Koyila Song : ఒక సినిమాలో అవకాశం కోసం నటీనటులు చెప్పులు అరిగేలా ఆఫీసుల చుట్టూ ఎలా అయితే తిరుగుతారో.. ఇక్కడ ఒక పాట కూడా సినిమాలో స్థానం దక్కించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఆఖరికి అందరి దర్శకులు దగ్గరకు వెళ్ళింది. అలా ఏకంగా నలుగురు డైరెక్టర్ల చేత రిజెక్ట్ చేయబడింది. ఇక చేసేదేమీ లేక ఆ పాటను ఓన్ గా విడుదల చేయగా ఇప్పుడు అదే పాట ట్రెండింగ్ లో నిలిచి అందరి దృష్టిని ఆకట్టుకుంది. మరి ఆ పాట ఏంటి ? అసలు ఏంటి దీని కథ? అనే విషయం ఇప్పుడు చూద్దాం.
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానిన్ (Vijai Bulganin) తన టీం తో కలిసి ‘కొయిల ‘ అనే పాటను రూపొందించారు. ఈ పాటను సినిమాల్లో ఎలాగైనా పెట్టాలని, ఎంతో మంది దర్శకులు చుట్టూ తిరిగారు. అందులో భాగంగానే ఏకంగా ఒక ముగ్గురు నలుగురు దర్శకులకు వినిపించినా.. ఎవరూ కూడా ఈ పాటను తమ సినిమాల్లో తీసుకోవడానికి అంగీకరించలేదు. దీంతో చేసేదేమీలేక, పడిన కష్టం వృధా కాకుండా విజయ్ బుల్గానిన్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఒక్కసారిగా సంచలనం సృష్టిస్తోంది. తన పాటను ఎవరూ సినిమాల్లో పెట్టుకోకపోవడంతో తన టీం తో కలిసి స్వతంత్రంగా విడుదల చేశారు.
అలేఖ్య హారిక , వినయ్ షణ్ముఖ్ నటించిన ఈ పాటకు ప్రేక్షకుల నుండి ఊహించని స్పందన లభిస్తోంది. అద్భుతమైన సంగీతం, అందమైన విజువల్స్ తో యూట్యూబ్ లో ఏకంగా 8.4కోట్ల వ్యూస్ తో ఈ పాట యూట్యూబ్లో ట్రెండ్ సెట్ చేసింది. ఒకప్పుడు దర్శకులు వద్దని రిజెక్ట్ చేసిన ఈ పాటని ప్రేక్షకులు నెత్తిన పెట్టుకోవడం విశేషం. మొత్తానికైతే ఈ పాట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడమే కాకుండా 84 మిలియన్ కి పైగా వ్యూస్ రావడం గమనార్హం.
also read: 37 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న ప్రముఖ నటి!
ఇక మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానిన్ విషయానికొస్తే.. తెలుగు చిత్రాలకు సంగీత దర్శకుడిగా పనిచేస్తూ.. మంచి పేరు సొంతం చేసుకున్నారు. 2023లో వచ్చిన ‘బేబీ’ చిత్రానికి సంగీతం అందించి.. విశేష ఆదరణ సొంతం చేసుకున్నారు. అంతేకాదు ఈ చిత్రానికి ఉత్తమ సంగీత దర్శకుడు విభాగంలో ఫిలింఫేర్ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. 2015లో వచ్చిన వారధి చిత్రంతో తన కెరీర్ ను మొదలుపెట్టిన ఈయన.. సప్తగిరి ఎక్స్ప్రెస్ , రెండు రెళ్ళు ఆరు, సప్తగిరి ఎల్.ఎల్.బి, వజ్రకవచధర గోవిందా ఇలా పలు చిత్రాలకు పనిచేసి మంచి పేరు సొంతం చేసుకున్నారు. ఇక ఈ మధ్యకాలంలో కోర్టు , బ్యాండ్ మేళం , కామ్రేడ్ కళ్యాణ్ వంటి చిత్రాలకు పని చేసిన విజయ్.. ప్రస్తుతం అలియాస్ రుక్మిణి చిత్రానికి కూడా సంగీతం అందిస్తున్నారు. మురళి కాంత్ దేవసోత్ రచన దర్శకత్వంలో యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపుదిద్దుకుంటున్న చిత్రం అలియాస్ రుక్మిణి. డిసెంబర్ 4న రాబోతున్న ఈ చిత్రంలో నితిన్ హీరోగా నటిస్తుండగా .. బాలీవుడ్ బ్యూటీ ఆఫియా సయ్యద్ తొలిసారి తెలుగు తెరకు పరిచయం కాబోతున్నారు.