BigTV English

Adulterants Food Items: కల్తీ ఆహారాన్ని గుర్తించేది ఎలా? తేనె నుంచి మాంసం వరకు.. ఈ సింపుల్ టిప్స్‌తో తెలుసుకోండి

Adulterants Food Items: కల్తీ ఆహారాన్ని గుర్తించేది ఎలా? తేనె నుంచి మాంసం వరకు.. ఈ సింపుల్ టిప్స్‌తో తెలుసుకోండి

అక్రమ సంపాదనకు అలవాటుపడ్డ చాలా మంది కల్తీలకు పాల్పడుతున్నారు. పాల నుంచి తేనె వరకు, కూరగాయల నుంచి పండ్ల వరకు.. కారం పొడి నుంచి జీలకర్ర వరకు ఎక్కడ వీలుంటే అక్కడ కల్తీ చేస్తున్నారు. పాలలో నీళ్లు, నెయ్యిలో ఫామ్ ఆయిల్, పప్పు, బియ్యంలో రాళ్లు, పిండిలో సున్నం, కారంలో రంపపుపొడి కలుపుతున్నారు. కల్తీ ఆహార పదార్థాల కారణంగా బోలెడు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రతి పదార్థంలో కల్తీ చేస్తున్న నేపథ్యంలో కొన్ని చిట్కాలు ఉపయోగించి ఆయా పదార్థాల్లో కల్తీ జరిగిందా? లేదా? అని తెలుసుకోవచ్చు.


కల్తీ పదార్థాలను ఎలా గుర్తించాలి? 

1.పాలు


పాలలో కల్తీ జరిగిందో లేదో సింపుల్ గా తెలుసుకోవచ్చు. ఏదైనా ఒక పాత్ర మీద ఒక చుక్క పాలు పోయాలి. పాలు ఎలాంటి మరక లేకుండా కింది జారితే పాలలో నీళ్లు కలిపినట్లు అర్థం. పాలు కలిపినప్పుడు నురగ వచ్చినా డిటడ్జెంట్ కలిపినట్లు అర్థం చేసుకోవాలి.

2.తేనె

గ్లాస్ లో కొన్ని నీళ్లు తీసుకుని రెండు చుక్కలు తేనె కలపాలి. తేనె కిందికి చేరితే కల్తీ లేదని భావించాలి. ఒకవేళ నీళ్లలో కలిసిపోతే కల్తీ ఉన్నట్లు అర్థం.

3.పసుపు, కారం

నీళ్లలో కాస్త కారం కలపాలి. అడుగుకు చేరితే మంచిదని అర్థం. కల్తీకారం అయితే నీళ్లలో రంగు కలుస్తుంది. పసుపును కూడా నీళ్లలో కలిపితే అడుగు భాగానికి చేరుతుంది. కల్తీ అయితే నీళ్లలో రంగు కలుస్తుంది.

4.టీ, కాఫీ

తడి పేపర్ మీద కాస్త టీ పొడి చల్లాలి. దాని మీద ఇంకా ఏదైనా రంగు కనిపిస్తే టీపొడిలో కలర్ కలిపారని అర్థం. అలాగే నీళ్లలో కాస్త కాఫీ పౌడర్ కలిపితే మంచిదైతే అడుగుకు చేరే ముందు నీటి మీద తేలుతుంది. కల్తీ అయితే, నేరుగా అడుగు భాగానికి చేరుతుంది.

5.కూరగాయలు

కూరగాయల మీద రంగు పూసినట్లు అనుమానంగా ఉంటే, కాస్త కాటన్ తీసుకుని నీళ్లలో ముంచి కూరగాయాల  మీద రుద్దాలి. పత్తి రంగు మారితే రండు వేశారని అర్థం చేసుకోవాలి.

6.పండ్లు

అరటి పండు మంచిదా? కాదా? అని సింపుల్ గా తెలుసుకోవచ్చు. అరటి పండు మీద కొన్ని నీటి చుక్కలు వేయాలి. డ్రాప్స్ పడిన చోట గోధుమ రంగులోకి మారితే కార్బైడ్ లాంటి రసాయనాల వేసి పండించినట్లు గుర్తించాలి.

6 గోధుమ

గోధుమ పిండిలో కల్తీ ఉందో? లేదో? తెలుసుకోవాలంటే గ్లాసు నీళ్లలో కాస్త పిండి కలపాలి. కల్తీ లేని పిండి నేరుగా అడుగు భాగానికి చేరుతుంది. కల్తీ పిండి నీటిలో కలిసిపోతుంది.

7.మాంసం

స్వచ్ఛమైన మాంసం ఎలాంటి షైనింగ్ కలిగి ఉండదు. మాంసాన్ని నొక్కితే గట్టిగా, రబ్బర్ మాదిరిగా ఉంటే రసాయనాలను ఉపయోగించినట్లు అర్థం చేసుకోవాలి.

9.నూనెలు

కొబ్బరి నూనెను చిన్న పాత్రలో పోసి ఫ్రిజ్ లో పెట్టాలి. గడ్డ కడితే మంచిదని, గడ్డ కట్టకపోతే కల్తీదని అర్థం.

10.వెన్న

కాస్త వెన్నెను చెంచాలో వేసి కరిగించాలి. స్వచ్ఛమైన వెన్నె వెంటనే కరిగి గోధుమ రంగులోకి మారుతుంది. కల్తీ వెన్నె కరగడానికి చాలా సమయం తీసుకుంటుంది.

Read Also: వయాగ్రా.. తెగ వాడేస్తున్నారు, ఇండియాలో భారీగా పెరిగిన సేల్స్.. గణంకాలు చూస్తే షాకవుతారు..

Related News

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Weight Loss: ఈ యోగాసనాలతో.. 10 రోజుల్లోనే వెయిట్ లాస్

Sugar: చక్కెర తినడం 30 రోజులు ఆపేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా ?

Big Stories

×