లకు ఎక్కువ గురవుతుంటారు. ఎక్కువగా తేమ కూడా అలసటను పెంచుతుంది.


మానసిక ఆరోగ్యం గురించి మాట్లాడితే ఎక్కువ తేమ మీ మానసిక స్థితి పాడుచేస్తుంది. మానసిక స్థితి నియంత్రించే మెదడులోని రసాయనాలను ఇది ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అధిక తేమ కారణంగా మానసిక ఆందోళనకు కూడా గురవు తుంటారు. అధిక తేమ, జుట్టు, చర్మానికి హానిని కలుగజేస్తుంది. ఇక చర్మం విషయానికి వస్తే ఈ సీజన్‌లో చర్మ రంధ్రాలు మూసుకుపోవడం వల్ల మొటిమల సమస్య కూడా బాగా పెరుగుతుంది. ఇది ఆరోగ్యాన్ని కూడా పాడు చేస్తుంది. ఈ సీజన్‌లో ఫంగస్ పెరుగుదల కారణంగా ఆహారం త్వరగా చెడిపోతుంది. కాబట్టి ఆరోగ్యం తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

Also Read: చపాతీను ఇలా తింటే కొలస్ట్రాల్ ఇట్టే మాయం అవుతుంది..

మనం నివసిస్తున్న చోటు నుంచి తేమను తగ్గించడం వల్ల సమస్య తగ్గించవచ్చు. అటువంటి పరిస్థితిలో ఇంటిని శుభ్రంగా క్రిమి సంహారకంగా ఉంచుకోండి. మీ మొదటి బాధ్యత గదుల్లో తేమను దూరంగా ఉంచడానికి ప్రయత్నించండి. ఇంటి పైకప్పు పై వాటర్ ప్రూఫ్ కోటింగ్ ఏర్పాటు చేయడం చాలా మంచిది.

Related News

Hyderabad: ఘనంగా రన్ ఫర్ ఎస్ఎంఏ – 2025 కార్యక్రమం!

Vitamin D: విటమిన్ డి కోసం.. ఏ టైమ్‌లో ఎండలో నిలబడాలి ?

Iron Rich Foods:తరచూ నీరసంగా, అలసిపోయినట్లు అనిపిస్తోందా? అయితే ఇవి తినండి

Natural Face Packs: ఫేస్ క్రీములు అవసరమే లేదు, ఈ ఫేస్ ప్యాక్స్‌తో మెరిసే చర్మం

Pneumonia causes: న్యుమోనియా రావడానికి అసలు కారణాలివే !

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Big Stories

×