Hair Oil: చలికాలంలో తీవ్రంగా జుట్టు రాలే సమస్య బాగా పెరుగుతుంది. ముఖ్యంగా ఈ సీజన్‌లో వాతావరణంలో ఉష్ణోగ్రత తగ్గడంతో పాటు తక్కువ తేమ కారణంగా జుట్టు రాలడం ప్రారంభం అవుతుంది. తేమ కారణంగా జుట్టు మూలాలు కూడా బలహీనపడతాయి. అంతే కాకుండా స్కాల్ప్ పొడిగా మారుతుంది. ఇలాంటి పరిస్థితిలోనే చాలా మంది హెయిర్ ఆయిల్స్ తో , షాంపూలతో పాటు కెరాటిన్ వంటి వివిధ రకాల చికిత్సలు తీసుకుంటారు. కానీ కొన్ని సార్లు వీటితో పెద్దగా ప్రయోజనం ఉండదు.
చలికాలంలో జుట్టు రోజు రోజుకు చెడిపోతుంది. నిజానికి మార్కెట్‌లో లభించే, రసాయనాలు అధికంగా ఉండే ఉత్పత్తులు మన జుట్టుకు హాని కలిగిస్తాయి. అందుకే కొన్ని హోం రెమెడీస్ వాడాలి. రసాయనాలు లేని నూనె ఎలా తయారు చేసుకోవాలి. దీనిని ఉపయోగించే విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
హోం మేడ్ ఆయిల్ :
కావలసినవి:
మెంతులు గింజలు – 2 టేబుల్ స్పూన్లు
వేప- 8-10 ఆకులు
కరివేపాకు – 10 ఆకులు
డ్రై ఆమ్లా పౌడర్ – 1 టేబుల్ స్పూన్
ఆవాల నూనె – 1 కప్పు
కొబ్బరి నూనె – 1 కప్పు
తయారు చేసే పద్ధతి:
ఈ ఆయిల్ తయారు చేయడానికి ముందుగా మీరు ఒక పెద్ద పాత్రలో కొబ్బరి, ఆవాల నూనె వేసి కలపాలి. తర్వాత ఈ ఆయిల్‌లో మెంతి గింజలు, కరివేపాకు, వేప ఆకులు, ఆమ్లా పొడి వేసి రాత్రంతా అలాగే ఉంచండి. ఉదయం ఈ మిశ్రమాన్ని గ్యాస్‌పై వేసి బాగా మరిగించాలి. మీరు దీన్ని దాదాపు అరగంట పాటు బాగా ఉడికించాలి. ఆయిల్ రంగు మారాక చల్లబరచండి. తర్వాత ఏదైన ఒక కంటైనర్‌లోకి ఫిల్టర్ చేయండి. ఇంట్లో తయారుచేసిన ఈ నూనె వాడటానికి సిద్ధంగా ఉంది. మీరు మీ జుట్టును వాష్ చేయడానికి ముందుగా ఈ ఆయిల్ అప్లై చేసి, మసాజ్ చేయండి. మీరు ఈ నూనెను వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఉపయోగించవచ్చు.
జుట్టు నుండి ఆరబెట్టడానికి సరైన మార్గం :
మెరిసే వెంట్రుకలకు చిట్కాలు :
తరచుగా, జుట్టును వాష్ చేసిన తర్వాత టవల్‌తో గట్టిగా రుద్దడం ద్వారా దానిని ఆరబెట్టడానికి ప్రయత్నిస్తారు. కానీ ఈ పద్ధతి జుట్టుకు హాని కలిగిస్తుంది .
ఏమి చేయాలి:
జుట్టు నుండి నీటిని తొలగించడానికి, వాటిని రుద్దడానికి బదులుగా టవల్‌తో మెత్తగా తడపండి.
మైక్రోఫైబర్ తువ్వాళ్లను ఉపయోగించండి, ఇది జుట్టు క్యూటికల్స్ దెబ్బతినకుండా నీటిని పీల్చుకుంటుంది.
ప్రయోజనం: ఈ పద్ధతి జుట్టు క్యూటికల్స్ గరుకుగా మారకుండా కాపాడుతుంది. అంతే కాకుండా వాటిని మృదువుగా ఉంచుతుంది.
2. సీరమ్స్ , క్రీములతో జుట్టుకు పోషణ:
జుట్టుకు చర్మంలాగా నూనె , క్రీమ్ రెండూ అవసరం. మీరు మీ జుట్టును కడిగిన తర్వాత సరైన ఉత్పత్తులను ఉపయోగిస్తే, మీ జుట్టు ఎల్లప్పుడూ బాగుంటుంది.
ఏమి చేయాలి:
జుట్టు నుండి అదనపు నీటిని తొలగించిన తర్వాత, నూనె, సిలికాన్ లేదా నీటి ఆధారిత హెయిర్ సీరమ్‌ను అప్లై చేయండి.
ఈ సీరమ్‌ను హెయిర్‌క్రీమ్‌తో మిక్స్ చేసి జుట్టుకు అప్లై చేయండి.
దీన్ని ప్రత్యేకంగా జుట్టు పొడవు ,చివర్లలో అప్లై చేయండి.
ప్రయోజనం: ఈ మిశ్రమం జుట్టును లోతుగా పోషించి, పొడిబారకుండా నిరోధిస్తుంది. అంతే కాకుండా వాటిని సిల్కీ మెరిసేలా చేస్తుంది.
Also Read: తేనెలో ఈ ఒక్కటి కలిపి వాడారంటే.. తెల్లగా మెరిసిపోతారు
3. హెయిర్ డ్రైయర్ సరిగ్గా ఉపయోగించండి:
చాలా మంది జుట్టును ఆరబెట్టడానికి బ్లో డ్రైయర్‌లు లేదా ఇతర హీటింగ్ టూల్స్‌ను ఎక్కువగా ఉపయోగిస్తారు . కానీ ఈ అలవాటు దీర్ఘకాలంలో జుట్టుకు హాని కలిగిస్తుంది.
ఏమి చేయాలి:
జుట్టు పొడిగా చేయడానికి బ్లాస్ట్ డ్రై టెక్నిక్‌ని అనుసరించండి. దీని అర్థం డ్రైయర్‌ను లైట్ సెట్టింగ్‌లో అమర్చడం, జుట్టును నెమ్మదిగా ఆరబెట్టడం.
జుట్టు సహజంగా ఆరనివ్వండి. అంతే కాకుండా దానిని సెట్ చేయడానికి దువ్వెనను ఉపయోగించండి.