Gutti Vankaya Vepudu: భోజనం ప్లేట్లో ఎన్ని రకాల కూరలున్నా.. కమ్మని మసాలా వాసనతో ఘుమఘుమలాడే గుత్తి వంకాయ కనిపిస్తే ఆ సంతోషమమే వేరు. పల్లీలు, నువ్వుల పొడితో కూరిన లేత వంకాయలు నూనెలో దోరగా మగ్గుతుంటే వచ్చే ఆ సువాసనకే సగం ఆకలి తీరిపోతుంది. ఎప్పుడూ చేసే గ్రేవీ కూరల్లా కాకుండా, కాస్త భిన్నంగా, వేడివేడి అన్నంలోకి కలుపుకోవడానికి లేదా పప్పుచారు, రసం లాంటి వాటిలోకి నంజుకోవడానికి ఈ గుత్తి వంకాయ వేపుడు అద్భుతంగా ఉంటుంది. ఎలాంటి హడావుడి లేకుండా, మన వంటింట్లో ఉండే సాధారణ దినుసులతోనే నోరూరించే ఈ వంటకాన్ని ఎంతో సులువుగా సిద్ధం చేసుకోవచ్చు.
చిన్న వంకాయలు – అర కిలో
ఉల్లిపాయలు – రెండు
టమోటాలు – రెండు
పచ్చిమిర్చి – 3
అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్
కారం – రెండు టీస్పూన్లు
ధనియాల పొడి – ఒక టీస్పూన్
జీలకర్ర పొడి – అర టీస్పూన్
Also Read: పాతకాలం నాటి కమ్మని కొబ్బరి బూరెలు.. ఈ సీక్రెట్ టిప్ పాటిస్తే మొదటిసారే పర్ఫెక్ట్గా కుదురుతాయి!
పసుపు – పావు టీస్పూన్
గరం మసాలా – అర టీస్పూన్
ఉప్పు – తగినంత
ఆవాలు – అర టీస్పూన్
జీలకర్ర – అర టీస్పూన్
కరివేపాకు – రెండు రెమ్మలు
నూనె – తగినంత
కొత్తిమీర – కొద్దిగా
వంకాయలను శుభ్రంగా కడిగి కాడలు తీసేయకుండా నాలుగు వైపులా గాట్లు పెట్టుకోవాలి. ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని కొద్దిగా ఉప్పు వేసి అందులో వంకాయలను వేయాలి. ఇలా చేయడం వల్ల వంకాయలు రంగు మారకుండా ఉంటాయి. ఇప్పుడు ఉల్లిపాయలు, టమోటాలు, పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకోవాలి.
స్టవ్ మీద బాణలి పెట్టి సరిపడా నూనె వేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు కలపాలి. అనంతరం టమోటా ముక్కలు వేసి మెత్తబడే వరకు ఉడికించాలి.
ఇప్పుడు కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. ఇందులో వంకాయలను వేసి మసాలా అంతా పట్టేలా కలిపి మూత పెట్టాలి. మధ్యమధ్యలో కలుపుతూ చిన్న మంటపై వంకాయలు మెత్తగా ఉడికే వరకు ఉంచాలి. వంకాయలు ఉడికి మసాలా చిక్కబడిన తర్వాత కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన గుత్తి వంకాయ వేపుడు రెడీ.
Also Read: మహారాష్ట్ర స్పెషల్ ‘పిత్లా భాక్రీ’.. తక్కువ టైంలోనే అదిరిపోయే రుచి!